
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్ ముసుగులో యువతులను కిడ్నాప్ చేసి అఘాయిత్యాలకు పాల్పడిన కామాంధుడిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని పట్టుకున్నారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు కందుకూరి నాగమణి కిరణ్ ఇప్పటివరకు పది మంది యువతులను వేధించాడు. ఇద్దరిపై అత్యాచారం చేశాడు. పదేళ్ల బాలికను కూడా అతడు వేధించాడు. కారు డోర్ లాక్ చేసి అతడీ ఘాతుకాలకు ఒడిగట్టాడు. అయితే బాధితుల్లో ఒక్కరే ఫిర్యాదు చేశారు.
శనివారం ఓ యువతిపై కిరణ్ అత్యాచారయత్నం చేశాడు. గట్టిగా అరచి, అతడిపై దాడి చేసి ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. కిరణ్ బారిన పడిన బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.