హైదరాబాద్: కుషాయిగూడలోని పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ కారు అద్దాలు పగులుగొట్టి 5 లక్షల రూపాయలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.