హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న ఓ వ్యభిచార గృహంపై ఎస్వోటీ పోలీసులు శనివారం మధ్యాహ్నం మెరుపు దాడికు దిగారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో మల్కాజిగిరి పరిధిలోని శివనగర్‌లోని ఓ ఇంటిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించారు.