illegal contact
-
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
ఆకివీడు : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన పెదకాపవరం గ్రామ శివారు గొల్లగూడెంకు చెందిన చింతల జగదీష్(45) ఉప్పుటేరులో శుక్రవారం శవమై తేలాడు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. వివాహేతర సంబంధం కారణంగా అతడిని చంపి మూటకట్టి ఉప్పుటేరులో పడేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆకివీడు ఎస్సై రఘు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కలిదిండి మండలం తాడినాడ శివారు సున్నంపూడి సమీపంలో ఉప్పుటేరులో గోనె సంచిలో మృతదేహం ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆకివీడు పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు వచ్చి గోనెసంచిలో ఉన్న మృతదేహాన్ని చింతల జగదీష్ (45)గా గుర్తించారు. ఈ నెల 4న జగదీష్ కనిపించకపోవడంతో అతని కుమారుడు చింతల శివకృష్ణ ఆకివీడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి జగదీష్ బంధువులు గాలిస్తున్నారు. ఉప్పుటేరులో వెతుకుతున్న క్రమంలో శుక్రవారం గోనెసంచిలో శవం ఉన్నట్టు స్థానికులు తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రణాళిక ప్రకారం హత్య జగదీష్ మృతికి వివాహేతర సంబంధం కారణమనే కోణంలో పోలీసులు విచారించారు. దీంతో కొన్నేళ్లుగా గ్రామానికి చెందిన పాలెం వెంకటలక్షి్మతో జగదీష్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఇటీవల జగదీష్ తమ సంబంధాన్ని అందరికీ చెబుతానని వెంకటలక్షి్మని బెదిరిస్తున్నాడు. దీంతో వెంకటలక్ష్మి తన భర్త ఏడుకొండలు స్నేహితుడైన బాలాజీకి జగదీష్ బెదిరిస్తున్న విషయం చెప్పింది. అతడు ఏడుకొండలకు జరిగిన విషయం తెలిపాడు. దీంతో ఏడుకొండలు, బాలాజీ, వెంకటలక్ష్మి కలిసి జగదీష్‌ను చంపాలని నిర్ణయించారు. జగదీష్‌ను ఇంటికి రమ్మని వెంకటలక్షి్మతో పిలిపించారు. ఇంటికి వచ్చిన జగదీష్‌ను తుండు అతడి మెడకు చుట్టి పీకనొక్కి చంపివేశారని ఎస్సై రఘు తెలిపారు. అనంతరం శవాన్ని గోనెసంచిలో మూటకట్టి ఉప్పుటేరులో పడేశారని చెప్పారు. శవాన్ని పోస్టుమార్టానికి పంపి కేసు నమోదు చేసి నిందితుల్ని కోర్టుకు హాజరుపరుస్తున్నట్టు రఘు తెలిపారు. విచారణలో ఏఎస్సై, రైటర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉసురుతీసిన వివాహేతర బంధం
కొవ్వూరు : వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాల్ని బలిగింది. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొవ్వూరు సీఐ పి.ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరు 23వ వార్డు ముస్లిం స్కూల్ వీధిలోని ఓ ఇంట్లో సంఘటన జరిగింది. పట్టణానికి చెందిన పూర్ణచంద్రరావు (23) అనే యువకుడు పాలిటెక్నిక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ముస్లిం స్కూల్ వీధికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెండేళ్లుగా సహజీవనం చేస్తుండగా విషయం తెలిసిన పూర్ణచంద్రరావు సోదరుడు వెంకట సుబ్బారావు, అతని స్నేహితులు ఆమెను మందలించారు. పూర్ణచంద్రరావును రానిద్దని, వస్తే తమకు సమాచారం ఇవ్వాలని గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి పూర్ణచంద్రరావు ఆమె ఇంటికి వచ్చాడు. దీనిని ఆమె ప్రతిఘటించడంతో చనిపోతానని బెదిరించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆమె ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఆమె, తన కుమార్తెతో మరో గదిలో నిద్రపోయింది. గురువారం ఉదయం నిద్రలేచిన ఆమె పూర్ణచంద్రరావు ఉన్న గదికి గడియపెట్టి ఉండటంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు. -
సిద్ధపల్లెలో ఇరువర్గాల ఘర్షణ
ఆత్మకూరు రూరల్: సిద్ధపల్లె గ్రామంలో మంగళవారం రాత్రి ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వివాహేతర సంబంధం కారణంగా వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారి తీసింది. రాత్రి 7.30 సమయంలో ఇరువర్గాలకు చెందిన కొందరు కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు లోకేష్ కుమార్ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ప్రియుడితో ఉండగా దుర్ఘటన గుంటూరు ఈస్ట్: లాడ్జి గదిలో ప్రియుడితో ఉన్న ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. వరంగల్‌కు చెందిన ఆమె ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయంతో గుంటూరు వచ్చి ప్రియుడితో లాడ్జి గదిలో గడుపుతూ మృతి చెందింది. ఎస్హెచ్ఓ వెంకన్న చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చైతన్య (25) అనే వివాహితకు ఇద్దరు పిల్లలు. భర్తతో గొడవలు పడి విడిపోయింది. సెల్ ఫోన్లో ఫేస్ బుక్ ద్వారా గుంటూరులోని గుంటూరువారి తోట 4వ లైనుకు చెందిన జర్నెపూడి శివప్రసాద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచు వరంగల్, గుంటూరులలో కలుసుకునే వారు. ఇదే క్రమంలో ఈ నెల 12వ తేదీన చైతన్య గుంటూరుకు రాగా శివప్రసాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అశ్విని లాడ్జిలో ఏసీ గది అద్దెకు తీసుకున్నాడు. ఒకరోజు ఇద్దరూ అందులో గడిపిన తరువాత నాన్ ఏసీ రూమ్‌లోకి మారారు. ఎమైందో తెలీయదు కానీ శుక్రవారం ఉదయం చైతన్య మృతి చెందిందంటూ శివప్రసాద్ కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎస్హెచ్ఓ వెంకన్న చౌదరి మృతదేహాన్ని పరిశీలించి జీజీహెచ్‌లోని అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యుల మరణ ధ్రువీకరణ అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...
– ప్రియుడితో కలిసి భర్త హత్య – గొర్రెల కాపరి హత్య కేసును ఛేదించిన పోలీసులు – ఎడుగురు నిందితుల అరెస్ట్ గుర్రంకొండ:గత నెల 18వ తేదీన గుర్రంకొండ మండలం దౌలత్‌ఖాన్ పల్లె సమీపంలోని యల్లంపల్లి అటవీ ప్రాంతంలో గొర్రెల కాపరి భాస్కర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు గుర్తించారు. ఈ మేరకు ఏడుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. వాల్మీకిపురం సీఐ శ్రీధర్‌నాయుడు కథనం మేరకు... దౌలత్‌ఖాన్‌పల్లెకు చెందిన బీదం భాస్కర్(38), రెడ్డెవ్ము(26) దంపతులు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రావూనికి చెందిన పి.రమేశ్‌బాబు(35) రెడ్డెవ్ముతో వివాహేతర సంబందం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ భార్య రెడ్డెవ్మును మందలించాడు. తవు సంబంధానికి భర్త అడ్డు తొలగించుకోవాలని రెడ్డెమ్మ ప్రియుడు రమేశ్‌బాబుతో కలిసి హత్యకు పథకం పన్నింది. ఈ క్రమంలో కురబలకోట వుండలం తుంగానిపల్లెకు చెందిన గణేష్‌బాబు(25), వుదనపల్లె పట్టణం ఎగువ కురవవంక ఇందిరవ్ముకాలనీకి చెందిన సునీల్‌కువూర్(22), సుండుపల్లె నరేష్‌బాబు(25), వుదనపల్లె వుండలం కోళ్లబైలు పంచాయతీ మామిడిగుంపులపల్లెకు చెందిన టి.నాగరాజు(35), గుర్రంకొండ పంచాయతీ దౌలత్‌ఖాన్‌పల్లెకు చెందిన ఎస్.కమాల్‌బాషా(32)ను కలిసి రూ.1.5 లక్షలకు భాస్కర్‌ను హత్య చేసేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ముందుగా రూ.15 వేలు అడ్వాన్స్ చెల్లించారు. పథకం ప్రకారం గత నెల 18వ తేదీన భాస్కర్ మండలంలోని యల్లంపల్లి అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుకొంటుండుగా ఐదుగురు వెనుకవైపు నుంచి రాయితో బలంగా కొట్టారు. అనంతరం టవల్‌తో గొంతుకు ఉరి వేసి చంపేశారు. మెుదట్లో అనువూనాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు వుృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. రిపోర్టులో హత్య అని తేలడంతో భార్య రెడ్డెవ్ము, ప్రియుడు రమేశ్‌ను విచారించగా అసలు నిజాలు వెలుగుచూశాయి. ఈ మేరకు రమేశ్‌బాబు, రెడ్డెవ్ము, గణేష్, సునీల్, నరేష్, నాగరాజు, కవూల్‌బాషాను ఆదివారం అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను సోమవారం వాల్మీకిపురం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయనపేర్కొన్నారు. -
వివాహేతర సంబంధంతోనే రైతు హత్య
రేణిగుంట : తమ కుటుంబానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కక్షతోనే రైతును ఇద్దరు వ్యక్తులు హత్య చేశారని రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని దిగువ మల్లవరంలో గత నెల 15వ తేదీ రాత్రి వేరుశనగ కాయల వద్ద కాపలా వెళ్లిన రైతు పద్మముని (60) హత్యకు గురయ్యాడని తెలిపారు. ఈ కేసును అర్బన్ సీఐ బాలయ్య, ఎస్ఐ మధుసూదన్‌రావు దర్యాప్తు చేశారని పేర్కొన్నారు. విచారణలో దిగువ మల్లవరానికి చెందిన నాగరాజు సోదరుని భార్యతో పద్మముని వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడన్న అనుమానంతో హత్యకు పథకం రచించారని పేర్కొన్నారు. పొలంలో పద్మముని ఒక్కడే కాపలా ఉన్నట్లు నిర్ధారించుకున్న నాగరాజు(35) తన బంధువు రమణయ్య(55)తో కలిసి రాయితో మోది, కత్తితో గొంతుకోసి హత్య చేశారని తెలిపారు. అనంతరం వారు పరారయ్యారని పేర్కొన్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెల్లడి కావడంతో నిందితులు శనివారం ఉదయం వీఆర్వో విజయభాస్కర్‌రెడ్డి వద్ద లొంగిపోయి తామే హత్య చేసినట్లు అంగీకరించారని వివరించారు. నిందితులను వీఆర్వో పోలీసులకు అప్పగించారని తెలిపారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంతో కృషి చేసిన సీఐ, ఎస్‌ఐలతోపాటు పోలీసు సిబ్బంది రమణ, వరప్రసాద్, శేఖర్, మధులకు రివార్డులు ఇవ్వాలని తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మికి విన్నవించినట్లు తెలిపారు. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు చెప్పారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
కోసిగి(కర్నూలు): పెద్దకడబూరు మండలం గవిగట్టు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ ఈరన్న(22) హత్యకేసు మిస్టరీ వీడింది. హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన శనివారం ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వివరించారు. ఆర్ఎంపీ వైద్యుడు ఈరన్న కోసిగికు చెందిన కొండగేని నాగవేణితో పెళ్లికాక ముందు నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అది జీర్ణించుకోలేని ఆమె భర్త నాగార్జున, కుటుంబ సభ్యులు ఈరన్నను అంతమొందించేందుకు పథకం వేశారు. ఈ మేరకు జూలై 7వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో ఈరన్న జుమ్మలదిన్నె గ్రామం నుంచి గవిగట్టు గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా కోసిగి గ్రామ శివారులో కాపు కాసి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు పారిపోతుండగా తలపై రాయితో మోది చంపేశారు. అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశారు. మరుసటి రోజు హత్య వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి మిస్టరీని చేధించారు. హత్యకు పాల్పడిన నాగార్జున, అతని తల్లి గుండమ్మ, నాగవేణి తండ్రి స్వామిదాసు, అతని సోదరులు గోపాల్, తిక్కయ్య, నాగార్జున బావమర్దులు నాగరాజు, శ్రీరాములు, బంధువులు నాడుగేని, మారెయ్య, అరవలి నరసింహా, శంకరయ్యను అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరు పరుచగా రిమాండ్‌కు ఆదేశించారు. హత్యకు ఉపయోగించిన ఆటో, మూడు బైక్‌లను సీజ్ చేశారు. నెల రోజుల్లోనే కేసును చేధించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో కోసిగి, ఆదోని రూరల్ సీఐలు కంబగిరి రాముడు, ప్రసాద్, కోసిగి ఎస్ఐ ఇంతియాజ్ బాష, ట్రైనీ ఎస్ఐ రాజా రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమణ, మద్దిలేటి, మోహన్ కష్ణ, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎంత పని చేశావు తల్లీ..?
- పరస్త్రీ వ్యామోహంలో భర్త - తనను, బిడ్డలను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న మనస్తాపం - జీవితంపై విరక్తితో బిడ్డలకు ఉరేసి, తానూ బలవన్మరణానికి పాల్పడిన అభాగ్యురాలు - ఇదే విషయమై నాలుగేళ్ల కిందటా ఆత్మహత్యాయత్నం బిడ్డల మీద ప్రేమకంటే భర్తపై కోపమే ఆమెకు ఎక్కువైంది.. పిల్లల మీద ఆశైనా ఆమె ఆవేశాన్ని అణచలేకపోయింది. ముద్దులొలికే బిడ్డలను చంపడానికి ముందు మొద్దుబారిన ఆ మనసు ఎంత ఏడ్చిందో.. సర్వస్వమనుకున్న భర్తే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది.. భర్తను ప్రశ్నించింది.. నిలదీసింది.. అయినా ఆ కామాంధుడిలో మార్పు రాలేదు. ఇక తను బతికి ప్రయోజనం లేదనుకుందో, ఏమో ఆ పిచ్చితల్లి.. తాను చస్తే బిడ్డల ఆలనాపాలనా ఎవరు చూస్తారనుకుందో ఏమో... తొలుత బంగారం లాంటి పిల్లలిద్దరినీ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసి చంపేసింది. వారి ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక.. తానూ ఊయల కోసం వేసిన ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని తనువు చాలించింది. ఈ విషాద ఘటన గుత్తిలో మంగళవారం చోటుచేసుకుంది. గుత్తి(అనంతపురం) : గుత్తికి చెందిన రఘుబాబు భార్య నేత్రావతి(28) తన ఇద్దరు కుమారులైన మురారి(6), ముఖేశ్(4)ను ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసి చంపేసింది. ఆ తరువాత తానూ ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించింది. బెంగళూరుకు చెందిన నేత్రావతి వివాహం గుత్తి మున్సిపల్ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన రఘుబాబుతో ఎనిమిదేళ్ల కిందట అయింది. వారికి ఇద్దరు మగపిల్లలు. వివాహేతర సంబంధం వద్దన్నా... హాయిగా సాగిపోతున్న నేత్రావతి, రఘుబాబు జీవితంలోకి గుత్తి ఆర్ఎస్కు చెందిన ఓ మహిళ ప్రవేశించింది. ఈ విషయం తన చెవిలో పడినా నేత్రావతి నమ్మలేకపోయింది. భర్త కదలికలపై నిఘా పెట్టింది. చివరకు తన భర్త అసలు రూపం తెలుసుకుంది. వివాహేతర సంబంధం మంచిది కాదని, తనతో పాటు పిల్లలను బాగా చూసుకోవాలని భర్తను కోరింది. అతనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించింది. అయినా ఆ కామాంధుడు మారలేకపోయాడు. భార్యా పిల్లలకంటే ఉంపుడుగత్తే తనకు ప్రధానంగా భావించాడు. ఇక ఇలాగైతే కుదరదునుకున్న నేత్రావతి నేరుగా భర్తను నిలదీసింది. ఈ విషయంలో వారి మధ్య తరచూ గొడవలు ప్రారంభమయ్యాయి. ‘నువ్వు మారకపోతే పిల్లలను చంపి, నేనూ చస్తా’నంటూ ఆమె హెచ్చరించింది. ఈ విషయాన్ని అతను తేలిగ్గా తీసుకున్నాడు. ఒకసారి ఆమె ఆత్మహత్యాయత్నం చేసినా అతనిలో మార్పు రాలేదు. మొదట పిల్లలకు ఉరేసి.. నేత్రావతి ఇంట్లోనే ఫ్యాన్‌కు రెండు చీరలను వేలాడదీసి వాటి సహాయంతో కుమారులు మురారి, ముఖేశ్‌కు ఉరేసింది. అనంతరం ఆమె కూడా ఊయల కోసం వేసిన ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికొచ్చిన రఘుబాబు తలుపులు వేసి ఉండటంతో భార్యను పిలిచాడు. ఎంతసేపైనా పలకలేదు. అనుమానంతో తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య, పిల్లలు ఫ్యాన్‌కు వేలాడుతుండటం గమనించి గట్టిగా కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని కిందకు దింపారు. అప్పటికే ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. ప్రాణం ఉందేమోనని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మరణించినట్లు నిర్ధారించారు. మురారి గుత్తి ఆర్ఎస్లోని సెయింట్ మెరీస్ పాఠశాలలో ఒకటో తరగతి, ముఖేశ్ చందమామ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు కేసు నుంచి బయటపడేందుకు భర్త రఘుబాబు పోలీసులకు మరోలా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన భార్య బెంగళూరులో కాపురం పెట్టాలని తరచూ తనతో గొడవ పడుతుండేదని, అందుకు తాను అంగీకరించకపోవడం తో ఇలా చేసుకుం దని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వావివరసలు మరిచాడు.. అందుకే కడతేర్చా!
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడాలో 'బావమరిదిని చంపిన బావ' కేసు ఎంత సంచలనం సృష్టించిందో నిదితుడి వాగ్మూలం అంతకంటే సంచలనంగా మారింది. నిందితుడి భార్య.. మృతుడికి చెల్లెలు వరస అయ్యే మహిళతో వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది. కుషాయుగూడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు గుడ్డిపోశగల్ల శ్రీనివాస్ వాగ్మూలంలో ఇలా పేర్కొన్నాడు.. 'నాకు బావైన పోలేపాక శ్రీనివాస్.. వావివరసలు మరిచి, చెల్లెలి వరసయ్యే నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి నాకు తెలిసిన తర్వాత అలా తప్పు చేయవద్దని చాలాసార్లు బతిమాలాను. కాళ్లు కూడా పట్టుకున్నాను! అయినా అతను వినలేదు. పైగా 'నీ భార్యతోనే నీకు మగతనం లేదని నలుగురిలో చెప్పిస్తా.. నీ పరువు తీస్తా' అంటూ బెదిరించేవాడు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డా' అని నిందితుడు గడ్డిపోశలగల్ల శ్రీనివాస్ పోలీసులకు చెప్పాడు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 17న హాసింగ్బోర్డు, కైలాసగిరిలో పోలేపాక శ్రీనివాస్ అనే వ్యక్తిని బావవర్ధి హత్య చేసిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న నింధితున్ని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతని సొంతూరు వరంగల్ జిల్లా చేర్యాల్లో సోమవారం అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. విచారణ అనంతరం నింధితున్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటరమణ ఘటనకు సంబంధించి వివరాలు తెలియపరిచారు. పధకం ప్రకారం ముందుగానే గొడ్డలిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నెల 17న రాత్రి సమయంలో బావకు మద్యం తాగించిన గన్నీ బావ నిద్రలోకి జారుకోగానే అప్పటికే దాచి ఉంచిన గొడ్డలితో మూడు వేట్లు వేసి పారిపోయినట్లు సిఐ తెలిపారు. పరారీ సమయంలో రాజీవ్‌నగర్ సమీపంలోని కమ్యూనీటిహాల్ సమీపంలో వదిలివెళ్లిన గొడ్డలిని నింధితుని ద్వారా స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. -
ప్రియురాలిని చున్నీతో హతమార్చిన ప్రియుడు
అనంతపురం జిల్లా: మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో మున్నీ(25) అనే మహిళను ఆమె ప్రియుడు చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. వివరాలు.. జిల్లా కేంద్రలోని రాజీవ్‌నగర్‌కు చెందిన మున్నీకి ఇది వరకే వేరొకరితో పెళ్లయింది. మనస్పర్థలతో సంవత్సరం క్రితం విడిపోయి వేరుగా ఉంటోంది. పవన్ అనే యువకుడితో కొంతకాలంగా సహజీవనం చేస్తూ ఉంది. సహజీవనం చేస్తున్న పవన్, మున్నీ మరొకరితో సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో శనివారం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో అనంతపురం శివారులోకి తీసుకెళ్లి పథకం ప్రకారం హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది
న్యూఢిల్లీ: ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్యచేసిన కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో భర్త బాబులాల్‌ను చంపడానికి భార్య సుమిత్ర అక్రమసంబంధమే కారణమని పోలీసుల విచారణలో బయటపడింది. దాంతో బుధవారం భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీసు సిబ్బంది ఆ దిశగా దర్యాప్తును ప్రారంభించింది. హత్యకేసులో నిందితుడైన ప్రియుడు అర్జున్ ఇక్కా(26)ను ఒడిషాలోని సుందర్ఘడ్లో పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. భార్య సుమిత్రను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. జూన్ 20న ఓ వ్యక్తి హత్యకు గురైనట్టు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ అప్పటికే రక్తపుమడుగులో పడివున్న భర్త బాబులాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆ నిందితులిద్దరూ గుట్టువిప్పారు. ఉద్యోగం కోసం ఢిల్లీ వచ్చిన సుమిత్రకు బాబులాల్‌కు 2009లో వివాహం జరిగింది. అయితే సుమ్రిత పెళ్లికి ముందే అర్జున్‌తో స్నేహంగా ఉండేది. సుమిత్ర పెళ్లైన అనంతరం అర్జున్ కూడా ఉద్యోగం కోసం ఢిల్లీ వచ్చి సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అతను కూడా బాబులాల్, సుమిత్రలతో కలిసి ఉండేవాడు. వీరిద్దరిపై అనుమానం వచ్చిన బాబులాల్ ఒకరోజు గట్టిగా మందలించాడు. అర్జున్ను ఇంటినుంచి బయటకు పంపేశాడు. దాంతో తమకు అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపాలనుకుంది. అందులోభాగంగానే వీరద్దరూ పథకం ప్రకారం అతన్ని హతమార్చారు. ఒకరోజు ప్రియుడికి ఫోన్ చేసి జూన్ 19న ఇంటికి రమ్మని పిలిచింది. భర్త బాబులాల్ నిద్రిస్తున్న సమయంలో వాడియైన ఆయుధంతో గొంతుకోశారు. మృతదేహాం వద్ద హత్యకు వాడిన ఆయుధం, మొబైల్ ఫోన్, రక్తపు మరకలతో బట్టలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
ఉప్పల్(హైదరాబాద్): ఓ యువకుడు వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వారి కలయికను ఇద్దరి కుటుంబాల వారు వ్యతిరేకించటంతో ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. అంబర్‌పేట మల్లికార్జున నగర్‌కు చెందిన రాజుగౌడ్‌కు 14 ఏళ్ల క్రితం స్వప్న(33)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా, గత కొంతకాలంగా రామంతాపూర్ గోఖలేనగర్‌లో నివాసముండే ఆటో డ్రైవర్ రాజుకుమార్(24)తో స్వప్నకు పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం స్వప్న భర్తకు తెలిసింది. పలు మార్లు మందలించినా ఫలితం లేక పోయింది. కాగా గురువారం రాత్రి బజారుకు వెళ్తున్నానని భర్తకు చెప్పి బయటకు వచ్చిన స్వప్న రాజుకుమార్‌తో కలసి పాత రామంతాపూర్‌లోని శివాలయానికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న విషాన్ని ఇద్దరూ తాగారు. శుక్రవారం గమనించిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న వీరిద్దరినీ స్థానిక ప్రైవేటు అస్పత్రికి తరలించగా స్వప్న మృతి చెందింది. కాగా, రాజు చికిత్స పొందుతున్నాడు. స్వప్న భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను చంపి...ఆత్మహత్యగా చిత్రీకరించింది..
చేవెళ్ల (రంగారెడ్డి): వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య తన భర్తను చంపేసింది. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించి, చివరికి పోలీసులకు దొరికిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో గత నెల 24వ తేదీన అనుమానాస్పద స్థితిలో తాళ్లపల్లి వెంకటయ్య(30) చనిపోయాడు. ఈ ఘటనపై మృతుని తల్లి అంతమ్మ.. కోడలు యాదమ్మపై అనుమానం వ్యక్తం చేస్త్తూ ఫిర్యాదు చేసింది. ఈ కేసును తమదైన శైలిలో విచారణ చేయగా యాదమ్మే నిందితురాలుగా నిర్ధారణ అయింది. నిందితురాలు గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తితో సంబంధం నెరపుతోంది. ఈ విషయంలో భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, అతడు నిద్రిస్తుండగా కిరోసిన్ పోసి నిప్పంటించిన సంగతి పోలీసుల ఎదుట అంగీకరించింది. దీంతో ఈ దారుణానికి ఒడిగట్టిన యాదమ్మను, ఆమెను ప్రోత్సహించిన అంజయ్యను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. -
నడిరోడ్డుపై భర్తకు భార్య దేహశుద్ధి
నల్గొండ జిల్లా: వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. బంధువులతో కలిసి నడిరోడ్డుపైనే కట్టుకున్న వాడిని చితకబాదింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో జరిగింది. శ్రీనివాస్‌బాబు-అరుణకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఐదేళ్లుగా సాఫీగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత కలహాల కాపురంగా మారింది. దీంతో ఆరేళ్ల నుంచి భార్యభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా భార్యను తరచూ వేధింపులకు గురిచేశాడు. దీంతో విసిగిపోయిన భార్య... భర్త ఇంటికెళ్లింది. వేరే మహిళతో కలిసి ఉండటం చూసి.. అతన్ని బయటకు ఈడ్చి దేహశుద్ధి చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది.. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
తమ్ముడ్ని కత్తితో నరికి చంపిన అన్న
విశాఖపట్నం: అరకు సుకూరుగూడలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సొంత తమ్ముడ్ని అన్న కత్తితో నరికి చంపాడు. అనంతరం నిందితుడు స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కోరిక కాదన్నారని.. తలలు తెగ్గోశాడు!!
వివాహేతర సంబంధానికి నిరాకరించారని.. తల్లీ కూతుళ్లను అత్యంత కిరాతకంగా నరికి చంపాడో దుర్మార్గుడు. ఏకంగా వాళ్ల తలలను మొండేల నుంచి వేరు చేసి రోడ్డు మీద పారేసి.. చుట్టుపక్కల అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో జరిగింది. తన భర్త చనిపోవడంతో చిన్ని అనే యువతి కొన్నాళ్లుగా తన తల్లి చంద్రమ్మ వద్దే ఉంటోంది. ఆమెపై అదే గ్రామానికి చెందిన అరటికాయల వ్యాపారి శివయ్య కన్ను పడింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ మూడు నెలలుగా ఆమెపై వేధింపులు మొదలుపెట్టాడు. గురువారం తెల్లవారుజామున చంద్రమ్మ ఇంటికి వచ్చిన శివయ్య, ఏకంగా చిన్నిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తనవెంట తెచ్చుకున్న కొడవలితో చిన్నిని, ఆమె తల్లి చంద్రమ్మను కూడా నరికి చంపాడు. అంతేకాదు.. ఆ తర్వాత ఏకంగా వాళ్లిద్దరి తలలను శరీరం నుంచి వేరుచేసి రోడ్డుమీద పారేసి అక్కడి నుంచి పారిపోయాడు. -
'అక్రమ' అనుమానం.. కన్నతల్లిని కడతేర్చిన కొడుకులు
సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన సంఘటన ఇది. నలుగురు కొడుకులు కలిసి కన్నతల్లిని కడతేర్చారు. ఈ దారుణ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భైంసాలో చోటుచేసుకుంది. లక్ష్మీబాయి (55) అనే మహిళ తన స్వగ్రామం నుంచి ఉపాధి కోసం వచ్చి భైంసాలో అద్దెకు ఉంటోంది. ఆమెకు నలుగురు కొడుకులున్నారు. వాళ్లంతా ఒక శుభ కార్యానికి వెళ్లి తిరిగి వచ్చారు. తర్వాత తల్లిని హతమార్చారు. అయితే.. అందుకు వాళ్లు చెబుతున్న కారణం దారుణంగా ఉంది. తమ తల్లికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై తమకు చాలాకాలంగా అనుమానం ఉన్నా, ఇప్పుడు మాత్రం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో బండరాళ్లు, కర్రలతో దాడిచేసి చంపామని చెబుతున్నారు. కానీ తమలో ఇద్దరం మాత్రమే చంపామని, మిగిలిన ఇద్దరికీ దీంతో సంబంధం లేదని వాళ్లంటున్నారు. దీంతో పోలీసులు ఇద్దరు కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీబాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత గానీ ఈ సంఘటనపై తామేమీ చెప్పలేమని పోలీసులు అంటున్నారు. లక్ష్మీబాయి భర్త గతంలోనే మరణించగా, ఆమె కొడుకులు నలుగురూ వేర్వేరు చోట్ల ఉపాధి పొందుతున్నారు. వాళ్లలో ఇద్దరికి పెళ్లయింది. ఒకరు ట్రాక్టర్, మరొకరు ఆటో నడుపుకొంటున్నారు. మిగిలిన ఇద్దరూ కూలిపనులు చేసుకుంటారు. -
ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం!
-
ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం!
తన భార్యతో పాటు మరో వ్యక్తిపై ఉన్న అనుమానం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. హైదరాబాద్ సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని తులసీనగర్‌లో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర ఉందన్న అనుమానంతో ఆమె భర్త రవి.. సిద్ధూ అనే ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. అంతేకాదు, అతడి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి.. గోనెసంచిలో వేసి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే.. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం రవి, అతడి భార్య కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. -
ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలసి హత్య చేసిన సంఘటన తూర్పు గోదావరి, రాజోలు మండలం ములికిపల్లిగా గ్రామంలో గత అర్థరాత్రి చోటు చేసుకుంది. అనంతరం నిందితురాలు బత్తుల దుర్గా ఆమె ప్రియుడితో కలసి పరారైంది. దీంతో గురువారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్య వివాహేతర సంబంధాన్ని భర్త నిలదీయటంతో భార్య బత్తుల దుర్గా ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు స్థానికులు పోలీసులుకు వెల్లడించారు. గతంలో ఆమె భర్తపై హత్యాయత్నం చేసి జైలు కూడా వెళ్లి వచ్చిందని వారు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.