three arrested
-
థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ముగ్గురి అరెస్ట్
చిక్కడపల్లి: ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్లో ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట..ఒకరి మృతి ఘటనలో థియేటర్ యజమాని, ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చిక్కడపల్లి ఏసీపీ ఎల్.రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజునాయక్, ఎస్ఐ మౌనికలు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఇక్కడ వారు మీడియాతో మాట్లాడుతూ థియేటర్లో ముందు రోజే భారీ హంగామా చేయడం, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం వహించడం వల్లే రేవతి అనే మహిళ మృతిచెందినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. సినిమా నటులు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు వస్తున్నారన్న విషయం థియేటర్ నిర్వాహకులు తమకు తెల్పలేదన్నారు. విచారణ అనంతరం సంధ్య థియేటర్‌కు సంబంధించిన ఏడుగురు యజమానుల్లో ఒకరైన ముడుపు సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోయర్ బాల్కనీని చూసుకునే మేనేజర్ గంధం విజయ్చందర్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరిస్థితిపై లీగల్ టీంను సంప్రదించి..తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్‌కు కూడా నోటీసులు ఇస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. -
Californium: 50 గ్రాముల రాయి... రూ. 850 కోట్ల ఖరీదు!
పట్నా: అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియంను గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తుండగా బిహార్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారినుంచి 50 గ్రాముల కాలిఫోర్నియంను స్వా«దీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా రూ.850 కోట్ల దాకా ఉంటుందని గోపాల్‌గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ వెల్లడించారు! గ్రాము ధర రూ.17 కోట్లు పలుకుతుందని ఆయన వివరించారు. ‘‘పక్కా సమాచారం మేరకు జిల్లా ఇన్వెస్టిగేషన్ విభాగం, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఎస్టీఎఫ్ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. యూపీ, బిహార్ సరిహద్దులో మోటార్‌బైక్ మీద వస్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా కాలిఫోరి్నయం దొరికింది’’ అని తెలిపారు. దీనిపై అణు ఇంధన శాఖకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. ఎందుకింత ఖరీదు? కాలిఫోర్నియం అత్యంత అరుదైన రేడియోధార్మిక పదార్థం. ఇది ప్రకృతిలో సహజంగా లభించదు. ప్రయోగశాలల్లో హెచ్చు పీడనంతో కూడిన ఐసోటోప్ రియాక్టర్లలో తయారు చేయాల్సి ఉంటుంది. ఎంతగానో శ్రమించిన మీదట అత్యంత స్వల్ప పరిమాణాల్లో మాత్రమే తయారవుతుంది! దీన్ని తయారు చేయగల సామర్థ్యమున్న అణు రియాక్టర్లు రెండే ఉన్నాయి! ఒకటి అమెరికాలో, రెండోది రష్యాలో. 1950లో భౌతిక శాస్త్ర పరిశోధకులు స్టాన్లీ గెరాల్డ్ థాంప్సన్, కెనెత్ స్ట్రీట్ జూనియర్, అల్బర్ట్ గిరోసో, గ్లెన్ టి.సీబోర్గ్ దీన్ని తొలిసారిగా తయారు చేశారు. ఈ రేడియో ధారి్మక పదార్థాన్ని భూగర్భంలో బంగారు, వెండి నిల్వల అన్వేషణతో పాటు ఇంధన క్షేత్రాల్లో చమురు, నీటి పొరలను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. -
Narcotics Control Bureau: తమిళ నిర్మాత సూత్రధారిగా డ్రగ్స్ రాకెట్
న్యూఢిల్లీ: తమిళ సినీ నిర్మాత సూత్రధారిగా ఉన్న భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేసియాల్లో విస్తరించిన డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. ఢిల్లీలో ఇటీవల జరిపిన సోదాల్లో డ్రగ్స్ తయారీకి వాడే 50 కిలోల సూడో ఎఫెడ్రిన్ రసాయనాన్ని స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరు డ్రగ్స్‌ను ఓడలు, విమానాల్లో హెల్త్ మిక్స్ పౌడర్, కొబ్బరి పొడిలో డబ్బాలో దాచి రవాణా చేస్తున్నట్లు తేలిందని పేర్కొంది. కిలో రూ.1.5 కోట్లుండే సూడో ఎఫెడ్రిన్‌తో మెథాంఫెటమైన్ అనే ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్‌ను తయారు చేస్తారు. న్యూజిలాండ్ కస్టమ్స్, ఆస్ట్రేలియా పోలీసుల సమాచారం మేరకు డ్రగ్స్ రాకెట్‌పై విచారణ చేపట్టినట్లు ఎన్సీబీ వివరించింది. ఇవి ఢిల్లీ నుంచే రవాణా అవుతున్నట్లు అక్కడి బసాయ్దారాపూర్లోని గోదాం నుంచి వస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. పట్టుబడిన వారిని విచారించగా గత మూడేళ్లలో రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడో ఎఫెడ్రిన్‌ను 45 దఫాలుగా పంపించినట్లు తేలింది. సదరు నిర్మాత పరారీలో ఉన్నట్లు వివరించింది. అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని తెలిపింది. -
రు.600 కోట్ల హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.600 కోట్ల విలువైన హెరాయిన్ మాదక ద్రవ్యాలను గుజరాత్ ఉగ్ర వ్యతిరేక బృందం స్వాధీనం చేసుకుంది. కేసులో ముగ్గురిని అరెస్ట్‌చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని దేశానికి తరలించేందుకు పాకిస్తాన్‌కు చెందిన జహీద్ బషీర్ బలూచ్ అనే వ్యక్తి నుంచి 120 కేజీల హెరాయిన్‌ను ఈ ముగ్గురు తెప్పించారని పోలీసులు వెల్లడించారు. మోర్బీ జిల్లాలోని జింజువా గ్రామంలో ఈ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ ఆశిశ్ భాటియా చెప్పారు. -
డబ్బుల కోసం డాక్టర్‌కు బెదిరింపులు..
సాక్షి, చైతన్యపురి: డబ్బులు ఇవ్వాలని ఓ డాక్టర్‌ను బెదిరిస్తున్న ముగ్గురు వ్యక్తులను సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఎల్బీనగర్ ఏసీపీ పృద్వీధర్ వివరాలు వెల్లడించారు. దిల్సుఖ్నగర్ శ్రీనగర్‌కాలనీకి చెందిన డాక్టర్ గంజి శ్రీనివాస్ కన్సల్టెంట్ ఆడియోలజిస్టుగా పనిచేస్తున్నాడు. ఓ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే భీమా లక్ష్మణ్ ద్వారా అతను వినికిడి యంత్రాలను కొనుగోలు చేసేవాడు. తక్కువ ధరకు వాటిని కొనుగోలు చేసి పేషెంట్లకు ఎక్కువ ధరకు ఇస్తున్నట్లు గుర్తించిన లక్ష్మణ్ తనకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు శ్రీనివాస్ అంగీకరించకపోవడంతో నల్గొండ జిల్లాకు చెందిన తన స్నేహితుడు మేకల రఘురాంరెడ్డికి చెప్పడంతో అతను డాక్టర్‌కు ఫోన్‌చేసి వ్యవహారం త్వరగా సెటిల్ చేసుకోవాలని సూచించాడు. అనంతరం వరంగల్‌కు చెందిన పొగాకుల నాగరాజు విలేకరినని పరిచయం చేసుకుని డాక్టర్‌కు ఫోన్‌చేసి త్వరగా డబ్బులు ఇవ్వకపోతే వార్త రాస్తానని బెదిరించాడు. డాక్టర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మన్మదకుమార్ కేసు నమోదు చేశారు. శుక్రవారం హయత్‌నగర్‌లో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
200 కోట్ల జీఎస్టీ మోసం
బనశంకరి (బెంగళూరు): నకిలీ బిల్లులు సృష్టించి సుమారు రూ.200 కోట్లకుపైగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఎగవేసిన ఆరోపణలపై విక్రమ్‌దుగ్గల్, అష్పాక్ అహ్మద్, నయాజ్ అహ్మద్ అనే ముగ్గురిని బెంగళూరు వాణిజ్య పన్నులశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నగరంలోని టీ.దాసరహళ్లి, చిక్కబాణవారలో అనేక డొల్ల కంపెనీలు నడుపుతున్న వీరు విచ్చలవిడిగా జీఎస్టీ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని పలు కీలక ఫైళ్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద జీఎస్టీ మోసంగా అధికారులు చెబుతున్నారు. రూ.203 కోట్లకు పైగా విలువైన జీఎస్టీ పన్నుల ఎగవేతకు సంబంధించిన నకిలీ బిల్లులు కూడా లభ్యమయ్యాయి. రెండేళ్ల క్రితం మృతిచెందిన వారి పేర్లతో నకిలీ బిల్లులు సృష్టించారు. -
విద్యార్థినిపై అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్టు
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): సహ విద్యార్థినిపై అత్యాచారం చేసి.. ఆ దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు బీటెక్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ ప్రసాదరావు శనివారం హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలోని ఎన్నారై ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినిని.. సీనియర్ విద్యార్థులైన కొత్త శివారెడ్డి(ప్రకాశం జిల్లా ఉప్పలపాడు), పిన్నబోయిన కృష్ణవంశీ(విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు) జన్మదిన వేడుకలకంటూ గతేడాది ఫిబ్రవరిలో తమ రూమ్‌కు పిలిచారు. తీరా రూమ్‌కు వచ్చిన తర్వాత ఎవ్వరూ లేకపోవటంతో కంగారుపడ్డ ఆ విద్యార్థిని.. వెంటనే వారిని ప్రశ్నించింది. ఇంతలో వారు ఆమెను బలవంతంగా నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఎవరికైనా చెబితే.. వీడియాలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. దీంతో ఎంతో మానసిక క్షోభ అనుభవించిన ఆ విద్యార్థిని చివరకు శివారెడ్డి, కృష్ణవంశీల వేధింపులు తట్టుకోలేక.. కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. కానీ కాలేజీ యాజమాన్యం శివారెడ్డి, కృష్ణవంశీని మందలించి.. వారి ఫోన్లలోని వీడియోలను డిలీట్ చేయించి వదిలివేసింది. ఈ విషయం బయటపడితే కాలేజీ అప్రతిష్ట పాలవుతుందని, భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు పునరావృతం కానివ్వబోమని విద్యార్థినికి నచ్చజెప్పారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న శివారెడ్డి, కృష్ణవంశీ ఇటీవల తమ ఫోన్లలో ఆయా వీడియోలను రికవరీ చేసుకోవటమే కాక ఆగిరిపల్లి మండలం బొద్దనపల్లికి చెందిన దొడ్ల ప్రవీణ్‌కుమార్‌కు వాట్సాప్ ద్వారా పంపించారు. దీంతో ప్రవీణ్ తన కామ వాంఛ తీర్చాలని.. లేకపోతే వీడియోలను బయటపెడతానంటూ విద్యార్థినిని వేధించడం మొదలుపెట్టాడు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ విద్యార్థిని.. రెండ్రోజుల క్రితం ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సీఐ నాయుడు నిందితులైన కృష్ణవంశీ, శివారెడ్డి, ప్రవీణ్‌ను శనివారం అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ 376 డీ, 354 ఏ, ఐటీ యాక్ట్ సెక్షన్ 67 క్రింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. వీరిని నూజివీడు కోర్టులో ప్రవేశపెట్టి.. దర్యాప్తు కోసం రిమాండ్ కోరుతామని చెప్పారు. అత్యాచారం ఘటనను కప్పిపుచ్చేందుకు, నేరాన్ని మాఫీ చేసేందుకు ప్రయత్నించిన ఎన్నారై ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యానికి కూడా నోటిసులిస్తామని డీఎస్పీ ప్రసాదరావు చెప్పారు. విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కాపాడటం చట్టరీత్యా నేరమేనన్నారు. -
ఫోర్జరీ డాక్యుమెంట్‌తో కోటి ప్లాట్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ.1.5 కోట్ల విలువైన ప్లాట్ విక్రయించిన ముగ్గురు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ గంగాధర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హిమాయత్‌నగర్‌కు చెందిన రూపా డిసిల్వకు కొండాపూర్ సర్వేనెంబర్ 218 క్రాంతివనం లేఅవుట్లో 300 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్ నెంబర్ 434 ఉంది. పార్శిగుట్టకు చెందిన ఉమా అలియాస్ ఉమా మహేశ్వరి ఫొటోతో నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసి, ఆమెను రూపా డిసిల్వాగా పేర్కొంటూ నంద్యాలకు చెందిన సబ్బాని రాజేశ్వర్‌రెడ్డి ఏజీపీఏ చేసుకున్నాడు. పార్శిగుట్టుకు చెందిన సామ్యూల్ ఇందుకు అవసరమైన పత్రాలు సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు. వీటి ఆధారంగా రాజేశ్వర్ రెడ్డి, శ్యామ్యూల్ అమెరికాలో ఉంటున్న శరత్ చంద్రారెడ్డికి ప్లాట్ విక్రయించారు. శరత్ తండ్రి మనోహర్ రెడ్డి ప్లాట్‌ను చదును చేస్తుండగా 2017 నవంబర్‌లో రూపా డిసిల్వ గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో నిందితులగా ఉన్న రామ్మోహన్ రెడ్డి, సంజీవ, చక్రీ, జాన్ వెస్లీ, అంకిరెడ్డి అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
బోధన్‌రూరల్(బోధన్): మండలంలోని పెగడపల్లిలో భూ వివాదంతో అన్న భార్యను కర్రలతో దాడి చేసి హత్య చేసి న కేసులో ముగ్గరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోధన్ రూరల్ సీఐ గోవర్ధన గిరి శనివారం తెలిపారు. పది గుంటల భూమి వివాదంతోనే నిందితుడు వదినను హత్యకు చేసి నట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామానికి చెందిన నర్సవ్వ–బాలయ్యకు ఎల్లప్ప, లక్ష్మణ్ అనే ఇద్దరు కొడుకులు, లక్ష్మి(గంగామణి) కూతురు ఉంది. ఇద్ద రు కొడుకులు పెళ్లిళ్లు చేసుకుని వేర్వేరు గా ఉంటున్నారు. అయితే నర్సవ్వ పెద్ద కొడుకు ఎల్లప్ప 2014లో భార్య గోంటి సావిత్రి, గోంటి యోగేష్ చేతిలో హత్య కు గురయ్యాడు. నర్సవ్వ భర్త బాలయ్య చనిపోవడంతో చిన్న కొడుకు లక్ష్మణ్ వద్ద ఉంటోంది. కూతురు లక్ష్మి పెళ్లి అ యినా పెగడాపల్లిలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే నర్సవ్వ పేరుపై ఉన్న 30 గుంటల భూమిలోనుంచి గ్రామ పెద్దలు చిన్న కొడుకు గోంటి లక్ష్మణ్‌కు 10 గుం టల భూమిని కేటాయించారు. మిగిలిన 20 గుంటల భూమిని నర్సవ్వను ఎవరు పోషిస్తే వారు సాగు చేసుకోవాలని సూచించారు. దీంతో లక్ష్మణ్ తల్లిని పోషిస్తూ, మంచి చెడులు చూస్తూ ఆ భూమి ని సాగు చేశాడు. అయితే పెద్ద కొడుకు ఎల్లప్ప భార్య సావిత్రి అందులో 10 గుంటల పొలం తమదని, దాన్ని ఇప్పిం చాలని అంటుండేది. దీంతో రెండు కుటుంబాలకు తరుచూ వివాదాలు అయ్యేవి. అయితే ఇటీవల లక్ష్మణ్ సాగు చేసిన పొలంలో పంటను నర్సవ్వ కోసి ఇంటికి తెచ్చుకుంది. దీంతో లక్ష్మణ్ తల్లి నర్పవ్వ, అక్క లక్ష్మి కలిసి శుక్రవారం సావిత్రి ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగారు. వారి మధ్య మాటమాట పెరిగి లక్ష్మణ్ వదిన సావిత్రి, ఆమె కొడుకు యోగేష్లపై కర్రలతో దాడి చేశాడు. సావిత్రి తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. యోగేష్ తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్చారని సీఐ తెలిపారు. సావిత్రి అన్న సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఈ కేసులో ఏ1 నిందితుడిగా గోంటి లక్ష్మణ్, ఏ2గా గోంటి లక్ష్మి, ఏ3గా గోంటి నర్సవ్వను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. కాగా యోగేశ్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడని సీఐ తెలిపారు. -
హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
-
హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నిర్వాహకులతో పాటు ముగ్గురు విటులను సైతం కటకటాల వెనక్కి నెట్టారు. పాతబస్తీకి చెందిన నిషా ఖాన్ అనే మహిళను ముఠా లీడర్‌గా గుర్తించారు. గతంలో పలుమార్లు వ్యభిచార కేసుల్లో పట్టుబడిన నిషాఖాన్.....ఓ మైనర్ బాలికతో బలవంతంగా వ్యవభిచారం చేయిస్తోంది. ఆ బాధను తట్టుకోలేకపోయిన సదరు బాలిక.....ఆ నరకకూపం నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. నిర్వాహకురాలు నిషాఖాన్‌తో పాటు....అందుకు సహకరించిన పహాడీ షరీఫ్‌కు చెందిన తహసీన్ ఫాతిమా , సభా అనే మరో ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి....మైనర్ బాలికను నరకకూపంలోకి దింపారు. మారియట్ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి సికింద్రాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలోని మారియట్ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఈ సందర్భంగా హోటల్లో పేకాట ఆడుతున్న 38మందిని అదుపులో తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ శశిధర్ రాజు తెలిపారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. హోటల్లో మూడు గదులను ఆర్గనైజర్స్ బుక్ చేసుకున్నారని, సంజయ్ అనే ఆర్గనైజర్‌తో పాటు మరో ఇద్దరు కూడా హోటల్లో వేరువేరుగా రూమ్స్ బుక్ చేసుకుని మూడు కార్డ్స్ గేమ్‌ను ఆడిస్తున్నారన్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.24 లక్షల నగదుతోపాటు 1800 క్యాసినో కాయిన్స్, 38 సెల్ఫోన్లు, మద్యం సీసాలు, హుక్కా పాట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో ముగ్గురు ఆర్గనైజర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హోటల్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. -
నకిలీ రూ.2 వేల నోట్ల పట్టివేత
♦ నగరంలో మార్పిడికి యత్నం.. ముగ్గురి అరెస్టు ♦ రూ.1.9 లక్షల విలువైన నోట్లు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ రూ.2 వేల నోట్లను మార్పిడికి యత్నించిన ముగ్గురిని మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.9 లక్షల విలువైన రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ బి.లింబారెడ్డి శుక్రవా రం వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులోని మాల్దా నుంచి ఈ నోట్లు వచ్చినట్టు తెలిపారు. గతంలో మాల్దా నుంచి నకిలీ నోట్లు తెచ్చి నగరంలో చలామణి చేస్తూ యాకత్‌పురకు చెందిన మహ్మద్ గౌస్ గతంలో పోలీసులకు చిక్కా డు. ఇతడు జైల్లో ఉండగా నకిలీ నోట్ల కేసులోనే అరెస్టయి జైల్లో ఉన్న మాల్దా వాసి ఖయాముల్ హక్, చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలుకు వెళ్లిన షేక్ అర్షద్ అలీలతో పరిచయమైంది. జైలు నుంచి విడుదలైన అనంతరం వీరు కొత్త కరెన్సీ నకిలీ నోట్లు చలామణి చేయాలని నిర్ణయించుకున్నారు. నగరంలో మార్పిడి చేయడానికి రూ.2 లక్షల నకిలీ రూ.2 వేల నోట్లు కావాలని మాల్దాలో ఉన్న హక్‌ను గౌస్ కోరాడు. ఇక్కడ నిఘా ఎక్కువగా ఉండటంతో నాగ్‌పూర్‌లో వీటిని తీసుకోవాలని హక్ సూచించాడు. దీంతో గౌస్ అర్షద్ అలీని మంగళవారం అక్కడకు పంపా డు. నాగ్‌పూర్‌లో డబ్బు తీసుకున్న అర్షద్... హక్ అనుచరుడు అబ్దుల్ రజాక్‌తో కలసి నగరానికి వచ్చాడు. వీరికి అర్షద్ సోదరుడు ఆరిఫ్ అలీ సైతం జట్టు కట్టాడు. ఈ ముగ్గు రూ శుక్రవారం ఎల్బీనగర్లో రూ.10 వేల విలువైన ఐదు నకిలీ నోట్లకు గౌస్‌కు అందించారు. మిగిలిన రూ.1.9 లక్షల నోట్లను తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చారు. గౌస్, హక్‌ల కోసం గాలింపు... దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ద్వారా సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు నేతృత్వంలో ని బృందం దాడి చేసింది. నిందితులైన అర్షద్, రజాక్, ఆరిఫ్‌లను అరెస్టు చేసింది. పరారీలో ఉన్న గౌస్, హక్ కోసం గాలిస్తోం ది. ఇవి గతంలో మాదిరి పాకిస్థాన్‌లోని పవ ర్ ప్రెస్‌ల్లో ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా మాల్దాకు వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. -
గరగపర్రు ఘటనలో ముగ్గురి అరెస్ట్
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు కారణమైన బలరామకృష్ణంరాజు, ముదునూరి రామరాజు, గుట్టుకుప్పల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. అంబేడ్కర్ విగ్రహం వివాదం నేపథ్యంలో రెండు నెలల నుంచి అగ్రవర్ణాలు కౌలుకిచ్చిన భూముల్ని దళితుల వద్ద నుంచి వెనక్కి లాక్కోవడమే కాకుండా, పనులకు పిలవడం మానేసిన విషయం తెలిసిందే. కాగా దళితులు సామాజిక బహ్కిరణకు గురైన గరగప ర్రులో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ 30, జులై 1వ తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో పర్యటించి అక్కడ సామాజిక బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలను పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని కల్పిస్తారు. మరోవైపు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇవాళ గరగపర్రులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం దారుణమని, వారికి న్యాయం జరిగేవరకు వారి వెన్నంటే ఉంటామన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రెండెకరాల భూమి కేటాయించాలని ముద్రగడ డిమాండ్ చేశారు. -
మొహాలీలో నకిలీ కొత్త నోట్ల కలకలం
-
డ్రోన్ ఎగరేశారని.. ముగ్గురి అరెస్టు
దేశ ఆర్థిక రాజధాని ముంబై విమానాశ్రయం సమీపంలో డ్రోన్లు ఎగరేసినందుకు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా డ్రోన్ ఎగరేయడాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ పైలట్ గుర్తించారు. ఈ కేసులో రాహుల్ రాజ్‌కుమార్ జైస్వాల్ (24), రాణా సుభాష్ సింగ్ (25), విధిచంద్ జైస్వాల్ (45)అను క్రైంబ్రాంచి పోలీసులు అరెస్టుచేశారు. డెహ్రాడూన్ నుంచి ముంబై వచ్చిన ఇండిగో విమాన పైలట్.. తాను తన విమానానికి సుమారు 100 మీటర్ల దిగువన ఒక డ్రోన్ చూశానని అధికారులకు తెలిపాడు. రాత్రి 7.30 గంటల సమయంలో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో ఈ డ్రోన్ కనిపించిందన్నాడు. అయితే.. సినిమా షూటింగ్ కోసం ఆ డ్రోన్ కెమెరాను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ముంబై శివార్లలోని చార్కోప్ ప్రాంతంలో ఈ సినిమా ప్రోమో షూటింగ్ జరిగింది. సినిమా పూర్తిస్థాయి షూటింగ్ తర్వాత షెడ్యూలు చేశారు. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి అధికారులకు సమాచారం చెప్పడంతో.. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుల నుంచి డ్రోన్ కెమెరాను, ఒక ఐప్యాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాహుల్, రామ్ కెమెరాను హ్యాండిల్ చేస్తుండగా.. విధిచంద్ డ్రోన్లను అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తుంటాడని పోలీసులు చెప్పారు. ముంబై గగనతలంలో డ్రోన్లను ఉపయోగించడం నిషిద్ధం. అయినా ఎగరేసినందుకు వీళ్లపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి కేసు విచారిస్తున్నారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
ధర్మవరం అర్బన్ : రామగిరి మండలం నసనకోటలో ఆగస్టు 26న మహిళ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఆగస్టు 26న స్వర్ణను ఆమె భర్త, మామ, అత్తలు హత్య చేసి, అనంతరం ఉరేసుకున్నట్లు చిత్రీకరించారన్నారు. విచారణలో హత్యగా నిర్ధారణ అయ్యిందన్నారు. హతురాలి భర్త శ్రీహరి, అత్త, మామలు క్రిష్ణమ్మ, చండ్రాయుడులను ఎన్‌ఎస్‌గేటు వద్ద గురువారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
హత్య కుట్ర భగ్నం
అనంతపురం సెంట్రల్ : బాకీ తీర్చనందుకు కడతేర్చాలనుకున్నారు. పక్కా స్కెచ్‌తో హత్యకు కట్ర పన్నారు. చివరకు వ్యూహం బెడిసి ముగ్గురు నిందితులు పోలీసుల వలకు చిక్కారు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను అనంతపురం వన్‌టౌన్ సీఐ రాఘవన్ విలేకరులకు మంగళవారం తెలిపారు. అనంతపురంలోని మరువకొమ్మ కాలనీలో నివాసముంటున్న మొండి శ్రీనివాసులు పందుల పెంపకం వృత్తిగా జీవించేవాడు. నాయక్‌నగర్‌కు చెందిన వరుసకు అల్లుడైన మొండి వెంకటేశ్ నుంచి రూ.2 లక్షల దాకా అప్పు చేశాడు. ఈ విషయంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అప్పు చెల్లించాలని వెంకటేశ్ ఒత్తిడి చేశాడు. అయితే డబ్బులు చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వస్తున్న మొండి శ్రీనివాసులను ఎలాగైనా కడతేర్చాలని పథకం రచించాడు. తన స్నేహితులైన నాయక్‌నగర్‌కు చెందిన సాకే శ్రీనివాసులు, పిచ్చికుంట్ల నారాయణలతో కలసి మంగళవారం హత్యకు కుట్రపన్నారు. మొండి శ్రీనివాసులు ప్రతి రోజూ పందులు మేపుకోవడానికి వచ్చే భైరవనగర్‌లో మారణాయుధాలతో కాపుకాశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్ఐ వెంకటరమణ, తమ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి మూడు వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. హత్య కుట్రను భగ్నం చేసిన ఎస్ఐ వెంకటరమణ, హెడ్‌కానిస్టేబుళ్లు సూరి, రాజకుళ్లాయప్ప, కానిస్టేబుళ్లు నాగరాజు, చలపతి, రమేశ్, చిన్న చంద్రను అభినందిస్తూ రివార్డుకు సిఫార్సు చేశారు. -
మత్తు ఇంజక్షన్ల విక్రయం: ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్(యాకుత్‌పురా): మత్తు ఇంజక్షన్లను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను రెయిన్‌బజార్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 200 మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ జి.శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ప్రకాశ్ (43) కొన్ని రోజులుగా మత్తు ఇంజక్షన్లను విక్రయిస్తున్నాడు. యాకుత్‌పురా బాగ్‌హే జహేరా ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ మాజిద్ ఖాన్(45) ప్రకాశ్ వద్ద మత్తు ఇంజక్షన్లను కొనుగోలు చేసి పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ప్రకాశ్‌తో పాటు సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన శైలేష్ (34) సైతం మత్తు ఇంజక్షన్ల విక్రయాలు చేస్తుంటాడు. మాజిద్ మత్తు ఇంజక్షన్లను రూ. 5.50లకు కొనుగోలు చేసి యాకుత్‌పురా పరిసర ప్రాంతాల్లో అవసరమైన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అబ్దుల్ మాజిద్ ఇంటిపై దాడి చేసి 200 మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం రెయిన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మత్తు ఇంజక్షన్ల విక్రయాలు చేస్తున్న ప్రకాశ్‌తో పాటు అబ్దుల్ మాజిద్, శైలేష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
జర్నలిస్టు హత్య.. ముగ్గురి అరెస్టు
గుజరాత్లో జర్నలిస్టు కిశోర్ దవే (53) హత్యకేసులో ముగ్గురిని అరెస్టుచేశారు. తన కార్యాలయంలో వార్తుల రాస్తుండగా కొంతమంది వ్యక్తులు వచ్చి ఆయనను పొడిచి చంపిన విషయం తెలిసిందే. 'జైహింద్' అనే గుజరాతీ వార్తాపత్రికకు సౌరాష్ట్ర ప్రాంతంలోని జూనాగఢ్ నగరంలో బ్యూరోచీఫ్‌గా వ్యవహరిస్తున్న దవే సోమవారం రాత్రి ఓ స్టోరీ రాస్తుండగా 9 గంటల ప్రాంతంలో అతడిని పదే పదే కత్తులతో పొడిచి చంపారు. ఆ సమయానికి ఆఫీసులో ఆయనకొక్కరే ఉన్నారు. ఆఫీసు కూడా ఒకే గదిలో ఉండటంతో అందులో సెక్యూరిటీ కెమెరాలు కూడా ఏమీ లేవు. కాసేపటి తర్వాత వచ్చిన ఆఫీసు బోయ్ దవే మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలిపాడు. వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని సీనియర్ పోలీసు అధికరి ఒకరు తెలిపారు. అయితే.. బీజేపీ స్థానిక నాయకుడు రతీలాల్ సూరజ్ కొడుకే ఈ హత్య చేయించి ఉంటాడని దవే బంధువులు ఆరోపిస్తున్నారు. సూరజ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. దవే ఉప్పు అందించడం వల్లే కొన్ని స్థానిక పత్రికలలో తనపై లైంగిక ఆరోపణల కథనాలు వచ్చాయని రతీలాల్ కొడుకు డాక్టర్ భవేష్ సూరజ్ ఇంతకుముందు ఆరోపించారు. వాట్సప్ మెసేజిల ద్వారా సదరు డాక్టర్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారన్న ఆరోపణలతో దవే ఇంతకుముందు గత సంవత్సరం అక్టోబర్ నెలలో అరెస్టయ్యారు. -
ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్ డక్కిలి : మండలంలోని నాగవోలు పంచాయతీ మహాసముద్రం చిన్నచెరువు తూము వద్ద అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన 33 ఎర్ర చందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ ఆధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ హరనాథ్‌బాబు కథనం మేరకు... మహాసముద్రం ప్రాంతంలో ఎర్ర చందనం దుంగలు దాచి ఉంచినట్లు అధికారులకు ముందుగా సమాచారం అందింది. దీంతో మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో డీఎస్పీ హరనాథ్‌బాబు తమ సిబ్బందితో గాలించగా చిన్న చెరువు తూములో 33 ఎర్రచందనం దుంగలు దాచి ఉంచడాన్ని గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. ఈ గాలింపుల్లో వెంకటగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్సై జిలాని, టాస్క్‌ఫోర్స్ ఎస్సై హజావలీ, ఎఫ్ఆర్ఓ వెంకటసుబ్బయ్య, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్ మహాసముద్రం చిన్నచెరువు వద్ద అక్రమంగా దాచి ఉంచిన 33 ఎర్రచందనం దుంగలకు సంబంధించిన స్మగ్లర్లు అయిన అదే గ్రామానికి చెందిన కృష్ణయ్య, వెంకటగిరికి చెందిన కోండయ్య, సుమంత్‌ను అరెస్ట్ చేశారు. వారిని అని కోణాల్లో విచారిస్తున్నారు. -
నకిలీ పహణీ సూత్రధారుల అరెస్ట్
బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి.. వర్ధన్నపేట టౌన్ : నకిలీ పహణీలు తయారు చేసి రుణాల కోసం రైతులకు అందించిన ముగ్గురిని గురువారం అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ తెలిపారు. ఇల్లందలోని మీసేవ కేంద్రం కంప్యూటర్ ఆపరేటర్ ఆడెపు కేశవ్, చంద్రుతండాకు చెందిన మధ్య దళారి మాలోతు వీరస్వామి, నకిలీ పహణీ తీసుకున్న మూడుగుళ్ల తండాకు చెందిన రైతు బానోతు దేసునాయక్ అరెస్ట్‌ను పోలీస్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల ఎదుట చూపారు. సీఐ కథనం ప్రకారం.. ఇల్లందలోని కేజీవీబీలో దేసునాయక్ పంట రుణం ఎక్కువగా కావాలని బ్యాంకు మేనేజర్‌ను కోరాడు. భూ విస్తీర్ణాన్ని బట్టి లోన్ ఇస్తామని మేనేజర్ చెప్పారు. గతంలో అతడికి రూ. 35 వేల రుణం ఉంది. ఇది గమనించిన మధ్యదళారి, ప్రస్తుతం రాంధన్తండా మహిళా సంఘాల సీఏగా పని చేస్తున్న వీరస్వామి.. ఎక్కువ రుణం ఇప్పిస్తానని, అందుకు కొంత డబ్బు ఖర్చవుతుందని చెప్పగా దేసునాయక్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వీరస్వామి రైతు వద్ద పహణీ కాపీలు తీసుకుని ఇల్లంద మీసేవా కేంద్రం ఆపరేటర్ కేశవ్‌ను కలిసి పహణీలో భూమి విస్తీర్ణాన్ని పెంచాలని కోరాడు. పర్వతగిరి మండలం రోళ్లకల్లు శివారులో దేసునాయక్కు 121/ఎ సర్వే నంబర్లో 0.12 ఎకరాలు ఉండగా దానిని 2.12 ఎకరాలుగా, 137/బిలో 0.16 ఎకరాలు ఉండగా దానిని 1.16 ఎకరాలుగా మార్చాడు. ఈ నకిలీ పహణీతో బ్యాంకుకు వెళ్లిన దేసునాయక్ రుణం పెంచాలని మేనేజర్‌ను కోరాడు. దీంతో అనుమానం వచ్చిన మేనేజర్ తహసీల్దార్‌ను సంప్రదించగా రికార్డులు, కంప్యూటర్ పహణీలను పరిశీలించగా నకిలీవని గుర్తించారు. దీంతో వర్ధన్నపేట రెవెన్యూ అధికారులు మీ సేవా కేంద్రాన్ని సీజ్ చేశారు. బ్యాంకు మేనేజర్ దాసునాయక్ గత నెల 28న వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేసి పై ముగ్గురిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట వర్ధన్నపేట ఎస్సై రవిరాజు తదితరులు ఉన్నారు. -
వ్యభిచార గృహంపై పోలీసులు దాడి: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కల్యాణ్‌నగర్ వెంచర్-3 లో ఓ ఇంటిపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకురాలు, మహిళతోపాటు ఓ విటుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన మహిళ లక్షల్లో వడ్డీ వ్యాపారం చేస్తుందని పోలీసులు తెలిపారు. కల్యాణ్‌నగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని ఆగంతకుడు పోలీసులకు ఫోన్లో సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడి చేశారు. -
వ్యభిచార గృహంపై దాడి : ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై ఎస్ఓటీ పోలీసులు సోమవారం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ వసంతనగర్‌లోని ఓ ఇంటిలో నిర్వాహకుడు చైతన్య అనే వ్యక్తి విటులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి చైతన్యతో పాటు ఓ మహిళ, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 సెల్ ఫోన్లు, రూ.11,720 నగదును స్వాధీనం చేసుకుని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. -
మసాజ్ సెంటర్ పై పోలీసుల దాడులు.. ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ పై పోలీసులు దాడులు నిర్వహించించారు. ఇద్దరు యువతులు సహా మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిదిలోని 6వ ఫేజ్‌లో అనుమతులు లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించింది. పక్కా ప్రణాళికతో గురువారం రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు మసాజ్ సెంటర్ పై దాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీలలో భాగంగా నిర్వాహకుడితో పాటు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్ లో బ్రోతల్ హౌస్ గుట్టురట్టు!
హయత్‌నగర్: ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బ్రోతల్ హౌస్ గుట్టురట్టయింది. ఈ వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేసి నిర్వాహకురాలితోపాటు ఓ మహిళ, విటున్ని అరెస్ట్ చేశారు. శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గడిశె ప్రభావతి అనే మహిళ హయత్‌నగర్ డివిజన్లోని అరుణోదయనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. బహదూర్‌పురాకు చెందిన విటుడు గాదె నాగప్పతో పాటు ఓ మహిళను, నిర్వాహకురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.500 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఎర్రచందనం కేసులో ముగ్గురి అరెస్ట్
కడప: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న సంఘటనకు సంబంధించిన కేసులో సోమవారం మరో ముగ్గురిని చిన్నచౌక్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్ ఔట్‌గేటు వద్ద అరెస్ట్ చేశారు. సాయంత్రం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ నిందితుల అరెస్ట్ వివరాలను తెలిపారు. ఈనెల 2వతేదీన 12 మంది ఎర్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు. అదే సంఘటనలో పరారైన ముగ్గురిని ప్రస్తుతం అరెస్ట్ చేయగలిగామన్నారు. అరెస్టయిన వారిలో కడప నగర శివార్లలోని వాటర్‌గండికి చెందిన మామిళ్ల ఓబులేసు (23), సిద్ధవటం దిగువపేటకు చెందిన సయ్యద్ రఫీ (45), చింతకొమ్మదిన్నె మండలం, పడిగెల పల్లె గ్రామానికి చెందిన కొమ్మిశెట్టి రాజేష్ (28)లు ఉన్నారు. వీరిని విచారించగా వారిచ్చిన సమాచారం ఆధారంగా వాటర్‌గండి సమీపంలో శివాలయం ఎదురుగా పెన్నానది ఇసుకలో దాచిన ఆరు ఎర్రచందనం దుంగలను, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదే కేసులో ఇంకా కొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐలు ధనుంజయుడు, రామకృష్ణుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యభిచార గృహంపై దాడి: ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న ఓ వ్యభిచార గృహంపై ఎస్వోటీ పోలీసులు శనివారం మధ్యాహ్నం మెరుపు దాడికు దిగారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో మల్కాజిగిరి పరిధిలోని శివనగర్‌లోని ఓ ఇంటిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించారు. -
రూ.కోటి విలువైన విగ్రహాలు స్వాధీనం
ఖమ్మం : పురాతన ఆలయంలో చోరీకి గురైన మూడు పంచలోహ విగ్రహాలను ఖమ్మం సీసీఎస్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకొని.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా కోయచెలక గ్రామానికి చెందిన జంగాల వెంకన్న, ఏపూరి ప్రసాద్, గద్దల శ్యాం ముఠాగా ఏర్పడ్డారు. వరంగల్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలోని రంగనాయకుల ఆలయంలో గత నెల 15వ తేదీన రంగనాయకులస్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను దొంగిలించి.. ఖమ్మం తీసుకొచ్చారు. తర్వాత కోయచలకకు తీసుకొచ్చి పొలంలో దాచారు. రంగనాయకుల విగ్రహానికి ఉన్న శంఖుచక్రాన్ని విడగొట్టి అమ్మడానికి తిరుగుతున్నారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. వెంటనే వారి వద్ద నుంచి మూడు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.కోటికి పైగా ఉన్నట్లు తెలిసింది. -
కిలాడీ మహిళ..
మహిళతో పాటు మరో ముగ్గురు అరెస్ట్ రూ.50 లక్షలు విలువ చేసే 1761 గ్రాముల బంగారు స్వాధీనం బంగారు బిస్కెట్లు ఇస్తానని రైస్ మిల్లు యజమానికి రూ.2.36 కోట్ల టోకరా ప్రొద్దుటూరు క్రైం: గల్ఫ్ దేశం నుంచి బంగారు బిస్కట్లను తెప్పించి మార్కెట్ ధర కంటే రూ. 20 వేలకు తక్కువకు ఇస్తానని ఓ కిలాడీ మహిళ రైస్ మిల్లు ఓనర్‌ను మోసం చేసింది. ఆమె మాటలను నమ్మి రూ. 2.36 కోట్ల మేర బంగారు, డబ్బు ఇచ్చిన రైస్ మిల్లు యజమాని మోసపోయాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచారు. బుధవారం సాయంత్రం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ పీవీజీ విజయ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. స్థానిక నడింపల్లెకు చెందిన విజయ 9వ తరగతి వరకు చదువుకుంది. పెళ్లైన తర్వాత కొన్నేళ్లకే భర్తను వదిలేసింది. తర్వాత కొందరి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకొని విలాస వంతమైన జీవితాన్ని గడిపేది. ఈ క్రమంలోనే ఆమె 2008లో కువైట్‌కు వెళ్లింది. ఇలా రెండు, మూడు సార్లు వెళ్లొచ్చింది. 2013లో ఇండియాకు వచ్చిన ఆమె ఇక తిరిగి కువైట్‌కు వెళ్లలేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆమె డబ్బు కోసం చాపాడు మండలం, చిన్నగురవలూరుకు చెందిన చంద్రఓబుళరెడ్డితో పరిచయం ఏర్పరచుకుంది. అతని ద్వారా పట్టణంలోని రైస్‌మిల్లు యజమాని కొండయ్యను పరిచయం చేసుకుంది. బంగారు బిస్కెట్లను తక్కువ రేటుకు ఇస్తానని.. కువైట్ నుంచి బంగారు బిస్కెట్లను తెప్పించి ఇక్కడి మార్కెట్ రేటు కంటే బిస్కెట్‌ను రూ.20 వేలు తక్కువకు ఇస్తానని ఆమె కొండయ్యతో చెప్పింది. దీంతో ఆశ పడిన కొండయ్య ఆమెకు డబ్బు ఇవ్వడం ప్రారంభించాడు. అయితే ఆమె స్థానికంగానే బంగారు వ్యాపారుల వద్ద స్వచ్ఛత కలిగిన బంగారు బిస్కెట్లు కొని కొండయ్యకు ఇస్తూ వచ్చింది. దీంతో అతను విజయను పూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకంతోనే కొండయ్య ఆమె అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాడు. తనకు బంగారు ఆభరణాలు ఇస్తే వాటికి బదులుగా అంతే తూకం గల 9999 ముద్రగల 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లు ఇస్తానని ఆమె నమ్మబలికింది. అయితే ఆభరణాల బదులు బిస్కెట్లు తీసుకుంటే లక్షల్లో లాభం గడించవచ్చని అతను ఆశపడ్డాడు. దీంతో కొండయ్య కొన్ని రోజుల క్రితం 3 కిలోల మేర బంగారు నగలను తనకు తెలిసిన వ్యాపారుల వద్ద కొని ఆమెకు ఇచ్చాడు. ఇలా అతని వద్ద తీసుకున్న బంగారు నగలను మణప్పురం ఫైనాన్స్, ఇండియా ఇన్ఫో లైన్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలలో తనఖా పెట్టి డబ్బు తీసుకుంది. ఆ డబ్బుతో అప్పుడప్పుడు ఆమె కొన్ని బంగారు బిస్కెట్లను అతనికి ఇస్తూ వచ్చింది. మిగతా బిస్కెట్ల గురించి అతను అడగగా ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారని, కువైట్ నుంచి తన మనుషులు ఇంకా రాలేదని ఇలా పలు కారణాలు చెప్పేది. అనేక సార్లు బిస్కెట్లు ఇవ్వకుండా సాకులు చెబుతుండటంతో అతనికి అనుమానం వచ్చింది. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అతను విజయపై ఈ నెల 1న టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డబ్బు, బంగారు నగల రూపంలో సుమారు రూ. 2.36 కోట్లు నష్టపోయానని కొండయ్య ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. కొండయ్య ఫిర్యాదుతో రూరల్ సీఐ ఓబులేసు, ఎస్ఐ మంజునాథరెడ్డిలు రంగంలోకి దిగారు. విజయకు ఎవరితో సంబంధాలు ఉన్నాయన్నదానిపై పోలీసులు కూపి లాగారు. ఈ క్రమంలోనే చిన్నగురువలూరుకు చెందిన చంద్ర ఓబుళరెడ్డితో ఆమెకు పరిచయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. విజయ ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న రెడ్డి బాష కూడా ఆమెకు సహకరిస్తుండేవాడు. ఇతనికి ఆమె నెల నెలా జీతం కూడా ఇస్తుండేది. ఆమెకు సమీప బంధువైన రవీంద్రారెడ్డి కూడా ఆమె వ్యవహారాల్లో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో ప్రధాన నిందితురాలు విజయతోపాటు ఆమె అనుచరులు చంద్ర ఓబుళరెడ్డి, ప్రొద్దుటూరుకు చరెందిన రెడ్డి బాషా, రవీంద్రారెడ్డిలను బుధవారం నడింపల్లెలోని ఆమె ఇంటి వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50లక్షలు విలువ చేసే 1761 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలకపాత్ర పోషించిన సీఐ ఓబులేసు, ఎస్ఐ మంజునాథరెడ్డి, చాపాడు ఎస్ఐ శివశంకర్, సిబ్బందిని అడిషనల్ ఎస్పీ పీవీజీ విజయ్‌కుమార్ అభినందించారు. -
అగ్నిగోల్డ్ కేసులో మరో ముగ్గురి అరెస్టు
ఏలూరు (సెంట్ర ల్) : ఖాతాదారుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి సొమ్ములు చెల్లించకుండా మోసానికి పాల్పడిన అగ్రిగోల్డ్ సంస్థ కేసులో మరో ముగ్గురిని సంస్థ వైస్‌చైర్మన్‌తోపాటు ఇద్దరు డెరైక్టర్లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరిని గురువారం ఏలూరు జిల్లా కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అగ్రిగోల్డ్ సంస్థ తమ డిపాజిట్ కాలపరిమితి తీరినా సొమ్ము చెల్లించలేదంటూ పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన ఘంటసాల గోవర్ధన కుమారుడు వెంకన్నబాబు 2015 జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ సంస్థపై నమోదైన కేసులను రాష్ర్ట ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేయడంతో ఆ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషునారాయణరావును సీఐడీ అధికారులు ఈనెల 12న రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, 13న ఉదయం ఏలూరులోని జిల్లా న్యాయమూర్తి ఎ.హరిహరనాథశర్మ వద్ద హాజరుపరచగా.. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు వారిని జిల్లా జైలుకు తరలించారు. సోమవారం నిందితులిద్దరూ బెయిల్ కోరుతూ జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, వారిని తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు మరో పిటీషన్ దాఖలు చేశారు. ఫలితంగా న్యాయస్థానం బెయిల్ పిటీషన్‌ను తోసిపుచ్చింది. వారంపాటు వారిని సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఫలితంగా సీఐడీ అధికారులు వారిని బుధవారం కస్టడీలోకి తీసుకుని హైదరాబాద్ తీసుకెళ్లి విచారిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో మరో ముగ్గురు సంస్థ వైస్‌చైర్మన్ ఇమ్మడి సదాశివవరప్రసాద్, మేనేజింగ్ డెరైక్టర్లు కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, లాల్ అహ్మద్‌ఖాన్‌ను బుధవారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్టు చేసి గురువారం ఉదయం ఏలూరు జిల్లాకోర్టులో ఇన్చార్జ్ జిల్లా న్యాయమూర్తి ఎ.హరిహరనాథశర్మ ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఈ ముగ్గురికి రిమాండ్ విధించారు. పోలీసులు వారిని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య జిల్లా జైలుకు తరలించారు. అయితే వీరిని కూడా కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. -
ఆకతాయిల వేధింపులు తాళలేక యువతి...
సూర్యాపేట(నల్లగొండ): ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించిన ఇరుగు పొరుగు వారు ఆమెను రక్షించడంతో తృటిలో ప్రాణాపాయం తప్పిపోయింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని చంద్రన్నకుంటలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న యువతి(20) ఇంటర్ మీడియట్ వరకు చదువుకుంది. ప్రస్తుతం ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అదే ప్రాంతానికి చెందిన కొందరు ఆకతాయిలు ఆమెను వేధిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వేధింపులు మరీ ఎక్కువవడంతో.. ఈ రోజు వంటిపై కిరొసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల ఇళ్ల వారు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. పొలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు కారకులైన ముగ్గురు ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. -
ఇసుక అక్రమ రవాణా... ముగ్గురి అరెస్ట్
కొవ్వూరు(పశ్చిమగోదావరి): గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. లారీని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇసుక తరలించడానికి ఉపయోగించిన బోటును వదిలేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్తమ్, షబ్బీర్‌పై దాడి కేసులో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు కశ్యప్, అబేద్, మసియుద్దీన్లను బుధవారం డీసీపీ కార్యాలయానికి తరలించారు. వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు... మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని సౌత్ జోన్ డీసీపీ తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం ధర్నాకు దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీపై దాడి చేయడంతో పాటు ఉత్తమ్ కారు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే -
తల్లీకూతుళ్ల హత్యకేసులో ముగ్గురి అరెస్ట్
అనంతపురం: అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోరంట్ల మండలం కరావులపల్లితండాలో ఓ ఉన్మాది తన తమ్ముడి భార్య, ఆమె ఇద్దరు కుమార్తెలను కిరాతకంగా హత్య చేశాడు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో మదనమోహన్ నాయక్ భార్య లక్ష్మీదేవి(32), ఆమె కుమార్తెలు యమున(8), చందనబాయి(2) లను హత్య చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు శంకర్‌నాయక్ లొంగిపోయాడు. నిందితుడు శంకర్ నాయక్‌తో పాటు ఆమె భార్య, తల్లిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
దొంగలు అరెస్ట్ : 27 బైకులు స్వాధీనం
పుల్బనీ : బైకులు చోరీ చేసి... విక్రయిస్తున్న ముఠా గుట్టును ఒడిశాలోని కంధమాల్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 27 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీస్ ఉన్నతాధికారి పర్వత్ కుమార్ ప్రాణిగ్రాహి మంగళవారం వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బైకుల్లో పలు రకాల కంపెనీలకు చెందినవి ఉన్నాయని తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి వాహనాలకు చెందిన నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ నంబర్లు, నకిలీ బండి కాగితాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గత మూడు రోజులుగా పుల్బనీ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సదరు దొంగలను తమదైన శైలిలో విచారించగా... కటక్, భువనేశ్వర్, కుర్థా ప్రాంతాల్లో ఈ బైకుల చోరీకి పాల్పడినట్లు వారు ఒప్పుకున్నారని తెలిపారు. అయితే ఇదే జిల్లాలోని బల్లిగూడలో గత రెండు నెలల క్రితం పోలీసుల తనిఖీల్లో బైకు దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 48 బైకులు పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
అనంతలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం : ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును అనంతపురం పోలీసులు బుధవారం రట్టు చేశారు. అనంతపురంలో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 13 లక్షల నగదుతోపాటు రూ. 12 లక్షల విలువైన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.కోటి విలువైన ఏనుగు దంతాల పట్టివేత
ముగ్గురి అరెస్టు అల్వాల్ : కోటి రూపాయల విలువైన ఏనుగు దంతాలను అల్వాల్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సైబరాబాద్ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ ఈ.రామచంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన వీకేఎస్ బోస్ తన వద్ద ఉన్న ఏనుగు దంతాలను అమ్మిపెడితే కమీషన్ ఇస్తానని కుంచర్లపాటి సూర్యనారాయణ రాజుకు చెప్పాడు. సూర్యనారాయణ రాజు నగరంలోని అమీన్‌పూర్‌కు చెందిన మున్నూర్ ఫణీందర్(26) ద్వారా మోతీనగర్‌కు చెందిన రియల్టర్ నున్న అరవింద్‌రెడ్డికి ఏనుగు దంతాల గురించి తెలియజేశాడు. అతను ఏనుగు దంతాలు తీసుకొని రమ్మని చెప్పడంతో సూర్యనారాయణరాజు వైజాగ్ నుంచి ఏనుగుదంతాలను నగరానికి తెచ్చి.. అల్వాల్ గ్రీన్‌ఫీల్డ్స్‌లో ఉన్న అరవింద్‌కుమార్‌ను కలిశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితులు సూర్యనారాయణరాజు, ఫణీందర్, అరవింద్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, 5 సెల్ఫోన్లు, మారుతీ స్విఫ్టు కారు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశారు. మరో నిందితుడు వైజాగ్‌కు చెందిన వీకేఎస్ బోస్ పరారీలో ఉన్నాడు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్లో కె.నరసింగరావు, ఎన్సీహెచ్ రంగస్వామి, ఎ.రాములు ఎస్ఓటీ ఈస్ట్‌జోన్ సిబ్బంది, మల్కాజగిరి పోలీసులు పాల్గొన్నారు. -
డబ్బు కాజేసి దోపిడీ నాటకం...
సాక్షి, సిటీబ్యూరో : జూబ్లీహిల్స్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన భారీ దోపిడీ కేసును కేవలంలో 12 గంటల్లోనే వెస్ట్‌జోన్, జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. ఫిర్యాదు చేసిన ఉద్యోగులే ఆ డబ్బును కాజేసి దోపిడీ నాటకం ఆడారని తేల్చారు. నిందితుల నుంచి రూ. 20.61 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో బుధవారం కమిషనర్ మహేందర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. లగ్జరీ లైఫ్ కోసమే దారి తప్పారు... జూబ్లీహిల్స్‌లోని హజల్ మార్కెటింగ్ కార్యాలయంలో కరీంనగర్‌కు చెందిన బిల్లా శ్రీనివాస్ సేల్స్ కో-ఆర్డినేటర్‌గా, తూర్పుగోదావరికి చెందిన ఇంజవరపు రమేశ్ ఆఫీస్ బాయ్ కమ్ డ్రైవర్‌గా ఐదేళ్లుగా పని చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.71లో ఉన్న ఎస్ఎంఎస్ ఫార్మా కంపెనీ వద్ద హజల్ కంపెనీ రసాయనాలు తీసుకొని వివిధ కంపెనీలకు విక్రయిస్తుంది. ఇలా విక్రయించగా వచ్చిన కలెక్షన్ డబ్బును రోజూ సాయంత్రం ఎస్ఎంఎస్ ఫార్మా కార్యాలయంలో డిపాజిట్ చేస్తారు. ఈ పని అంతా హజల్ మార్కెటింగ్ మేనేజర్ శేఖర్ పర్యవేక్షిస్తారు. ఇతని వద్దే పని చేస్తున్న నిందితులు శ్రీనివాస్, ఇంజవరపు రమేశ్ నగరంలోని లగ్జరీ లై ఫ్స్టైల్ చూసి తాము కూడా అలా ఉండాలనుకున్నారు. ఇందుకు తమ జీతం సరిపోకపోవడంతో కంపెనీ డబ్బు కాజేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు శ్రీనివాస్ విద్యానగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు తుని సురేశ్ సహకారం తీసుకున్నాడు. రోజూ మాదిరిగానే మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి కలెక్షన్ చేసిన రూ. 20 లక్షల 61 వేలను జూబ్లీహిల్స్‌లోని తమ కంపెనీకి తీసుకొచ్చారు. అప్పటికే సాయంత్రం కావడంతో మేనేజర్ శేఖర్ ఆ డబ్బును ఎస్ఎంఎస్ ఫార్మా కంపెనీలో డిపాజిట్ చేయమన్నాడు. దీంతో వారు సాయంత్రం 6 గంటలకు ఆ డబ్బు తీసుకొని బైక్‌పై బయలుదేరారు. ముందే వేసుకున్న పథకం ప్రకారం పెద్దమ్మ గుడి సమీపంలో వేచివున్న సురేశ్‌కు డబ్బు ఇచ్చి పంపేశారు. సాయంత్రం 6.15కి మేనేజర్ శేఖర్‌కు ఫోన్ చేసి పల్సర్ బైక్ వచ్చిన ఇద్దరు దుండగులు డబ్బు ఉన్న బ్యాగ్‌ను లాక్కెళ్లారని, వారిని వెంబడిస్తున్నామని చెప్పి గంటపాటు అటు ఇటు తిరిగారు. తర్వాత రాత్రి 9.15కి శేఖర్‌తో కలిసి వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుట్టు విప్పిన సీసీ కెమెరాలు... వీరి ఫిర్యాదు ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36 నుంచి నేరం జరిగిందని చెప్పిన ప్రాంతం వరకు వివిధ ప్రాంతాల్లోని సిగ్నల్స్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా... శ్రీనివాస్, రమేశ్‌లను ఎవరూ వెంబడించలేదని తేలిపోయింది. దీంతో పోలీసులు ఇద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకొని విచారించగా పథకం ప్రకారమే ఆ డబ్బు కాజేసి తమ స్నేహడితుడు సురేష్‌కు అందజేశామన్నారు. పోలీసులు విద్యానగర్‌లోని సురేష్ రూమ్‌పై దాడి చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి 9.15కి నమోదైన కేసును బుధవారం ఉదయం 9.15కి.. అంటే కేవలం 12 గంటల్లోనే వెస్ట్‌జోన్ పోలీసులు ఛేదించడం గమనార్హం. విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వర రావు, బంజారాహిల్స్ డివిజన్ ఏీసీపీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి, జూబ్లీహిల్స్ పోలీసు ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్తుతో పాటు వెస్ట్‌జోన్ టీం సభ్యులు పాల్గొన్నారు. -
బాలికపై సామూహిక అత్యాచారం
పోలీసుల అదుపులో ముగ్గురు.. పరారీలో మరొకరు యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో ఓ బాలికపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సీఐ మదన్‌మోహన్‌రెడ్డి కథ నం ప్రకారం.. మండల పరిధిలోని నానక్‌నగర్‌కు చెందిన ఓ బాలిక(17) మాల్లోని బంధువుల వద్ద ఉంటోంది. బుధవారంరాత్రి ఆమె బహిర్భూమి నిమిత్తం సమీపంలోని పొలంలోకి వెళ్ల అదే గ్రామానికి చెందిన చిన్నొళ్ల చిన్న(19), పెద్దొళ్ల విజయ్(19), గుడుకుట్ల శేఖర్(21), గుడుకుట్ల వెంకటేష్(19)లు అటకాయించి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు గురువా రం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నింది తుడు చిన్నొళ్ల చిన్న పరారీలో ఉన్నాడు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను నగరంలోని ఓ ఆస్పత్రికి పంపారు. -
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు పోలీసులు ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.80 లక్షల విలువజేసే 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాటా మ్యాజిక్ వాహనంలో ఎర్రచందనం దుంగలను బెంగళూరుకు తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. నిందితులు నర్మదాకుమారి, ఆమె భర్త నాగేంద్రప్రసాద్, మంగలి ప్రసాద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఏపీ టూరిజం గెస్ట్‌హౌస్‌లో వ్యభిచారం
తిరుపతి: తిరుపతి నారాయణవనంలోని ఏపీ టూరిజం అతిథిగృహంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయింది. వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముగ్గురు దొంగలు అరెస్టు..
కరీంనగర్ టౌన్: కరీంనగర్ మూడో టౌన్ పోలీసులు శనివారం ముగ్గురు దొంగలను అరెస్టు చేశారు. వీరి నుంచి తొమ్మిది బైకులను స్వాధీనం చేసుకున్నారు. అన్నీ కూడా హీరోహోండా కంపెనీకి చెందిన స్ల్పెండర్ బైకులే. పట్టుబడిన వారు ముగ్గురూ.. జె.మల్లేష్(29), పి.దేవేందర్(22), బాల సంతోష్(30)లు స్నేహితులే. వారందరూ కరీంనగర్ పట్టణంలోని వివిధ రెస్టారెంట్లలో పని చేస్తుండేవారు. ఖాళీ సమయాల్లో దొంగ తాళంతో బైక్‌లను దొంగిలించేవాళ్లు. మల్లేష్, బాలసంతోష్‌లు దొంగిలిస్తే దేవేందర్ అమ్మి పెట్టేవాడు. ముగ్గురూ బైక్‌పై వస్తుండగా త్రీటౌన్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆసమయంలో తనిఖీ చేయగా బైక్‌కు సంబంధించిన పత్రాలు ఏవీ వారి వద్ద లేవు. పోలీసులు తనదైన శైలిలో విచారణ చేయగా విషయం మొత్తం వెల్లడైంది. పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థుల అరెస్టు
శ్రీకాకుళం: ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఫిర్యాదు పై శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని శ్రీవేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మెకానికల్ విభాగానికి చెందిన పవన్ మణికంఠ, నాగేశ్వరరావు, గణపతిరావు అనే విద్యార్థులు అదే విభాగానికి చెందిన మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కానిస్టేబుల్‌ను కొట్టి..అరెస్ట్
వైఎస్సార్ జిల్లా: ఇరువర్గాలు గొడవ పడుతుండగా సర్దిచెబుతున్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా చిన్నమండెంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. రాయచోటికి చెందిన రెండు వర్గాల వారు రోడ్డు పక్కన ఘర్షణ పడుతుండగా విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ గంగాధర్ సర్ది చెప్పబోయారు. ఈ లోగా గొడవకు సంబంధంలేని షేక్ జబ్బార్, సలీమ్, అఫ్జల్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. దీనిపై ఆయన చిన్నమండెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్నమండెం ఎస్సై సెలవులో ఉన్నందున రాయచోటి రూరల్ సీఐ ప్రభాకర్ కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. (చిన్నమండెం) -
న్యాయమూర్తుల సంతకాలు ఫోర్జరీ!
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ న్యాయమూర్తుల సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపేంద్ర, బాక్సర్ బంగార్రాజు, పవన్ కుమార్ అనే ముగ్గురిని కటకటాల వెనక్కి నెట్టారు. ఉద్యోగాలు ఇప్పించే పేరుతో ఏకంగా న్యాయమూర్తుల సంతకాలనే ఫోర్జరీ చేసి నకిలీ సంతకాలతో ఉత్తర్వులు ఇచ్చిన వైనం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. నిందితుల నుంచి సెల్ఫోన్లు, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు.