husband killed
-
‘దృశ్యం’ సినిమాను తలపించిన సంఘటన.. ప్రియుడితో కలిసి భర్తను చంపి..
ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి పనిచేస్తున్న స్థలంలోనే పాతిపెట్టింది. ఆపై భర్త సోదరుడికి ఫోన్ చేసి అక్కడికి వచ్చాడా అని ఆరా తీసింది. అనంతరం ఏమీ ఎరుగని దానిలా అత్తారింటికి చేరింది. అనుమానం వచ్చి మృతుడి కుటుంబ సభ్యులు నిలదీయగా ఘాతుకం బయటపడింది. దృశ్యం సినిమాను పోలిన ఈ సంఘటన గురువారం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సాక్షి, కామారెడ్డి(ఎల్లారెడ్డి): కర్ణాటక రాష్ట్రంలోని బందెంపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రమేశ్(26)కు వికారాబాద్ జిల్లా బషీ రాబాద్ మండలంలోని నీలపల్లి గ్రామానికి చెందిన వెన్నెలతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరు నాలుగేళ్ల క్రితం పటాన్చెరు ప్రాంతంలోని లింగంపల్లి శివారుకు కూలీలుగా వలసవచ్చారు. అక్కడ దౌల్తాబాద్ మండలం భూమిడాల గ్రామానికి చెందిన గంగపురి దస్తప్పతో వెన్నెలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో స్వగ్రామానికి తిరిగివెళ్లారు. రమేశ్ కుటుంబ సభ్యులకు వెన్నెల వివాహేతర సంబంధం గురించి తెలియడంతో ఇద్దరికీ సర్దిచెప్పారు. అనంతరం వారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఓ ఇంటి నిర్మాణానికి కూలీలుగా వచ్చి పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. వెన్నెల ఎల్లారెడ్డిలో ఉంటున్నట్లు తెలుసుకున్న ఆమె ప్రియుడు రెండుమూడుసార్లు వచ్చి కలిశాడు. చదవండి: (భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యం) గతనెల 30న రాత్రి 11 గంటల సమయంలో అతడు రమేశ్ కంటపడ్డాడు. దీంతో దస్తప్ప అతడి గొంతు నులమగా భార్య వెన్నెల కాళ్లు పట్టుకుని హత్యకు సహకరించింది. అనంతరం మృతదేహాన్ని వారు పనిచేస్తున్న ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. వెన్నెల మరుసటి రోజు రమేశ్ అన్న వెంకటప్పకు ఫోన్ చేసి తన భర్త ఎవరో బంధువులు మృతి చెందారని చెప్పి కర్ణాటకకు వచ్చాడని చెప్పింది. మూడు రోజుల క్రితం అత్తగారింటికి వెళ్లింది. అనుమానించిన రమేశ్ కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో మృతుడి అన్న వెంకటప్ప గురువారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేశ్ సంఘటన స్థలానికి చేరుకుని తహసీల్దార్ మునీరుద్దీన్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం కుళ్లిపోవడంతో వైద్యులు సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి, మృతుడి బంధువులకు అప్పగించారు. రమేశ్‌ను హతమార్చిన వెన్నెల, దస్తప్పలకోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: (హైదాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి) -
ప్రియుడిపై మోజుతో కాబోయే భర్తనే..
సాక్షి, ఆళ్లగడ్డ: ప్రియుడి మోజులో పడి డిగ్రీ సెకండియర్ చదువుతున్న ఓ యువతి కాబోయే భర్తను హత్య చేయించింది. ప్రియుడు, మరో నలుగురు యువకుల సాయంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ముందు రోడ్డు ప్రమాదం,తరువాత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ కేసు మిస్టరీని 24 గంటలు గడవక ముందే పోలీసులు ఛేదించడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన యువతి స్థానికంగా ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ సెకండియర్ చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న క్లాస్‌మేట్‌తో ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు మందలించినప్పటికీ వారిలో ఏమాత్రమూ మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే తమ కుమార్తెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రెండు వారాల క్రితం దూరపు బంధువైన కోటకందుకూరు గ్రామానికి చెందిన ఖాజాబేగ్ కుమారుడు గఫార్‌బేగ్‌తో పెళ్లి నిశ్చయించారు. ఫిబ్రవరిలో పెళ్లి జరిపించాలనుకున్నారు. అయితే ఈ పెళ్లి ఏమాత్రమూ ఇష్టంలేని ఆ యువతి ఎలాగైనా గఫార్‌బేగ్‌ను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. తన ప్రియుడితో కలిసి స్కెచ్ వేశారు. మరో ముగ్గురి సాయం తీసుకున్నారు. హత్య చేసింది ఇలా.. కాబోయే భర్తను ఎలాగైనా అంతమొందించాలనుకున్న ఆమె అతనికి, కుటుంబ సభ్యులకు ఏమాత్రమూ అనుమానం రాకుండా పది రోజులుగా రోజూ ఫోన్లో ప్రేమగా మాట్లాడేది. ఇంటికి రమ్మంటూ అతన్ని కోరేది. ఈ క్రమంలోనే శనివారం బాచ్చాపురంలో గడేకారి పనికి పోయిన గఫార్‌బేగ్‌కు ఫోన్ చేసింది. ‘ఇంట్లో ఎవరూ లేరు. నిన్ను చూడాలనిపిస్తోంది. ఇంటికి రా’ అంటూ నమ్మ బలికింది. అతను స్వీట్లు, పండ్లు తీసుకుని వెళ్లాడు. అక్కడ సుమారు రెండు గంటలు గడిపాడు. అప్పటికే చీకటి పడడంతో ఇంటి దగ్గర వాళ్లు ఎదురు చూస్తుంటారని తన మోటార్ బైక్‌పై గ్రామానికి బయలుదేరాడు. అయితే అప్పటికే కోటకందుకూరు సమీపంలోకి వెళ్లి సిద్ధంగా ఉండాలంటూ ప్రియుడుతో పాటు మరో యువకుడిని బైక్‌పై పంపించింది. అతను ఏ దారిలో వెళ్తాడోనన్న అనుమానంతో మరో ఇద్దరిని ఇంకో బైకుపై అతన్ని అనుసరించేలా పంపి.. నిమిష నిమిషానికి ఫోనులో సమాచారం కనుగొంది. గఫార్‌బేగ్ గ్రామ శివారులోకి వెళ్లేసరికి ముందే అక్కడ కాపు గాచిన ఆ యువతి ప్రియుడు, మరో యువకుడు బైక్‌ను అటకాయించి దాడి చేశారు. అంతలోపే వెనుక నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు కలిసి అతన్ని కత్తులతో పొడిచి చంపారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కాగా..కోటకందుకూరు సమీపాన యువకుడి మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే రాత్రి కావడంతో మృతదేహంపై కత్తిపోట్లు స్పష్టంగా కన్పించలేదు. ముందు రోడ్డు ప్రమాదమని భావించారు. తర్వాత సంఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించి..అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి కాల్ డేటా ఆధారంగా రేష్మను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారంతో కోటకందుకూరు మెట్టవద్ద ఉన్న శేఖర్ సింగ్, ఖాజీపీర్, అన్నవరం పెద్ద శ్రీనివాసులు, నాగిపోగుల చంద్రశేఖర్‌లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, రిమాండ్‌కు జడ్జి ఆదేశించారని డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. సమావేశంలో సీఐ సుదర్శనప్రసాద్, ఎస్ఐ వరప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
తునిలో ఎన్నారై సురేశ్ మృతి కలకలం.. భార్యే..!
-
జర్మనీలో భారతీయ జంటపై దాడి
న్యూఢిల్లీ: జర్మనీలోని మ్యూనిక్ నగరంలో భారతీయ దంపతులపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్‌లపై మ్యూనిక్ సిటీలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దురదృష్టవశాత్తూ తీవ్ర గాయాల పాలైన ప్రశాంత్ మృతి చెందారు. స్మితా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన న్యూగినీకి చెందిన వలసదారుడి(33)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి కారణాలు వెల్లడి కాలేదు’ అని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ప్రశాంత్ సోదరుడు జర్మనీ వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. బాధితుల ఇద్దరు పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవాలని అక్కడి మన దౌత్యాధికారులను కోరాం’ అని ఆమె వివరించారు. దీనిపై ట్విట్టర్ ఫాలోయెర్ ఒకరు.. సహృదయులైన మీరు, పేరుకు ముందుగా చౌకీదార్ అని ఎందుకు ఉంచుకున్నారు? అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ..‘విదేశాల్లో ఉంటున్న భారతీయుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా చౌకీదారీ(కాపలా) పని చేస్తున్నందునే అలా చేశాను’ అని పేర్కొన్నారు. -
భర్తను చంపి.. ఇంటిముందే పూడ్చింది
శామీర్‌పేట్: భర్తను హత్య చేయడమేగాక ఈ విషయం బయటికి పొక్కకుండా ఇంటి ఆవరణలోనే గోయ్యితీసి పూడ్చి పెట్టిన ఘటన శామీర్‌పేట మండలం కేశవరంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ భాస్కర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేశవరం గ్రామంలో ఈ నెల 3న గుర్తుతెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మామిండ్ల మల్లేష్‌గా గుర్తించారు. దీంతో మల్లేష్ భార్య జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది వెలుగులోకి వచ్చింది. కేశవరం గ్రామానికి చెందిన మల్లేష్ ,జ్యోతి దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. గత కొంత కాలంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 3న మద్యం మత్తులో ఉన్న మల్లేష్, భార్యతో గొడవపడ్డాడు. దీంతో జ్యోతి అతడిని తోసివేయడంతో కిందపడిన మల్లేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతకూ లేవకపోవడంతో భర్త మృతిచెందాడని గుర్తించి ఆందోళనకు గురైన ఆమె శవాన్ని ఇంటి ఆవరణలోనే గోయ్యి తీసి పూడ్చిపెట్టింది. వర్షం కురవడంతో మృతదేహం కుళ్లి దుర్వాసన రావడంతో ఆమె ఈ నెల 2న అర్ధరాత్రి శవాన్ని బయటకుతీసి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల గోతిలో పారవేసింది. స్ధానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జ్యోతిని నిందితురాలిగా గుర్తించి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య ప్రియుడితో భర్తను హత్య చేయించిన సంఘటన నామక్కల్‌లో సంచలనం కలిగించింది. నామక్కల్ జిల్లా పల్లిపాళయం ఆండికాడు ప్రాంతానికి చెందిన ఆనందన్ అద్దకం పట్ర నడుపుతున్నాడు. ఇతని భార్య జయలక్ష్మి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అద్దకం పట్రలో ఆనందన్ తీవ్రగాయాలతో శవంగా పడి ఉన్నాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పల్లిపాళయం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ లోపు కార్తికేయన్ (సెంట్రింగ్ కార్మికుడు) పల్లిపాళయం వీఏఓ గోవిందరాజ్ వద్ద ఆనందన్‌ను హత్య చేశానని లొంగిపోయాడు. దీంతో గోవింద్రాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కార్తికేయన్‌ను అరెస్టు చేశారు. పోలీసు విచారణలో కార్తికేయన్‌కు ఆనందన్ భార్య జయలక్ష్మికి వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలిసి ఆనందన్ భార్యను మందలించాడు. ఈ క్రమంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ఆనందన్‌ను హత్య చేయడానికి జయలక్ష్మి కార్తికేయన్ పథకం వేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒంటరిగా నిద్రపోతున్న ఆనందన్ తలపై బండరాయి వేసి హత్య చేసినట్టు తెలిసింది. -
న్యాయం కోరుతూ కలెక్టరేట్ వద్ద మహిళ ధర్నా
ఏలూరు (వన్‌టౌన్) : కుటుంబ తగాదాల నేపథ్యంలో తన భర్తను చంపిన నిందితులను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలి పెట్టారని, తగిన న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ఒక మహిళ తన నాలుగేళ్ల బిడ్డతో కలిసి ధర్నా చేసింది. బాధితురాలికి మద్దతుగా దళిత, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నాయి. ఏలూరు మండలం వెంకటాపురంలో ఇందిరా కాలనీకి చెందిన తాడిశెట్టి వీరవెంకట సత్యనారాయణ గతేడాది ఆగస్ట్ 28న అనుమానాస్పదంగా మృతి చెందాడు. తన భర్త మృతికి తాడిశెట్టి కాటంరాజు, తాడిశెట్టి నాగేంద్రమ్మ, దుర్గారావు, ధనలక్ష్మి తదితరులు కారణమని నాడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు భార్య నందిని పేర్కొంది.. అయితే ఇంత వరకు ఆ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పడం లేదని ఆమె వాపోయింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదనిఆమె పేర్కొంది. తాను పుట్టిల్లు లింగపాలెం మండలం ఆసన్నగూడెంలో ఉండగా ఆయన చనిపోవడానికి ముందు గతేడాది ఆగస్ట్ 27న తనకు ఫోన్ చేసి అమ్మా నాన్నలు, అన్నా వదినలు తనపై దౌర్జన్యం చేస్తున్నారని వెంటనే ఇంటికి రావాలని చెప్పారని ఆమె రోదించింది. ఇంటికి వచ్చేసరికి తన భర్త చనిపోయి ఉన్నాడని, అనంతరం హడావుడిగా మృతదేహాన్ని పూడ్చిపెట్టేశారని ఆమె ఆరోపించింది. దీంతో అనుమానం వచ్చి ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. పోలీసులు పూడ్చిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారని తెలిపింది. అయితే ఏడు నెలలు గడుస్తున్నా దీనిపై ఎలాంటి సమాచారం చెప్పడం లేదని, నిందితులను అరెస్ట్ చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తన భర్త కేసును హత్య కేసుగా నమోదు చేసి పోస్టుమార్టం రిపోర్టులు ఇవ్వాలని అనేకమార్లు పోలీసులకు మొర పెట్టుకున్నా వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని నందిని వాపోయింది. నిందితులతో రూరల్ పోలీసులు కుమ్మక్కై కేసును నీరు గార్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేసింది. బాధితురాలు నందినికి మద్దతుగా దళిత, బీసీ సంఘాలు బాసటగా నిలిచాయి. సమాచారం తెలుసుకున్న ఏలూరు రూరల్ సీఐ వెంకటేశ్వరరావు కలెక్టరేట్‌కు చేరుకుని ఆమెతో మాట్లాడారు. సత్వరమే న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.దీంతో బాధితురాలు ధర్నాను విరమించారు. తనకు న్యాయం జరగకపోతే మే 16 నుంచి కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆమె హెచ్చరించింది. అనంతరం ప్రజా సంఘాల నాయకులతో కలిసి జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో జిల్లా బహుజన సంఘం అధ్యక్షురాలు ఘంటశాల వెంకటలక్ష్మి, దళిత నేతలు నేతల రమేష్, మేతల అజయ్‌బాబు, ఏపీ మహిళా సమైఖ్య అధ్యక్షురాలు శారద, బహుజన సమైఖ్య సంఘం అధ్యక్షురాలు బలే నాగలక్ష్మి, జిల్లా మత్య్సకారుల సంఘం నాయకులు జి.సుజాత, ఆల్ ఇండియా దళిత రైట్స్ ప్రొటెక్షన్ నాయకులు బి.సుదర్శన, చింతలపూడి మండలం యర్రగుంటపల్లి సర్పంచ్ సదరబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కోరిక చంపుకోనందుకు.. భర్తపై కాల్పులు!
పెషావర్: ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన ఓ సీనియర్ సిటిజన్ హత్య కేసులో ఆసక్తికర నిజాలు వెలుగుచూశాయి. తొలుత ఏదో వివాదంలో భర్తను భార్య హత్య చేసి ఉండొచ్చునని పోలీసులు భావించారు. అయితే కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని భర్తను హత్య చేశానని మహిళ ఒప్పుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాకిస్తాన్ కైబర్ కనుమలలోని షాంగ్లా గుల్బర్ ఖాన్ తన భార్య బేగమ్ బిబితో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి కుమారుడు పాక్ ఆర్మీ ఓ విభాగంలో సైనికుడిగా సేవలు అందిస్తున్నాడు. అతడి భార్య అత్తమామల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో మామ ఖాన్ కోడలిపై కన్నేశాడు. మొదట్లో తన భార్య, కొడుకు లేని సమయాల్లో ఆమెను లైంగికంగా వేధించేవాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని హింసించేవాడు. గత మూడు నెలలుగా మామ వేధింపులు తీవ్రం కావడంతో భర్తకు తన బాధను చెప్పుకుంది. తండ్రిని ఏం చేయమంటావో చెప్పమని తల్లి బేగమ్ ను కుమారుడు అడిగాడు. కోడలితో అసభ్యంగా ప్రవర్తించవద్దని పలుమార్లు భర్త ఖాన్ ను భార్య బేగమ్ హెచ్చరించింది. ఈ క్రమంలో కుమారుడు దఆర్మీ క్యాంపు ట్రైనింగ్ నిమిత్తం వెళ్లాడు. కోడలిపై తన భర్త కోరికలు చంపుకునేందుకు సిద్ధంగా లేడని బేగమ్ బిబి ఆగ్రహించింది. దీంతో నిద్రపోతున్న సమయంలో కోడలితో కలిసి తుపాకీతో భర్తపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అతడిని హత్య చేసినట్లు పోలీసులకు బేగమ్ వివరించింది. బేగమ్ తో పాటు ఆమె కోడలిపై కేసు నమోదు చేసిన పోలీసులు వీరిని శనివారం కోర్టులో ప్రవేశపెట్టగా వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. -
ప్రియుడితో భర్తను చంపించి.. చావుకేక ఫోన్లో వింది!
