చిక్కడపల్లి: ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట..ఒకరి మృతి ఘటనలో థియేటర్ యజమాని, ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చిక్కడపల్లి ఏసీపీ ఎల్.రమేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్, ఎస్‌ఐ మౌనికలు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఇక్కడ వారు మీడియాతో మాట్లాడుతూ థియేటర్‌లో ముందు రోజే భారీ హంగామా చేయడం, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం వహించడం వల్లే రేవతి అనే మహిళ మృతిచెందినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.
సినిమా నటులు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు వస్తున్నారన్న విషయం థియేటర్ నిర్వాహకులు తమకు తెల్పలేదన్నారు. విచారణ అనంతరం సంధ్య థియేటర్‌కు సంబంధించిన ఏడుగురు యజమానుల్లో ఒకరైన ముడుపు సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోయర్ బాల్కనీని చూసుకునే మేనేజర్ గంధం విజయ్‌చందర్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరిస్థితిపై లీగల్ టీంను సంప్రదించి..తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్‌కు కూడా నోటీసులు ఇస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment