ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది | Police solves murder case | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది

Published Wed, Jul 1 2015 9:16 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

Police solves murder case

న్యూఢిల్లీ: ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్యచేసిన కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో భర్త బాబులాల్ను చంపడానికి భార్య సుమిత్ర అక్రమసంబంధమే కారణమని పోలీసుల విచారణలో బయటపడింది. దాంతో బుధవారం భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు  అరెస్ట్ చేశారు. ఈ కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీసు సిబ్బంది ఆ దిశగా దర్యాప్తును ప్రారంభించింది.  హత్యకేసులో నిందితుడైన ప్రియుడు అర్జున్ ఇక్కా(26)ను ఒడిషాలోని సుందర్ఘడ్లో పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. భార్య సుమిత్రను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. జూన్ 20న ఓ వ్యక్తి హత్యకు గురైనట్టు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ అప్పటికే రక్తపుమడుగులో పడివున్న భర్త బాబులాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు.  పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆ నిందితులిద్దరూ గుట్టువిప్పారు.

ఉద్యోగం కోసం ఢిల్లీ వచ్చిన సుమిత్రకు బాబులాల్కు 2009లో వివాహం జరిగింది. అయితే సుమ్రిత పెళ్లికి ముందే అర్జున్తో స్నేహంగా ఉండేది.  సుమిత్ర పెళ్లైన అనంతరం అర్జున్ కూడా ఉద్యోగం కోసం ఢిల్లీ వచ్చి సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అతను కూడా బాబులాల్, సుమిత్రలతో కలిసి ఉండేవాడు. వీరిద్దరిపై అనుమానం వచ్చిన బాబులాల్ ఒకరోజు గట్టిగా మందలించాడు. అర్జున్ను ఇంటినుంచి బయటకు పంపేశాడు. దాంతో తమకు అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపాలనుకుంది. అందులోభాగంగానే వీరద్దరూ పథకం ప్రకారం అతన్ని హతమార్చారు. ఒకరోజు ప్రియుడికి ఫోన్ చేసి జూన్ 19న ఇంటికి రమ్మని పిలిచింది. భర్త బాబులాల్ నిద్రిస్తున్న సమయంలో వాడియైన ఆయుధంతో గొంతుకోశారు. మృతదేహాం వద్ద హత్యకు వాడిన ఆయుధం, మొబైల్ ఫోన్, రక్తపు మరకలతో బట్టలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement