భాస్కర్ హత్యకేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...
Published Sun, Sep 11 2016 11:36 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
– ప్రియుడితో కలిసి భర్త హత్య
– గొర్రెల కాపరి హత్య కేసును ఛేదించిన పోలీసులు
– ఎడుగురు నిందితుల అరెస్ట్
గుర్రంకొండ:గత నెల 18వ తేదీన గుర్రంకొండ మండలం దౌలత్‌ఖాన్ పల్లె సమీపంలోని యల్లంపల్లి అటవీ ప్రాంతంలో గొర్రెల కాపరి భాస్కర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు గుర్తించారు. ఈ మేరకు ఏడుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. వాల్మీకిపురం సీఐ శ్రీధర్‌నాయుడు కథనం మేరకు... దౌలత్‌ఖాన్‌పల్లెకు చెందిన బీదం భాస్కర్(38), రెడ్డెవ్ము(26) దంపతులు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రావూనికి చెందిన పి.రమేశ్‌బాబు(35) రెడ్డెవ్ముతో వివాహేతర సంబందం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ భార్య రెడ్డెవ్మును మందలించాడు. తవు సంబంధానికి భర్త అడ్డు తొలగించుకోవాలని రెడ్డెమ్మ ప్రియుడు రమేశ్‌బాబుతో కలిసి హత్యకు పథకం పన్నింది. ఈ క్రమంలో కురబలకోట వుండలం తుంగానిపల్లెకు చెందిన గణేష్‌బాబు(25), వుదనపల్లె పట్టణం ఎగువ కురవవంక ఇందిరవ్ముకాలనీకి చెందిన సునీల్‌కువూర్(22), సుండుపల్లె నరేష్‌బాబు(25), వుదనపల్లె వుండలం కోళ్లబైలు పంచాయతీ మామిడిగుంపులపల్లెకు చెందిన టి.నాగరాజు(35), గుర్రంకొండ పంచాయతీ దౌలత్‌ఖాన్‌పల్లెకు చెందిన ఎస్.కమాల్‌బాషా(32)ను కలిసి రూ.1.5 లక్షలకు భాస్కర్‌ను హత్య చేసేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ముందుగా రూ.15 వేలు అడ్వాన్స్ చెల్లించారు. పథకం ప్రకారం గత నెల 18వ తేదీన భాస్కర్ మండలంలోని యల్లంపల్లి అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుకొంటుండుగా ఐదుగురు వెనుకవైపు నుంచి రాయితో బలంగా కొట్టారు. అనంతరం టవల్‌తో గొంతుకు ఉరి వేసి చంపేశారు. మెుదట్లో అనువూనాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు వుృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. రిపోర్టులో హత్య అని తేలడంతో భార్య రెడ్డెవ్ము, ప్రియుడు రమేశ్‌ను విచారించగా అసలు నిజాలు వెలుగుచూశాయి. ఈ మేరకు రమేశ్‌బాబు, రెడ్డెవ్ము, గణేష్, సునీల్, నరేష్, నాగరాజు, కవూల్‌బాషాను ఆదివారం అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను సోమవారం వాల్మీకిపురం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయనపేర్కొన్నారు.
Advertisement
Advertisement