కానిస్టేబుల్‌ను కొట్టి..అరెస్ట్ | three arrested due to kick the police | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ను కొట్టి..అరెస్ట్

Published Sat, Jan 31 2015 6:45 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

three arrested due to kick the police

వైఎస్సార్ జిల్లా: ఇరువర్గాలు గొడవ పడుతుండగా సర్దిచెబుతున్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా చిన్నమండెంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. రాయచోటికి చెందిన రెండు వర్గాల వారు రోడ్డు పక్కన ఘర్షణ పడుతుండగా విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ గంగాధర్ సర్ది చెప్పబోయారు. ఈ లోగా గొడవకు సంబంధంలేని షేక్ జబ్బార్, సలీమ్, అఫ్జల్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. దీనిపై ఆయన చిన్నమండెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్నమండెం ఎస్సై సెలవులో ఉన్నందున రాయచోటి రూరల్ సీఐ ప్రభాకర్ కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

(చిన్నమండెం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement