కడప: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న సంఘటనకు సంబంధించిన కేసులో సోమవారం మరో ముగ్గురిని చిన్నచౌక్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్ ఔట్‌గేటు వద్ద అరెస్ట్ చేశారు. సాయంత్రం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ నిందితుల అరెస్ట్ వివరాలను తెలిపారు.
ఈనెల 2వతేదీన 12 మంది ఎర్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు. అదే సంఘటనలో పరారైన ముగ్గురిని ప్రస్తుతం అరెస్ట్ చేయగలిగామన్నారు. అరెస్టయిన వారిలో కడప నగర శివార్లలోని వాటర్‌గండికి చెందిన మామిళ్ల ఓబులేసు (23), సిద్ధవటం దిగువపేటకు చెందిన సయ్యద్ రఫీ (45), చింతకొమ్మదిన్నె మండలం, పడిగెల పల్లె గ్రామానికి చెందిన కొమ్మిశెట్టి రాజేష్ (28)లు ఉన్నారు. వీరిని విచారించగా వారిచ్చిన సమాచారం ఆధారంగా వాటర్‌గండి సమీపంలో శివాలయం ఎదురుగా పెన్నానది ఇసుకలో దాచిన ఆరు ఎర్రచందనం దుంగలను, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదే కేసులో ఇంకా కొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు ధనుంజయుడు, రామకృష్ణుడు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎర్రచందనం కేసులో ముగ్గురి అరెస్ట్
Published Tue, Jun 7 2016 5:34 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement