ఉత్తమ్, షబ్బీర్పై దాడి కేసులో ముగ్గురి అరెస్ట్ | three arrested in congress leaders attacks in old city | Sakshi
Sakshi News home page

ఉత్తమ్, షబ్బీర్పై దాడి కేసులో ముగ్గురి అరెస్ట్

Published Wed, Feb 3 2016 7:08 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు కశ్యప్, అబేద్, మసియుద్దీన్లను బుధవారం డీసీపీ కార్యాలయానికి తరలించారు.

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై  దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు కశ్యప్, అబేద్, మసియుద్దీన్లను బుధవారం డీసీపీ కార్యాలయానికి తరలించారు.

వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు... మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని సౌత్ జోన్ డీసీపీ తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం ధర్నాకు దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీపై దాడి చేయడంతో పాటు ఉత్తమ్ కారు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement