
కారు బీభత్సం ఘటన, కారులో యువతులు, కుషాయిగూడ సీఐ చంద్రశేఖర్, మృతుడు అశోక్(పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్: అతివేగంగా కారు నడిపి, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న చర్మకారుడిని హత్యచేసిన యువతుల ఉదంతం నగరంలో కలకలం రేపుతున్నది. కుషాయిగూడ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి దర్యాప్తు వివరాలను సీఐ చంద్రశేఖర్ మీడియాకు వివరించారు.
ఎలా జరిగింది?: ఏఎస్‌రావ్ నగర్‌లో స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొన్న నలుగురు యువతులు.. అర్ధరాత్రి తర్వాత స్కోడా కారులో కుషాయిగూడవైపు కదిలారు. అతివేగంగా కారును నడుపుతూ ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చారు. దీంతో ఫుట్‌పాత్‌పై నిద్రించిన అశోక్ అనే చర్మకారుడు(చెప్పులు కుట్టుకునే వ్యక్తి) దుర్మరణం చెందాడు. పక్కనున్న మరో వ్యక్తికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని యువతులను అదుపులోకి తీసుకున్నారు.
నలుగురు యువతుల్లో ఓ సీఐ కూతురు: ‘‘ఘటన జరిగినప్పుడు ఈశాన్య రెడ్డి అనే యువతి డ్రైవింగ్ సీటులో కూర్చున్నారు. కారు రిజిస్ట్రేషన్ కూడా ఆమె పేరుమీదే ఉంది. కారులో మలక్‌పేట్ సీఐ గంగారెడ్డి కూతురు హారికా రెడ్డితోపాటు మరో ఇద్దరు యువతులు ఉన్నారు. ఆ నలుగురిలో ఒక్కరు మాత్రమే మద్యం సేవించి ఉన్నారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఐపీసీ సెక్షన్ 304కింద కేసు నమోదుచేశాం. అశోక్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపాం’’ అని కుషాయుగూడ సీఐ చంద్రశేఖర్ మీడియాతో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment