massage center
-
స్పా సెంటర్ మాటున గలీజ్ దందా..
-
మసాజ్ కోసం కక్కుర్తి పడ్డ బెజవాడ కుర్రాళ్ళు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని పహార్ గంజ్ ప్రాంతంలో ఒక హోటల్లో ఉంటున్న ఐదుగురు కుర్రాళ్లను మసాజ్ సెంటర్ పేరు చెప్పి ఇద్దరు వ్యక్తులు బురిడీ కొట్టించారు. దౌర్జన్యం చేసి వారి దగ్గర నుండి రూ.27,000 నగదును దోచుకున్నారు. అనంతరం మోసపోయిన యువకులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు సోహైల్ గులాం రబ్బానీ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన రవ్వలపాటి మోజెస్ అతని స్నేహితులు నవీన్, దినేష్, సురేందర్, సందీప్ లు పహార్ గంజ్ లోని హోటల్ అమాన్ లో ఉంటున్నారు. తెల్లవారు జాము 4.30 సమయానికి ఈ ఐదుగురు టీ తాగి సిగరెట్ కాల్చడానికి బయటకు వచ్చారు. అక్కడికి వచ్చిన ఒక యువకుడు వీరికి మసాజ్ సెంటర్ గురించి చెప్పి ఆశ పుట్టించాడు. మసాజ్ అనగానే ఆశపడ్డ ఐదుగురు స్నేహితులు ఆ అజ్ఞాత వ్యక్తి వెనుక గుడ్డిగా వెళ్లారు. వారిని హోటల్ తాన్యకు తీసుకెళ్లిన అజ్ఞాత వ్యక్తి అక్కడ కూర్చోమని చెప్పి బయటకు వెళ్లి కోసుద్ది సేపటికి ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చి తలుపులు గడి పెట్టారు. ఐదుగురిని చితక్కొట్టి వారి నుంచి డబ్బులు గుంజుకున్నారు. ఫోన్ పే ద్వారా రూ.27,000 తమ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించారు. నిలువుదోపిడీ పూర్తైన తర్వాత ఐదుగురిని మర్యాదగా ఢిల్లీ విడిచి వెళ్లాలని లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు తెలిపారు డీసీపీ సైన్. ఫిర్యాదుదారుడు చెప్పిన వివరాల ప్రకారం నిందితులను అదుపులోకి తీసుకున్నామని తర్వాత ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి వారిని గుర్తించినట్లు తెలిపారు. వారిని సోహైల్,గులాం రబ్బానీగా గుర్తించామని మా స్టైల్లో విచారణ జరపగా నిందితులు నేరాన్ని అంగీకరించినట్టు తెలిపారు. ఈ సంఘటనలో హోటల్ యజమాని, మేనేజర్ పాత్ర ఏమిటనేది ఆరా తీస్తున్నామని ఒకవేళ వారు దోషులుగా తేలితే హోటల్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎమ్మెల్యే -
స్టూడియో ముసుగులో స్పా, మసాజ్ సెంటర్ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్ (సనత్‌నగర్): స్టూడియో ముసుగులో స్పా, మసాజ్ సెంటర్లను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. అమీర్‌పేటకు చెందిన ఎస్.అనిల్‌కుమార్ (31) అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని కృష్ణారెడ్డి బిల్డింగ్స్‌లో ఓషన్ బ్యూటీ స్టూడియో నిర్వహిస్తున్నాడు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం స్టూడియోపై దాడులు నిర్వహించగా అక్కడ స్పా, మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేంద్రానికి ఎటువంటి అనుమతులు, ట్రేడ్ లైసెన్స్ లేకపోగా, కస్టమర్ల రిజిస్ట్రర్ నిర్వహించకపోవడం, సీసీ కెమెరాల ఏర్పాటు లేకపోవడం, అర్హులైన థెరపిస్ట్ లేకపోవడం తదితర సమస్యలను గుర్తించారు. స్టూడియోను మూసివేసి నిర్వాహకులు అనిల్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. చదవండి భార్యకు వేరొకరితో సంబంధం.. అనుమానం ఉన్మాదిని చేసింది -
మసాజ్ పేరుతో దారుణం.. భారత్ పరువు తీస్తున్నారు కదరా అయ్యా..
దేశంలో రోజురోజుకు మహిళలు, యువతులుపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కొందరు మృగాలు భారత్ పరువును తీస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులపై లైంగిక దాడులకు పాల్పడుతూ.. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతిస్తున్నారు. తాజాగా గోవా ట్రిప్ కోసం వచ్చిన ఓ బ్రిటిష్ జంటకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల ప్రకారం.. గోవాలోని అరాంబోల్ బీచ్‌కు బ్రిటన్‌కు చెందిన కపుల్స్ వచ్చారు. ఈ క్రమంలో వారికి టూరిస్ట్ గైడ్‌గా విన్సెంట్ డిసౌజా పరిచయం చేసుకుని బీచ్‌లు తిప్పాడు. అనంతరం.. అంతర్జాతీయ పర్యాటకులతో బాగా ప్రాచుర్యం పొందిన ఉత్తర గోవా జిల్లాలోని అరాంబోల్ బీచ్ సమీపంలో మసాజ్ చేపిస్తానంటూ వారిని అక్కడికి తీసుకెళ్లాడు. మసాజ్ చేస్తున్న క్రమంలో డిసౌజా.. భర్త కళ్ల ముందే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూన్ 2వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ దారుణ ఘటన అనంతరం బాధితులు.. బ్రిటన్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులను సంప్రదించి.. భారత్‌లోని బ్రిటిష్ రాయబార కార్యాలయం నుంచి సహాయం కోరిన తర్వాత బాధితులురాలు పెర్నెమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కాగా. నిందితుడు గతంలో ఓ పాఠశాలలో లైబ్రేరియన్‌గా కూడా పనిచేశాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం రష్యా దేశానికి చెందిన యువతిపై ఓ భారతీయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది కూడా చదవండి: ఆన్లైన్లో రమ్మీకి బానిసై.. ఇంట్లో భర్త లేనప్పుడు.. -
సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి బలవన్మరణం
గుణదల (విజయవాడ తూర్పు): మసాజ్ పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపి, అసభ్యకరంగా ఉన్న ఫొటోలను బయట పెడతామంటూ వేధింపులకు గురి చేస్తున్న ముఠా కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలోని ఓ హోటల్లో మంగళవారం జరిగింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన బెరవలి శ్రీకాంత్‌రెడ్డి (30) ప్రైవేటు ఉద్యోగి. రెండేళ్ల క్రితం శ్రీలత అనే యువతితో అతడికి వివాహమైంది. శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగ విధుల్లో భాగంగా కొంతకాలంగా విజయవాడ వచ్చిపోతున్నాడు. ఈ క్రమంలో చైతన్య, సత్యకుమార్, సునిల్ అనే ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు. వీరు శ్రీకాంత్‌రెడ్డిని ఇటీవల ఓ మసాజ్ సెంటర్‌కు తీసుకెళ్లి ఓ మహిళతో చనువుగా ఉండేలా చేశారు. అదే సమయంలో సెల్ఫోన్లో వారి ఫొటోలు చిత్రీకరించిన ఆ ముగ్గురూ.. ఫొటోలు తొలగించాలంటే తమకు భారీగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురైన శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం బెంజి సర్కిల్లోని ఓ హోటల్లో గది తీసుకుని తన ఆవేదనంతా చెప్పుకుంటూ ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అనంతరం హోటల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, నిందితులు ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
స్పా, మసాజ్ సెంటర్లలో అశ్లీల కార్యక్రమాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని మసాజ్ సెంటర్లు, స్పా, ఆయుర్వేద చికిత్సా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని డీజీపీ శైలేంద్ర బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ కెమెరాలను కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానించనున్నారు. రాష్ట్రంలోని పలు మసాజ్ సెంటర్లు, స్పాలు, బ్యూటీ క్లబ్‌లు, సెంటర్లు, ఆయుర్వేద చికిత్సా కేంద్రాల్లో అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు సైతం దాడులు చేస్తున్నారు. విల్లుపురంలోని ఓ ఆయుర్వేద చికిత్స కేంద్రంలో పోలీసులు తరచూ నిర్వహిస్తున్న సోదాలను వ్యతిరేకిస్తూ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తులు తీవ్రంగానే స్పందించారు. మసాజ్ సెంటర్లు, స్పాల ముసుగులో సాగుతున్న కార్యక్రమాలను గుర్తుచేస్తూ, పోలీసులకు సమాచారం వస్తే ఎక్కడైనా తనిఖీలు చేసే అధికారం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్పాలు, మసాజ్ సెంటర్లు, ఆయుర్వేద చికిత్స కేంద్రాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై హైకోర్టు ఏమన్నదంటే.. -
పంజాగుట్ట: మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో పలువురు యువతులు, నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చదవండి: బరితెగించిన కామాంధుడు.. వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం -
మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్
సాక్షి, మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మసాజ్ సెంటర్‌పై గత రెండు రోజులక్రితం దాడి చేసిన సంఘటన మరువక ముందే మరో క్రాస్ జెండర్ మసాజ్ సెంటర్‌పై నాచారం పోలీసులు దాడి చేశారు. సీఐ కిరణ్‌కుమార్ తెలిపిన మేరకు.. నాచారం హెచ్ఎంటీనగర్ ప్రధాన రహదారిలో బాలానీనగర్ జవహర్‌నగర్‌కు చెందిన రజిత అలియాస్ సుప్రియ స్పైసీ హెయిర్ బ్యూటీపార్లర్ సెంటర్లో క్రాస్ జెండర్ మసాజ్ నడుపుతున్నారు. చదవండి: విదేశాల నుంచి విద్యార్థినులను రప్పించి వ్యభిచారంలోకి.. గురువారం రాత్రి పోలీసులు మసాజ్ సెంటర్‌పై దాడి చేసి నిర్వాహకులు ఎం.రజిత (37), ఆమె భర్త నాగేందర్ (39), బోడుప్పల్ హేమానగర్‌కు చెందిన సహాయకుడు కె.శివ (34), వీరితో పాటు మసాజ్ సెంటర్లో పని చేస్తున్న ముగ్గురు మహిళలు, కస్టమర్ బండి బాలకృష్ణను (34) అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2వేలు, ఫోన్ పే స్కానర్, ఎంటీఎం కార్డు, స్వైప్ మీషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకోని రిమాండ్‌కు తరలించిన్నట్లు సిఐ తెలిపారు. -
‘మాయా’ మసాజ్ సెంటర్లు.. కష్టమర్‌గా ఓ వ్యక్తిని పోలీసులు పంపడంతో..
సాక్షి, కుషాయిగూడ: గుట్టు చప్పుడు కాకుండా బ్యూటీ పార్లర్ పేరుతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓ మసాజ్ సెంటర్‌పై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశాడు. మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్ ఏఎస్ రావు నగర్లో గ్లోయిస్ బ్యూటీ కేర్ సెంటర్ పేరుతో కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది మంగళవారం రాత్రి కష్టమర్‌గా ఓ వ్యక్తిని పోలీసులు పంపగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మసాజ్ సెంటర్ ముసుగులో పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు మహేశ్‌తో పాటు అందులో పనిచేస్తున్న అసోం, ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన అయిదుగురు యువతులను రెస్క్యూ చేసి కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు. చదవండి: చిక్కడపల్లి సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు మసాజ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ దాడి హిమాయత్‌నగర్: నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న మసాజ్ పార్లర్లపై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. సోమవారం రాత్రి నగర వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో భాగంగా హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ఓ స్పాలో రైడ్ చేశారు. ఇక్కడ సరిగా రికార్డులు మెయింటైన్ చేయకపోవడం, కస్టమర్ల వివరాలను సేకరించకపోవడం, సీసీ కెమెరాలు లేకపోవడం, క్రాస్ మసాజ్ లాంటివి జరుగుతుండటంతో ముగ్గురు కస్టమర్లను ఒక రిసెప్షనిస్ట్‌ను అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. చదవండి: ముసురు వానకు పాడైన పంట.. ఆగిన రైతు గుండె -
ఖైరతాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం
ఖైరతాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై సైఫాబాద్ పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ షాదన్ కళాశాల ఎదురుగా చింతలబస్తీ మార్గంలో ‘టీఎనీ్టఏ బ్యూటీ పార్లర్ అండ్ స్పా’ సెంటర్ నడుస్తోంది. ఈ సెంటర్‌కు మసాజ్ కోసం వచ్చిన వారిని వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో విధుల్లో ఉన్న రాంగోపాల్‌పేట ఇన్స్పెక్టర్ చంచల్ బాబు, సైఫాబా ద్‌కు చెందిన ఇద్దరు ఎస్ఐలు, పలువురు సిబ్బందితో ప్రణాళిక సిద్ధం చేశారు. తొలుత ఓ కానిస్టేబుల్‌ను పంపి బేరం కుదుర్చుకున్నాక అతను సమాచారం ఇవ్వడంతో పోలీసులు దాడులు చేశారు. అక్కడ నిర్వాహకులు హీనా తబస్సుమ్, జైనబ్ తబస్సుమ్‌తో పాటు విటులు మొయినుద్దీన్, పుర్కాన్‌అలీ, సాజిద్‌ఆలీ, మొయిన్ మహబూబ్ హుస్సేన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారితో ముగ్గురు యువతులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పీటా చట్టం కింద నిర్వాహకులు, విటులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: గచ్చిబౌలి హోటల్లో వ్యభిచారం... ఆరుగురి అరెస్టు) -
మసాజ్ సెంటర్లో వ్యభిచారం
తిరువొత్తియూరు: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నడుపుతున్న దంపతులను పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడపించారు. చెన్నై తేనాంపేట వాసన్‌వీధిలో ఉన్న ఓ ప్రైవేటు అపార్టుమెంటులో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మసాజ్ సెంటర్‌కు రాత్రి సమయంలో ఎక్కువ సంఖ్యలో యువకులు వచ్చి వెళుతున్నట్టు స్థానికులు పాండీబజార్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాధారణ దుస్తుల్లో సంబంధిత మసాజ్ సెంటర్ వద్ద నిఘా వేశారు. అక్కడికి యువకులు వచ్చి వెళుతున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే మసాజ్ సెంటర్ లోపలికి వెళ్లి తనిఖీ చేశారు. ఆ సమయంలో యువతులతో వ్యభిచారం కార్యకలాపాలు జరిపిస్తున్నట్లు తెలిసింది. మసాజ్ సెంటర్ యజమాని సెంథిల్ (37), అతని భార్య శాంతి (32)ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడిపించారు. -
గల్లీకో గలీజు సెంటర్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : సందీప్.. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.. కొద్దిరోజులుగా కాలేజీ అయిపోగానే నేరుగా ఇంటికి రావడం లేదు.. సెలవు రోజుల్లో కూడా పని ఉందంటూ స్నేహితులతో బయటకు వెళ్తున్నాడు.. అనుమానం వచ్చిన తండ్రి ఓరోజు సందీప్‌కు తెలియకుండా ఫాలో అయ్యాడు. తన ఇంటికి సమీపంలోనే మణికొండలో ఓ మసాజ్ పార్లర్‌కు సందీప్ వెళ్తున్నట్లు గుర్తించాడు. ఆయన బ్యాంక్ ఖాతా లావాదేవీలు పరిశీలించగా రెండు నెలల్లోనే డెబిట్ కార్డు ద్వారా ఆ మసాజ్ పార్లర్‌కు 28 సార్లు రూ.2,500 చొప్పున రూ.70 వేలు చెల్లించినట్లు బయటపడింది! ఆదాయ పన్ను శాఖలో సీనియర్ అధికారి హోదాలో ఉన్న ఆయన వెంటనే పోలీసు ఉన్నతాధికారి ఒకరికి ఈ విషయం చెప్పారు. అదే రోజు సాయంత్రం పార్లర్‌పై దాడి చేసి నిర్వాహకులతోపాటు డజనుకుపైగా యువతులను అరెస్టు చేశారు. దీపక్ కుమార్... మెహదీపట్నంకు చెందిన ఈయన ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్నారు.. ఎంబీఏ చదువుతున్న తన కుమారుడికి సప్లిమెంటరీ క్రెడిట్ కార్డు ఇప్పించారు. తనకు వచ్చిన బిల్లులో కుమారుడి క్రెడిట్ కార్డు ద్వారా జరిపిన లావాదేవీలు చూసి దీపక్ ఆశ్చర్యపోయాడు. డీ ప్లస్ సెలూన్ అండ్ స్పా పేరుతో ఒకే నెలలో తన కుమారుడు రూ.27,500 ఖర్చు చేయడాన్ని చూసి కంగుతిన్నాడు. ఆరా తీస్తే మసాజ్ కోసం ఆ డబ్బు ఖర్చు చేశాడని తేలింది. డీ ప్లస్ సెలూన్ అండ్ స్పా పేరుతో హైదరాబాద్‌లో 20కి పైగా బ్రాంచీలు ఉండగా, బంజారాహిల్స్‌లోనే ఐదు ఉన్నాయి! రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో ‘మసాజ్’సంస్కృతి జోరుగా వ్యాప్తి చెందింది. వేలాది మంది యువత వీటి బారిన పడి డబ్బు పోగొట్టుకుంటున్నారు. కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి పంపుతున్న సొమ్మును మసాజ్ పార్లర్లకు ఖర్చు చేస్తున్నారు. మహిళలు మసాజ్ చేస్తారంటూ ఇంటర్నెట్లో ప్రకటనలు ఇవ్వడమే కాకుండా విద్యాసంస్థల వద్ద ఏజెంట్లను పెట్టి మరీ కొన్ని సెంటర్లు ప్రచారం చేస్తున్నాయి. నగరాల్లో తల్లిదండ్రులు ఇస్తున్న పాకెట్ మనీకి తోడు ఇతరత్రా అప్పులు చేసి వీటి బారిన పడుతున్న యువకులు ఎందరో ఉన్నారు. రాజధానిలోని పలు పార్లర్లపై ‘సాక్షి’దృష్టి సారించగా.. వాటిలో జోరుగా అనైతిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తేలింది. కాలేజీల వద్ద ఏజెంట్లను పెట్టుకొని మరీ.. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి మాత్రమే కాదు.. నగరం నలుమూలలా మసాజ్ పార్లర్లు విస్తరించి ఉన్నాయి. ఇంటర్నెట్లో దొరికిన వివరాలు, ఓ పోలీసు అధికారి అందించిన సమాచారాన్ని క్రోడీకరించి చూడగా.. సుమారు 4 వేల పార్లర్లు ఉన్నట్లు వెల్లడైంది. వీటి ద్వారా ఎంత మేర వ్యాపారం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఓ బ్యాంక్ అధికారి మచ్చుకు ఆరు పార్లర్ల ఖాతాలను పరిశీలించగా.. సగటున రోజుకు లక్ష రూపాయలకు పైగా ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోని పార్లర్లు అయితే ఇంతకంటే ఎక్కువే ఆర్జిస్తున్నాయి. హైదరాబాద్‌లో మొత్తం పార్లర్లు రోజుకు రూ.40 కోట్ల మేర వ్యాపారం చేస్తున్నట్లు అంచనా. రాజధాని, శివార్లలోని వందలాది విద్యాసంస్థల్లోని విద్యార్థులే లక్ష్యంగా నిర్వాహకులు తమ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. బెంగాల్, మణిపూర్, అస్సాం, కేరళ, మహారాష్ట్ర సహా వేర్వేరు ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి మసాజ్ పేరుతో అనైతిక పనులు చేయిస్తున్నారు. ఇంజనీరింగ్ ఇతర విద్యాసంస్థల వద్ద ఏకంగా తమ ఏజెంట్లను పెట్టుకుని మరీ ప్రచారం చేయిస్తున్నారు. అంతటితో ఆగకుండా పార్లర్‌కు వచ్చే పరిచయస్తులు కొత్తవారి మొబైల్ నెంబర్ ఇస్తే నాలుగు సార్లు మసాజ్ చేయించుకోవడానికి 50 శాతం రాయితీ అంటూ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఇంటర్నెట్ నిండా వాటి వివరాలే ‘హైదరాబాద్ మసాజ్ సెంటర్స్’అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలు రెండు డెడికేటెడ్ వెబ్సైట్లు స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. వాటి లింక్ తీసుకుని వెబ్సైట్లోకి వెళ్తే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని వేలాది మసాజ్ సెంటర్ల వివరాలు బూతు బొమ్మలతో సహా ప్రత్యక్షమవుతాయి. పార్లర్ల నిర్వాహకులు ఈ వెబ్సైట్ల ద్వారా రోజుకు కొత్తగా పది నుంచి 15 వేల మంది విద్యార్థులు, యువకులను ఆకర్షిస్తున్నారు. నగరంలో 16 ప్రాంతాలను ఎంపిక చేసి వాటి పరిధిలో ఎక్కడెక్కడ మసాజ్ పార్లర్లు ఉన్నాయన్న వివరాలు వెబ్సైట్లో ఉంచారు. ఉదాహరణకు దిల్సుఖ్నగర్ అని క్లిక్ చేస్తే ఆ ప్రాంతంలోని 80 నుంచి 100 పార్లర్ల సమాచారం దొరుకుతుంది. యువతను ఆకట్టుకోవడానికి పురుషుడికి మహిళ మసాజ్ చేస్తున్న ఫోటోలను వెబ్సైట్లో ఉంచారు. దీంతో గ్రాడ్యుయేషన్, ఆపై కోర్సులు చదువుతున్న విద్యార్థులు తేలిగ్గా వీటి బారిన పడుతున్నారు. నగరంలోని ప్రముఖ కూడళ్ల పేర్లలో దేన్ని కిŠల్క్ చేసినా 50కి తగ్గకుండా మసాజ్ సెంటర్ల వివరాలు ఉన్నాయి. కొందరైతే కాలనీల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. మామూళ్ల మత్తులో పోలీసులు నగరంలో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న మసాజ్ పార్లర్లు స్థానిక పోలీసు స్టేషన్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వీటిలో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిసినా మామూళ్లు తీసుకొని మిన్నకుండిపోతున్నారు. కొన్నిసార్లు పై అధికారుల ఒత్తిళ్లతో దాడులు చేయాల్సి వచ్చినా నిర్వాహకులకు ముందే హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేస్తున్నారు. తమకు వచ్చే ఆదాయంలో ఐదు నుంచి పది శాతం పోలీసులకు ముట్టజెప్పుతామని ఓ పార్లర్ నిర్వాహకుడు తెలిపారు. ఓ తండ్రి ఆవేదన.. ‘‘నగరంలో జరుగుతున్న ఈ తరహా అనైతిక కార్యకలాపాలను ప్రభుత్వం నియంత్రించాలి. పార్లర్లన్నింటినీ వెంటనే మూసివేయాలి. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అనైతిక ప్రకటనలకు చోటుకల్పిస్తున్న వెబ్సైట్లను నియంత్రించాలి’’అని ఓ తండ్రి ఇటీవలే ట్వీటర్ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తన కుమారుడు తెలివైన విద్యార్థి అని ఇంజనీరింగ్‌లో డిస్టింక్షన్లో పాసై ఎంబీఏ మంచి కాలేజీలో చేరి రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్లో ఫెయిలయ్యాడని, ఈ అనైతిక కార్యకలాపాలకు అలవాటు పడ్డ అతడిని ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావడం కష్టంగా మారిందని ఆవేదన చెందారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నడుస్తున్న వీటిని నియంత్రించకపోతే యువత మరింత చెడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
బ్యూటీపార్లర్ ముసుగులో మసాజ్ సెంటర్
-
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం!
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుపుతున్న మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి చేసి 9మందిని అదుపులోకి తీసుకున్నారు. పనామా సెంటర్ సమీపంలోని ఒక కాంప్లెక్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు ఎల్బీ నగర్ జోన్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వారు బుధవారం సాయంత్రం అకస్మికంగా దాడి చేశారు. తనిఖీల్లో భాగంగా సెంటర్ నిర్వాహకుడు సహా 9 మందిని అరెస్టు చేశారు. పట్టుబడ్డవారిలో ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4,050 నగదు స్వాధీనం చేసుకుని నిందితులను వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
మసాజ్ సెంటర్ పై పోలీసుల దాడులు.. ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ పై పోలీసులు దాడులు నిర్వహించించారు. ఇద్దరు యువతులు సహా మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిదిలోని 6వ ఫేజ్‌లో అనుమతులు లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించింది. పక్కా ప్రణాళికతో గురువారం రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు మసాజ్ సెంటర్ పై దాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీలలో భాగంగా నిర్వాహకుడితో పాటు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
మసాజ్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: మసాజ్ సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సెంటర్ పై దాడి చేసి నిర్వాహకుడితో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నగరంలోని అమీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెస్ట్ జోన్ పోలీసులకు సమాచారం వచ్చింది. ముగ్గురు యువతులతో పాటు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి
హైదరాబాద్: అమీర్‌పేటలో నిర్వహిస్తున్న షేడ్స్ మసాజ్ సెంటర్‌పై శుక్రవారం రాత్రి ఎస్సార్ నగర్ పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నడుపుతున్న నిర్వాహకురాలితో పాటు నలుగురు యువతులు, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్‌స్టేషన్ కు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఖైదీల మసాజ్ సెంటర్ ప్రారంభం
జైళ్లశాఖ సంస్కరణలను అభినందించిన డీజీ అనురాగ్‌శర్మ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడ జైలు వద్ద ప్రకృతి చికిత్సాలయ తరహాలో ఏర్పాటుచేసిన మసాజ్ సెంటర్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ ప్రారంభించారు. ఖైదీలకు ప్రత్యేక శిక్షణనిచ్చి, వారిచేత కేరళ మాదిరిగా ప్రకృతి చికిత్సలందజేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా ఖైదీల ములాఖత్ కోసం వచ్చే సందర్శకులు వేచి ఉండటం కోసం ఏర్పాటు చేసిన విజిటర్స్‌లాంజ్‌ను కూడా డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ములాఖత్ విషయంలో జైళ్లశాఖ అవలంభిస్తున్న నూతన పద్ధతిని పరిశీలించారు. ములాఖత్‌కు వచ్చే వారికి ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ప్రతీ ఒక్కరి పూర్తి వివరాల సేకరణ, ప్రత్యేక వెబ్ కెమెరా ద్వారా ఫోటో తీసే విధానం పట్ల డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. జైళ్లశాఖ ఖైదీలకు కల్పిస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. చంచల్‌గూడ వద్ద నిర్వహిస్తున్న పెట్రోల్‌బంక్‌ను పరిశీలించారు. జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ నూతన సంస్కరణల ద్వారా సమకూర్చుకుంటున్న వైనం, సిబ్బంది పనితీరును అనురాగ్‌శర్మ ప్రత్యేకంగా అభినందించారు. -
ఖైదీలతో మసాజ్ సెంటర్లు
రాష్ట్ర జైళ్లశాఖ వినూత్న ఆలోచన ఆదాయ మార్గాలపై దృష్టి హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇప్పటికే పెట్రోల్‌బంకులు, వ్యవసాయ ఉత్పత్తులు, చిన్న పరిశ్రమల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్న జైళ్ల శాఖ తాజాగా నేచర్‌క్యూర్ హాస్పిటల్ (ప్రకృతి చికిత్సాలయం) మాదిరిగా మసాజ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం జైళ్లలో ఎంపిక చేసిన ఖైదీలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. కొన్ని హెర్బల్ కంపెనీల సహకారంతో బయట లభించే ధరల కంటే సగం రేటుకే చికిత్సలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రయోగాన్ని మొదట చంచల్‌గూడ జైల్లో ప్రారంభించి ఇక్కడ విజయవంతమైతే మరిన్ని చోట్ల ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ 14న చంచల్‌గూడలో తొలి మసాజ్ సెంటర్‌ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జైళ్ల శాఖ డీజీగా వీకే సింగ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్కరణల బాటలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఖైదీల చేత పనులు చేయిస్తూ వారు ఆదాయం పొందడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేలా కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఖైదీలు నిర్వహిస్తున్న పెట్రోలు బంక్‌లు మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రస్తుతం జైళ్లశాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్‌లో పెట్రోల్ బంకులున్నాయి. వీటిలో ఏటా రూ.200 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. భారీ లాభాలు వస్తుండటంతో మిగతా చోట్ల కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
వ్యభిచారం నడిపిన ఏడుగురి అరెస్ట్
తిరువొత్తియూరు: చెన్నై నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వ్యభిచారం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడుగురు బ్రోకర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 మంది యువతులను విడిపించారు. పోలీసు కమిషనర్ జార్జ్ ఆదేశాల మేరకు చెన్నై జాఫర్‌ఖాన్‌పేట 15వ అవెన్యూలోని హెర్బల్ ఆయుర్వేద మసాజ్ సెంటర్లో పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేడవాక్కంకు చెందిన రామనాథన్ (29)ను అరెస్టు చేశారు. ఇతని నుంచి చెన్నైకి చెందిన ఒక యువతిని విడిపించారు. ఆరుంబాక్కంలో ఆన్లైన్ మసాజ్ నడుపుతున్న తిరువొత్తియూరుకు చెందిన కార్తీక్ (23)ను అరెస్ట్ చేశారు. అతని నుంచి కోల్‌కతాకు చెందిన యువతిని విడిపించారు. చెన్నై ఆర్కాడు రోడ్ కోడంబాక్కం లక్ష్మీ టవర్ రియా హెల్త్ కర్ స్పా అనే పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న తిరువాన్మియూరుకు చెందిన ఇస్మాయిల్‌ను (27)ను, కోయంబత్తూరుకు చెందిన నిరోషిణి (21)ని అరెస్టు చేసి జైలులో పెట్టారు. వీరి నుంచి చెన్నై కున్రత్తూరుకు చెందిన యువతిని విడిపించారు. చెన్నై ఎగ్మూర్ ఒకటవ వీధిలో బ్రైట్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా అనే మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న అమింజికరైకు చెందిన లక్ష్మి (22)ని అరెస్టు చేసి ఈమె నుంచి క ర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతిని విడిపించారు. చెన్నై స్పెన్సర్ ప్లాజా అన్నాసాలైలో నిర్విహ స్తున్న సన్‌షైన్ లగ్జరీ యూని సెక్స్ సెలూన్, స్పా యజమాని కన్నన్(25)ను అరెస్టు చేసి అతని నుంచి బెంగుళూరు, కోల్‌కతాకు చెందిన ఇద్దరు యువతులను విడిపించారు. చెన్నై వడపళణి సాలిగ్రామం అరుణాచలం రోడ్డులో ఉన్న ఫైర్ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా అనే మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న చెన్నై వలసరవాక్కంకు చెందిన జయశ్రీ (25)ని అరెస్ట్ చేశారు. ఆమె నుంచి ఐదుగురు యువతులను విడిపించారు. అరెస్టు చేసిన బ్రోకర్లను కోర్టులో హాజరుపరచి పుళల్ జైలుకు తరలించారు. వారి నుంచి విడిపించిన 11 మంది యువతులను మైలాపూరులోని మహిళా సురక్ష కార్యాలయంలో అప్పగించారు. -
మసాజ్‌సెంటర్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్‌పై దాడులు జరిపిన పోలీసులు నిర్వహాకులతో పాటు ఓ విటుడు, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ ఏఎస్‌రావునగర్‌లో ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్ ముసుగులో గతకొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి నిర్వహాకులు అనిత, మానసలను అదుపులోకి తీసుకోవడంతో పాటుగా విటుడు విజిత్‌ను వ్యభిచారానికి పాల్పడుతున్న మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కేసు నమోదు చేసి వారిని రెస్క్యూహోంకు తరలించినట్లు పేర్కొన్నారు. -
మసాజ్ సెంటర్ మాటున వ్యభిచారం!
-
మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచారం
తిరువొత్తియూరు: చెన్నైలో మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ఆయుర్వేద మసాజ్ సెంటర్ పేరిట ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు లు అందాయి. దీనిపై విచారణ చేయాలని పోలీసు కమిషనర్ జార్జి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి సాలిగ్రామం, అరుణాచలం వీధిలో ఉన్న ఓ మసాజ్ సెంటర్‌ను బుధవారం రాత్రి తనిఖీ చేశా రు. తనిఖీల్లో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి దళారి అరుణ్‌దేవ్ (24)ను అరెస్టు చేశా రు. అతని నుంచి ఇతర రాష్ట్రాలకు చెంది న నలుగురు యువతులను విడిపించా రు. అలాగే అరుంబాక్కంలో ఒక లాడ్జి లో తనిఖీ చేయగా కర్ణాటకకు చెందిన జక్కరియా(24), సైనుద్దీన్(24), అబ్దుల్ మజిత్ (24) అనే వ్యభిచార దళారులు చిక్కారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడిపించారు. కోడంబాక్కం పవర్ హౌస్ ప్రాంతంలో తనిఖీ చేయగా అక్క డ వ్యభిచారం నిర్వహిస్తున్న బ్రోకర్లు జోబిజాన్(31),మహమ్మద్ సాఖి(20)ని అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను విడిపించారు. ఆరుగురిని కోర్టులో హాజ రు పరచి పుళల్ జైలుకు తరలించారు.