kushaiguda police station
-
రూ.3లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ
కుషాయిగూడ: భూ వివాదంలో తలదూర్చి.. వక్రమార్గం పట్టిన కుషాయిగూడ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు ఏసీబీ అధికారులకు చిక్కారు. మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కుషాయిగూడ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జోన్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ, చక్రిపురంలోని స్థల సరిహద్దు వివాదంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాడంటూ కాప్రా డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డి అనే వ్యక్తిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టు ఆదేశాలతో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కుషాయిగూడకు చెందిన ఎల్.ఉపేందర్ అనే వ్యక్తి ఈ కేసులను కాంప్రమైజ్ చేసేందుకు పోలీసుల తరఫున మధ్యవర్తిత్వం వహించాడు. ఎస్ఐ షేక్ షఫీ ఆదేశాలతో సింగిరెడ్డి భరత్‌రెడ్డిని ఉపేందర్ ఆశ్రయించాడు. రూ.3 లక్షల ఇస్తే కేసులు లేకుండా చూస్తానంటూ భరత్‌రెడ్డికి ఆఫర్ ఇచ్చాడు. తనపై భరత్‌రెడ్డికి నమ్మకం కుదరకపోవడంతో ఉపేందర్ నేరుగా ఎస్ఐ షఫీతో మాట్లాడించాడు. మరి ఇన్స్పెక్టర్ విషయం ఏమిటంటూ భరత్‌రెడ్డి ఎస్ఐని ప్రశ్నించడంతో.. ఇన్స్పెక్టర్ వీరస్వామితోనూ కలిపించి రూ.3 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఒక్క కేసే క్లోజ్ చేస్తామని.. కానీ.. రెండు కేసులూ తప్పించడం సాధ్యం కాదని ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తామని చెప్పారు. దీంతో సింగిరెడ్డి భరత్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రంగారెడ్డి జోన్ ఏసీబీ అధికారులు శుక్రవారం ఓ ప్రైవేటు కార్యాలయంలో మధ్యవర్తి ఉపేందర్‌కు ఫిర్యాదుదారు భరత్‌రెడ్డి రూ.3 లక్షల నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షేక్ షఫీలను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. సుమారు 5 గంటల పాటుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగింది. అలాగే గుర్రంగూడలోని ఇన్స్పెక్టర్ వీరస్వామి, దమ్మాయిగూడలోని ఎస్ఐ షఫీ ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తమకు లభించిన పక్కా సాంకేతిక ఆధారాలతో ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఎల్.ఉపేందర్‌లపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
హ్యాట్సాఫ్ .. స్టేటస్
కుషాయిగూడ: తప్పిపోయిన ఇద్దరు చిన్నారుల ఆచూకీ ఓ అధికారి ఫోన్లో పెట్టిన స్టేటస్‌తో కనుగొన్న ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మాలోరి లక్ష్మీరవి, సత్యమూర్తి దంపతులు కాప్రా, గాంధీనగర్ కాలనీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నారు. వారికి శివ అశ్లేష (7), యామిని (4) ఇద్దరు కూతుళ్లు. అశ్లేష రెండో తరగతి చదువుతుండగా యామిని అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుంది. శుక్రవారం రోజులానే వెళ్లిన ఇద్దరు చిన్నారులు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఇల్లు మర్చిపోయి నేరేడ్మెట్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన ఎస్సై వేణుమాధవ్ చిన్నారుల ఫొటోలను తన సెల్‌ఫోన్ స్టేటస్‌లో పెట్టి ఆచూకి తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. పెట్రోలింగ్ పోలీసుల సాయంతో సుమారు గంట పాటుగా పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అంతలోనే ఎస్సై స్టేటస్ చూసిన తెలిసిన వ్యక్తి పిల్లలు నేరేడ్మెట్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిపాడు. వెంటనే అక్కడికెళ్లి పిల్లలను స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై వేణుమాధవ్ సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు. (చదవండి: ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా అవసరం’) -
సంచలన కేసు; మూడో నిందితుడు అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ అవినీతి కేసులో మూడో నిందితుడు కందాడి శ్రీకాంత్‌రెడ్డి (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన ఇంట్లోనే నిర్జీవంగా పడివున్న అతడిని పోలీసులు గుర్తించారు. ఆదివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగార్జుననగర్ కాలనీకి చెందిన కందాడి శ్రీకాంత్‌రెడ్డి (37) వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన శ్రీకాంత్ తరచూ భార్యతో గొడవ పడుతుండటంతో మూడేళ్ల క్రితమే భర్తను వదిలి వెళ్లడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. శ్రీకాంత్‌రెడ్డి మద్యం మత్తులో తల్లితో గొడవ పడుతుండటంతో భరించలేని తల్లి వెంకటమ్మ రెండు రోజుల క్రితం నాగరంలోని కూతురు ఇంటికి వెళ్లింది. మూడు రోజులుగా ఇంట్లో ఎవరులేక పోవడంతో ఇంటిని శుభ్రం చేసేందుకు ఆదివారం ఉదయం నాగార్జుననగర్‌కాలనీలోని తన ఇంటికి వచ్చింది. తాను ఉండే ఇంటిని శుభ్రం చేసి కొడుకు గది వద్దకు వెళ్లి డోర్ కొట్టింది. ఎంతకు పలకకపోవడంతో డోర్ తెరుచుకొని లోనికి వెళ్లింది. డైనింగ్ టేబుల్ వద్ద కొడుకు పడిపోయి ఉన్నాడు. ఆందోళన చెందిన ఆమె చుట్టు పక్కల వారిని పిలిచింది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ లభించిన ఆధారాలను సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతిగా మద్యం తాగడం వల్లే మృతిచెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధాంరించారు. తండ్రి ఆత్మహత్య.. కొడుకు అనుమానాస్పద మృతి శ్రీకాంత్‌రెడ్డి తండ్రి ధర్మారెడ్డి మాజీ తహసీల్దార్ నాగరాజు అవినీతికి పాల్పడ్డ కేసులో మూడు నెలల పాటుగా జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలై మరుసటి రోజే వాసవిశివనగర్ కాలనీలోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తాజాగా ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదీ వివాదం.. భూరికార్డులు మార్చేందుకు రూ.2 కోట్లు లంచం అడిగి, ముందస్తుగా రూ.1.10 కోట్లు తీసుకుంటూ 2020, ఆగస్టు 14న కీసర అప్పటి తహసీల్దార్ నాగరాజుతోపాటు రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్, వీఆర్ఏ సాయిరాజు ఏసీబీకి పట్టుబడ్డారు. నాగరాజు వ్యవహారాలపై ఏసీబీ ఆరాతీయగా, ధర్మారెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు మరో ఉదంతం వెలుగుచూసింది. రాంపల్లి దయారాలోని 93 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారన్న ఆరోపణలతో ధర్మారెడ్డి, అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, ఇద్దరు రియల్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి నకిలీ పత్రాలు, అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించినట్టు గుర్తించిన ఏసీబీ.. నాగరాజుపై రెండో కేసును నమోదు చేసింది. ఏసీబీ కస్టడీలో ఉండగానే అక్టోబర్ 14న చంచల్‌గూడ జైలులో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మారెడ్డికి వయసు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలై మరుసటి రోజే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు నిందితులు బలవన్మరణాలకు పాల్పడడంతో అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా మరో నిందితుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. -
రాకేష్ మాస్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, కుషాయిగూడ: హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన డ్యాన్స్ మాస్టర్ రాకేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేవైఎం రాష్ట్ర నాయకులు సందీప్‌యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం సందీప్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ కృష్ణ పరమాత్ముడిపై అనుచిత వాఖ్యలు చేసిన రాకేష్ మాస్టర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో యాదవ సమాజం భౌతిక దాడులకు సైతం వెనుకాడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంగి లక్ష్మణ్, బీజేవైఎం నాయకులు ఉదయ్‌కిరణ్, నరేష్, మధు, రాకేశ్, జయంత్, అడ్వొకేట్ హరికృష్ణ ఉన్నారు. చదవండి: నాపై దాడికి యత్నించారు: రాకేష్ మాస్టర్ -
మంచి జీవితం ఇస్తా!.. మైనర్ బాలిక కిడ్నాప్, సహజీవనం
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికను అపహరించుకుపోయి సహజీవనం చేస్తున్న ఓ యువకుడిపై కిడ్నాప్, రేప్ కేసు నమోదు చేసిన ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన ఓ మైనర్ బాలిక కుటుంబం చాలా కాలం క్రితం నగరానికి వలస వచ్చి మల్లాపూర్‌లో నివాసం ఉంటుంది. మైనర్ బాలిక గత ఫిబ్రవరి 2న ఇంటి నుంచి అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూతురు అదృశ్యంపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు జరిపి పంజాబ్‌లో ఉన్నట్లు గుర్తించారు. మైనర్ బాలికతోపాటుగా సోను కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌కు చెందిన సోనుకుమార్ ఠాగూర్(19) లాక్డౌన్ సమయంలో బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి కూలీ పనిచేసుకుంటూ అదే ప్రాంతంలో నివాసం ఉన్నాడు. ఈ క్రమంలో వారికి ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకొని మంచి జీవితం ఇస్తానంటూ నమ్మించిన సోనుకుమార్ మైనర్ బాలికను పంజాబ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వివాహం చేసుకొని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపారు. -
కుషాయిగూడలో పేకాట రాయుళ్ల అరెస్టు!
సాక్షి, హైదరాబాద్: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కమలానగర్లో పేకాట శిబిరంపై ప్రత్యేక పోలీసులు బృందాలు మంగళవారం దాడులు చేశాయి. డాల్ఫిన్స్ బాయ్స్ హాస్టల్‌పై దాడి చేసి 10 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ.94 వేల నగదు, 9 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎం.శ్రీకాంత్, ఎ.సందీప్, వి.సాయి, ఎ.భరత్, ఎ.కార్తీక్, కె.సాయికిరణ్, బి.రాజు, ఎస్.రాజు, వి.కల్యాణ్, డి.వాసును కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
కారు నడిపింది ఈశాన్య రెడ్డి అనే అమ్మాయి
-
ఆ యువతుల్లో మద్యం తాగింది ఒక్కరే!
సాక్షి, హైదరాబాద్: అతివేగంగా కారు నడిపి, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న చర్మకారుడిని హత్యచేసిన యువతుల ఉదంతం నగరంలో కలకలం రేపుతున్నది. కుషాయిగూడ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి దర్యాప్తు వివరాలను సీఐ చంద్రశేఖర్ మీడియాకు వివరించారు. ఎలా జరిగింది?: ఏఎస్‌రావ్ నగర్లో స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొన్న నలుగురు యువతులు.. అర్ధరాత్రి తర్వాత స్కోడా కారులో కుషాయిగూడవైపు కదిలారు. అతివేగంగా కారును నడుపుతూ ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చారు. దీంతో ఫుట్‌పాత్‌పై నిద్రించిన అశోక్ అనే చర్మకారుడు(చెప్పులు కుట్టుకునే వ్యక్తి) దుర్మరణం చెందాడు. పక్కనున్న మరో వ్యక్తికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని యువతులను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు యువతుల్లో ఓ సీఐ కూతురు: ‘‘ఘటన జరిగినప్పుడు ఈశాన్య రెడ్డి అనే యువతి డ్రైవింగ్ సీటులో కూర్చున్నారు. కారు రిజిస్ట్రేషన్ కూడా ఆమె పేరుమీదే ఉంది. కారులో మలక్‌పేట్ సీఐ గంగారెడ్డి కూతురు హారికా రెడ్డితోపాటు మరో ఇద్దరు యువతులు ఉన్నారు. ఆ నలుగురిలో ఒక్కరు మాత్రమే మద్యం సేవించి ఉన్నారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఐపీసీ సెక్షన్ 304కింద కేసు నమోదుచేశాం. అశోక్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపాం’’ అని కుషాయుగూడ సీఐ చంద్రశేఖర్ మీడియాతో అన్నారు. -
విషపు ఇంజక్షన్ ఎక్కించుకొని...
సాక్షి, హైదరాబాద్: అనుమానస్పదస్థితిలో ఓ వైద్యురాలు మృతిచెందిన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కథనం మేరకు. సివిల్ సర్జన్ డాక్టర్ ఎంవీఏ లక్ష్మీ (43) సైనిక్‌పురి, హస్తినాపురి, జేపీ టవర్‌లో నివాసం ఉంటూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి హెచ్ఓడిగా విధులు నిర్వహిస్తుంది. అవివాహిత అయిన ఆమె ఒంటరిగానే ఉంటుంది. గత రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడాన్ని గుర్తించిన వాచ్మెన్ అపార్టుమెంట్ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన ఇరుగు పొరుగు సాయంతో పలుమార్లు తలుపు తట్టినా తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులను బద్దలుకొట్టి చూడగా ఇంట్లో చాపపై ఆమె మృతి చెంది ఉంది. సంఘటన స్థలంలో రెండు ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను బట్టి ఆమె స్వయంగా విషాన్ని ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ తెలిపారు. -
కీచక క్యాబ్ డ్రైవర్
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్ ముసుగులో యువతులను కిడ్నాప్ చేసి అఘాయిత్యాలకు పాల్పడిన కామాంధుడిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని పట్టుకున్నారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు కందుకూరి నాగమణి కిరణ్ ఇప్పటివరకు పది మంది యువతులను వేధించాడు. ఇద్దరిపై అత్యాచారం చేశాడు. పదేళ్ల బాలికను కూడా అతడు వేధించాడు. కారు డోర్ లాక్ చేసి అతడీ ఘాతుకాలకు ఒడిగట్టాడు. అయితే బాధితుల్లో ఒక్కరే ఫిర్యాదు చేశారు. శనివారం ఓ యువతిపై కిరణ్ అత్యాచారయత్నం చేశాడు. గట్టిగా అరచి, అతడిపై దాడి చేసి ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. కిరణ్ బారిన పడిన బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
కారు అద్దాలు పగులగొట్టి..
హైదరాబాద్: కుషాయిగూడలోని పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ కారు అద్దాలు పగులుగొట్టి 5 లక్షల రూపాయలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుషాయిగూడలో వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని సోనియాగాంధీనగర్‌లో నరసింహాచారి(35)అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతోనే నరసింహాచారి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాన్ని గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వావివరసలు మరిచాడు.. అందుకే కడతేర్చా!
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడాలో 'బావమరిదిని చంపిన బావ' కేసు ఎంత సంచలనం సృష్టించిందో నిదితుడి వాగ్మూలం అంతకంటే సంచలనంగా మారింది. నిందితుడి భార్య.. మృతుడికి చెల్లెలు వరస అయ్యే మహిళతో వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది. కుషాయుగూడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు గుడ్డిపోశగల్ల శ్రీనివాస్ వాగ్మూలంలో ఇలా పేర్కొన్నాడు.. 'నాకు బావైన పోలేపాక శ్రీనివాస్.. వావివరసలు మరిచి, చెల్లెలి వరసయ్యే నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి నాకు తెలిసిన తర్వాత అలా తప్పు చేయవద్దని చాలాసార్లు బతిమాలాను. కాళ్లు కూడా పట్టుకున్నాను! అయినా అతను వినలేదు. పైగా 'నీ భార్యతోనే నీకు మగతనం లేదని నలుగురిలో చెప్పిస్తా.. నీ పరువు తీస్తా' అంటూ బెదిరించేవాడు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డా' అని నిందితుడు గడ్డిపోశలగల్ల శ్రీనివాస్ పోలీసులకు చెప్పాడు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 17న హాసింగ్బోర్డు, కైలాసగిరిలో పోలేపాక శ్రీనివాస్ అనే వ్యక్తిని బావవర్ధి హత్య చేసిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న నింధితున్ని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతని సొంతూరు వరంగల్ జిల్లా చేర్యాల్లో సోమవారం అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. విచారణ అనంతరం నింధితున్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటరమణ ఘటనకు సంబంధించి వివరాలు తెలియపరిచారు. పధకం ప్రకారం ముందుగానే గొడ్డలిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నెల 17న రాత్రి సమయంలో బావకు మద్యం తాగించిన గన్నీ బావ నిద్రలోకి జారుకోగానే అప్పటికే దాచి ఉంచిన గొడ్డలితో మూడు వేట్లు వేసి పారిపోయినట్లు సిఐ తెలిపారు. పరారీ సమయంలో రాజీవ్‌నగర్ సమీపంలోని కమ్యూనీటిహాల్ సమీపంలో వదిలివెళ్లిన గొడ్డలిని నింధితుని ద్వారా స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. -
మసాజ్‌సెంటర్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్‌పై దాడులు జరిపిన పోలీసులు నిర్వహాకులతో పాటు ఓ విటుడు, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ ఏఎస్‌రావునగర్‌లో ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్ ముసుగులో గతకొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి నిర్వహాకులు అనిత, మానసలను అదుపులోకి తీసుకోవడంతో పాటుగా విటుడు విజిత్‌ను వ్యభిచారానికి పాల్పడుతున్న మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కేసు నమోదు చేసి వారిని రెస్క్యూహోంకు తరలించినట్లు పేర్కొన్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో ప్రేమజంట హల్చల్
హైదరాబాద్ సిటీ: కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఓ ప్రేమ జంట హల్చల్ చేసింది. తనను ప్రేమించి మోసం చేసిన ప్రియుడితో పెళ్లి జరిపించాలంటూ ఓ యువతి కుషాయిగూడ పోలీసులను ఆదివారం ఆశ్రయించింది. పోలీసులు శ్రమించి ఆ యువతి ప్రియుడిని పోలీసుస్టేషన్ కు తీసుకువచ్చారు. యువతి కోరిక మేరకు ప్రియుడితో వివాహం జరిపిస్తుండగా అతడు పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు వెంబడించి ప్రియుడిని పట్టుకున్నారు. యువతి తల్లిదండ్రులు అతికష్టం మీద యువకుడితో ఆమెకు వివాహం జరిపించారు. యువతికి న్యాయం చేసి పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.