
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
అది జీర్ణించుకోలేని ఆమె భర్త నాగార్జున, కుటుంబ సభ్యులు ఈరన్నను అంతమొందించేందుకు పథకం వేశారు. ఈ మేరకు జూలై 7వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో ఈరన్న జుమ్మలదిన్నె గ్రామం నుంచి గవిగట్టు గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా కోసిగి గ్రామ శివారులో కాపు కాసి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు పారిపోతుండగా తలపై రాయితో మోది చంపేశారు. అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశారు. మరుసటి రోజు హత్య వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి మిస్టరీని చేధించారు.
హత్యకు పాల్పడిన నాగార్జున, అతని తల్లి గుండమ్మ, నాగవేణి తండ్రి స్వామిదాసు, అతని సోదరులు గోపాల్, తిక్కయ్య, నాగార్జున బావమర్దులు నాగరాజు, శ్రీరాములు, బంధువులు నాడుగేని, మారెయ్య, అరవలి నరసింహా, శంకరయ్యను అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరు పరుచగా రిమాండ్‌కు ఆదేశించారు. హత్యకు ఉపయోగించిన ఆటో, మూడు బైక్‌లను సీజ్ చేశారు. నెల రోజుల్లోనే కేసును చేధించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో కోసిగి, ఆదోని రూరల్ సీఐలు కంబగిరి రాముడు, ప్రసాద్, కోసిగి ఎస్‌ఐ ఇంతియాజ్ బాష, ట్రైనీ ఎస్‌ఐ రాజా రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమణ, మద్దిలేటి, మోహన్ కష్ణ, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.