వావివరసలు మరిచాడు.. అందుకే కడతేర్చా!
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడాలో 'బావమరిదిని చంపిన బావ' కేసు ఎంత సంచలనం సృష్టించిందో నిదితుడి వాగ్మూలం అంతకంటే సంచలనంగా మారింది. నిందితుడి భార్య.. మృతుడికి చెల్లెలు వరస అయ్యే మహిళతో వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది. కుషాయుగూడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు గుడ్డిపోశగల్ల శ్రీనివాస్ వాగ్మూలంలో ఇలా పేర్కొన్నాడు..
'నాకు బావైన పోలేపాక శ్రీనివాస్.. వావివరసలు మరిచి, చెల్లెలి వరసయ్యే నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి నాకు తెలిసిన తర్వాత అలా తప్పు చేయవద్దని చాలాసార్లు బతిమాలాను. కాళ్లు కూడా పట్టుకున్నాను! అయినా అతను వినలేదు. పైగా 'నీ భార్యతోనే నీకు మగతనం లేదని నలుగురిలో చెప్పిస్తా.. నీ పరువు తీస్తా' అంటూ బెదిరించేవాడు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డా' అని నిందితుడు గడ్డిపోశలగల్ల శ్రీనివాస్ పోలీసులకు చెప్పాడు.
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 17న హాసింగ్‌బోర్డు, కైలాసగిరిలో పోలేపాక శ్రీనివాస్ అనే వ్యక్తిని బావవర్ధి హత్య చేసిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న నింధితున్ని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతని సొంతూరు వరంగల్ జిల్లా చేర్యాల్‌లో సోమవారం అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. విచారణ అనంతరం నింధితున్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటరమణ ఘటనకు సంబంధించి వివరాలు తెలియపరిచారు. పధకం ప్రకారం ముందుగానే గొడ్డలిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నెల 17న రాత్రి సమయంలో బావకు మద్యం తాగించిన గన్నీ బావ నిద్రలోకి జారుకోగానే అప్పటికే దాచి ఉంచిన గొడ్డలితో మూడు వేట్లు వేసి పారిపోయినట్లు సిఐ తెలిపారు. పరారీ సమయంలో రాజీవ్‌నగర్ సమీపంలోని కమ్యూనీటిహాల్ సమీపంలో వదిలివెళ్లిన గొడ్డలిని నింధితుని ద్వారా స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.