మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం! | sot police raids massage center and some are arrested | Sakshi
Sakshi News home page

మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం!

Published Wed, Feb 1 2017 8:41 PM | Last Updated on Thu, Oct 4 2018 8:38 PM

మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం! - Sakshi

మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం!

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుపుతున్న మసాజ్‌ సెంటర్‌పై పోలీసులు దాడి చేసి 9మందిని అదుపులోకి తీసుకున్నారు. పనామా సెంటర్‌ సమీపంలోని ఒక కాంప్లెక్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు ఎల్బీ నగర్ జోన్ ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వారు బుధవారం సాయంత్రం అకస్మికంగా దాడి చేశారు.

 

తనిఖీల్లో భాగంగా సెంటర్‌ నిర్వాహకుడు సహా 9 మందిని అరెస్టు చేశారు. పట్టుబడ్డవారిలో ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4,050 నగదు స్వాధీనం చేసుకుని నిందితులను వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement