హైదరాబాద్: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ పై పోలీసులు దాడులు నిర్వహించించారు. ఇద్దరు యువతులు సహా మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిదిలోని 6వ ఫేజ్‌లో అనుమతులు లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించింది. పక్కా ప్రణాళికతో గురువారం రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు మసాజ్ సెంటర్ పై దాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీలలో భాగంగా నిర్వాహకుడితో పాటు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.