హైదరాబాద్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్‌పై దాడులు జరిపిన పోలీసులు నిర్వహాకులతో పాటు ఓ విటుడు, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ ఏఎస్‌రావునగర్‌లో ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్ ముసుగులో గతకొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
విషయం తెలిసిన పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి నిర్వహాకులు అనిత, మానసలను అదుపులోకి తీసుకోవడంతో పాటుగా విటుడు విజిత్‌ను వ్యభిచారానికి పాల్పడుతున్న మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. కేసు నమోదు చేసి వారిని రెస్క్యూహోంకు తరలించినట్లు పేర్కొన్నారు.
మసాజ్‌సెంటర్ ముసుగులో వ్యభిచారం
Published Mon, Jul 13 2015 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement
Advertisement