ఏడాది క్రితమే ఆమెకు పెళ్లయింది. కానీ అంతకంటే చాలా ముందు నుంచే ఒక ప్రియుడున్నాడు. తన కంటే ఆరేళ్లు పెద్దవాడైన భర్తకు బదులు రెండేళ్లు చిన్నవాడైన ప్రియుడితో కలిసి ఉండటమే ఆమెకు నచ్చింది. అందుకే అతడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. సమయానికి తాను ఇంట్లో ఉండే అవకాశం లేకపోవడంతో.. భర్త చావుకేకలను ఫోన్లో విని సంతోషించింది. మనువా మజుందార్ (28) అనే ఆ మహిళ పశ్చిమబెంగాల్లోని బరసాత్ మునిసిపాలిటీలో క్యాజువల్ వర్కర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త అనుపమ్ సిన్హా (34) ఒక ట్రావెల్ ఏజెన్సీలో మేనేజర్. కానీ, అజిత్ రాయ్ (26) ఆమెకు కాలేజి రోజుల నుంచి తెలుసు. అతడితో కలిసి ఉండాలని నిర్ణయించుకుని, భర్త హత్యకు పక్కాగా ప్లాన్ చేసింది. అనుపమ్ ఉండే ఫ్లాట్‌లోకి ముందుగానే మనువా ఇచ్చిన తాళాలతో చేరుకున్న అజిత్.. అతడు లోపలకు రాగానే ఒక ఇనుప రాడ్‌తో తలమీద కొట్టాడు. ఆ తర్వాత అదే రాడ్‌ను అతడి గొంతులోకి పోనిచ్చి, మనువాకు ఫోన్ చేశాడు. చావు భయంతో అతడు పెడుతున్న కేకలను విన్న మనువా.. మిగిలిన పని కూడా కానించేయమని ప్రియుడికి చెప్పింది. దాంతో అతడు మెదడులో నరాలను కత్తితో కోసి మరీ దారుణాతి దారుణంగా అనుపమ్ సిన్హాను హతమార్చాడు. అనుపమ్ మరణించాక, అపార్టుమెంటు అంతటినీ అజిత్ శుభ్రం చేశాడు. తర్వాతిరోజు గంగానదిలో స్నానం చేసి, రక్తంతో తడిసిన తన దుస్తులను, అనుపమ్ సెల్‌ఫోన్‌ను నదిలోకి విసిరేశాడు. తాము ఇలాంటి హత్యలు చాలా చూశాం గానీ, ఇది మాత్రం తమకు పెద్ద షాకని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన రెండు వారాల తర్వాత ప్రేయసీ ప్రియులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కావాలంటే ఆమె విడాకులు తీసుకుని తన ప్రియుడిని పెళ్లి చేసుకుని ఉండచ్చు గానీ, భర్తను అంత క్రూరంగా చంపించడం ఎందుకని పొరుగున ఉండే రాత్రి రాయ్ అనే మహిళ ప్రశ్నించారు. తన భార్య ప్రేమ విషయం అనుపమ్‌కు తెలిసిందని, ఆమెను తాను పెళ్లి చేసుకుని ఉండాల్సింది కాదంటూ తరచు వాపోయేవాడని అనుపమ్ సహోద్యోగి అభిషేక్ చటర్జీ అన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా మనువా మాత్రం చాలా కూల్‌గా ఉండటం అందరినీ షాక్‌కు గురిచేసింది. -
ప్రియుడితో కలిసి.. భర్త గొంతు నులిమేసింది!
బెంగుళూరు: అనైతిక వ్యవహారానికి స్వస్తి పలకాలని చెప్పిన భర్తను, భార్య తన ప్రియుడితో కలిసి అంతమొందించింది. ఈఘటన జేసీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. జేసీ.నగరలో మాన్సింగ్, చంద్రబాయి దంపతులు నివాసముంటున్నారు. చంద్రబాయి, అశోక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. అనుమానం వచ్చిన మాన్సింగ్ తన భార్యను మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయితే భర్తను అడ్డు తొలగించుకునేందుకు చంద్రబాయి తన ప్రియుడు అశోక్‌తో కలిసి పథకం వేసింది. ఈ మేరకు ఈ నెల 4 అర్ధరాత్రి మాన్సింగ్ను ఇద్దరూ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి శ్మాశానానికి తీసుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి పరిశీలించగా ఈ ఉదంతం వెలుగు చూసింది. అక్కడే ఉన్న చంద్రబాయి, అశోక్‌ను అరెస్ట్ చేశారు. మాన్సింగ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. మాన్ సింగ్ ది హత్యేనని వైద్యులు తేల్చడంతో పాటు తమ విచారణలో చంద్రబాయి, అశోక్ తాము నేరం చేసినట్లు అంగీకరించారని పోలీసులు శనివారం వెల్లడించారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపి.. చెట్టుకు వేలాడదీసింది!
తన వివాహేతర సంబంధానికి భర్త అభ్యంతరం చెప్పాడని.. ప్రియుడితో కలిసి అతడిని చంపేసిన మహిళ, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ శవాన్ని చెట్టుకు వేలాడదీసింది. ఈ ఘటన పంజాబ్‌లోని లూధియానాకు 50 కిలోమీటర్ల దూరంలోని భైని డరేరా గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు జగ్పాల్ సింగ్ వ్యవసాయం, మద్యం వ్యాపారం చేస్తుంటాడు. అతడి భార్య హర్జీత్ కౌర్ రాజ్‌కోట్‌లోని మద్యం వ్యాపారి దేవీందర్ సింగ్ బిందాతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. దీనికి జగ్పాల్ అభ్యంతరం తెలిపాడు. దాంతో అతడిని దేవీందర్, అతడి స్నేహితులు సుర్జీత్ సింగ్, మరో ఇద్దరితో కలిసి హతమార్చింది. జగపాల్, హర్జీత్ కౌర్‌లకు పెళ్లయ్యి 14 ఏళ్లు గడిచింది. వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు. దేవీందర్ వీళ్ల జీవితంలోకి ప్రవేశించేవరకు అంతా బాగానే ఉండేది. నాలుగు నెలల క్రితం వ్యాపారం పేరుతో దేవీందర్ వీళ్ల ఇంటికి రావడం మొదలుపెట్టి, క్రమంగా అతడి భార్య మీద కన్నేశాడు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కొన్నాళ్లకు జగ్పాల్కు తెలిసింది. దీనిపై భార్యాభర్తలు ఇద్దరి మధ్య తరచు గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రితం రాత్రి పూట దేవీందర్ మరో ముగ్గురితో కలిసి జగ్పాల్ ఇంటికి వచ్చాడు. పిల్లలిద్దరూ పక్క గదిలో పడుకుని ఉన్నారు. హర్జీత్ కౌర్, దేవీందర్ సింగ్ కలిసి జగ్పాల్ పీక పిసికి చంపేశారు. తర్వాత ఇంటి దగ్గర్లో ఉన్న చెట్టుకు ఆ మృతదేహాన్ని వేలాడదీసి, అది ఆత్మహత్య అనుకునేలా చేశారు. తన అన్న శవం చెట్టుకు వేలాడుతుండటం చూసిన జగ్పాల్ సోదరుడు గుర్ప్రీత్ సింగ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా మొత్తం విషయం బయటపడింది. హర్జీత్ కౌర్, దేవీందర్ ఇద్దరి మీద హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...
– ప్రియుడితో కలిసి భర్త హత్య – గొర్రెల కాపరి హత్య కేసును ఛేదించిన పోలీసులు – ఎడుగురు నిందితుల అరెస్ట్ గుర్రంకొండ:గత నెల 18వ తేదీన గుర్రంకొండ మండలం దౌలత్‌ఖాన్ పల్లె సమీపంలోని యల్లంపల్లి అటవీ ప్రాంతంలో గొర్రెల కాపరి భాస్కర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు గుర్తించారు. ఈ మేరకు ఏడుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. వాల్మీకిపురం సీఐ శ్రీధర్‌నాయుడు కథనం మేరకు... దౌలత్‌ఖాన్‌పల్లెకు చెందిన బీదం భాస్కర్(38), రెడ్డెవ్ము(26) దంపతులు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రావూనికి చెందిన పి.రమేశ్‌బాబు(35) రెడ్డెవ్ముతో వివాహేతర సంబందం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ భార్య రెడ్డెవ్మును మందలించాడు. తవు సంబంధానికి భర్త అడ్డు తొలగించుకోవాలని రెడ్డెమ్మ ప్రియుడు రమేశ్‌బాబుతో కలిసి హత్యకు పథకం పన్నింది. ఈ క్రమంలో కురబలకోట వుండలం తుంగానిపల్లెకు చెందిన గణేష్‌బాబు(25), వుదనపల్లె పట్టణం ఎగువ కురవవంక ఇందిరవ్ముకాలనీకి చెందిన సునీల్‌కువూర్(22), సుండుపల్లె నరేష్‌బాబు(25), వుదనపల్లె వుండలం కోళ్లబైలు పంచాయతీ మామిడిగుంపులపల్లెకు చెందిన టి.నాగరాజు(35), గుర్రంకొండ పంచాయతీ దౌలత్‌ఖాన్‌పల్లెకు చెందిన ఎస్.కమాల్‌బాషా(32)ను కలిసి రూ.1.5 లక్షలకు భాస్కర్‌ను హత్య చేసేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ముందుగా రూ.15 వేలు అడ్వాన్స్ చెల్లించారు. పథకం ప్రకారం గత నెల 18వ తేదీన భాస్కర్ మండలంలోని యల్లంపల్లి అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుకొంటుండుగా ఐదుగురు వెనుకవైపు నుంచి రాయితో బలంగా కొట్టారు. అనంతరం టవల్‌తో గొంతుకు ఉరి వేసి చంపేశారు. మెుదట్లో అనువూనాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు వుృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. రిపోర్టులో హత్య అని తేలడంతో భార్య రెడ్డెవ్ము, ప్రియుడు రమేశ్‌ను విచారించగా అసలు నిజాలు వెలుగుచూశాయి. ఈ మేరకు రమేశ్‌బాబు, రెడ్డెవ్ము, గణేష్, సునీల్, నరేష్, నాగరాజు, కవూల్‌బాషాను ఆదివారం అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను సోమవారం వాల్మీకిపురం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయనపేర్కొన్నారు. -
భార్యను రోకలిబండతో కొట్టిచంపిన భర్త
-
పాక్ లో మళ్లీ పరువుహత్యల కలకలం!
లాహోర్: గర్భిణిని ఆమె తల్లి పరువు హత్య చేసి వారం రోజులు గడవకముందే మరో ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకుని కుటుంబం పరువు తీసిందని ఆవేశానికి లోనైన ఓ వ్యక్తి.. గర్భంతో ఉన్న సోదరితో పాటు ఆమె భర్తను దారుణంగా కాల్చి హత్యచేశాడు. గతేడాది పరువు హత్యల నెపంతో పాక్ లో 1,100 మంది మహిళలు తమ తల్లిదండ్రులు, సోదరులు, బంధువుల చేతిలో హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ముహమ్మద్ షకీల్(30), అక్సా(26)ను నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరి పెళ్లికి అక్సా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అప్పటినుంచి వీరి కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరు పాక్ లోని పంజాబ్ లోని థిక్రివాలాలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అక్సా నిండు గర్భిణి. అయితే సౌదీ అరేబియాలో ఉంటున్న అక్సా సోదరుడు వారం రోజుల కిందట ఇంటికి వచ్చాడు. గత నాలుగు రోజుల కిందట అక్సా తల్లి, ఆమె సోదరుడు, సోదరుడి తరఫు బంధువులు ఈ దంపతులను కిడ్నాప్ చేశారు. వారిని చితకబాదడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపి హత్యచేశారు. ఆ తర్వాత తమకేం తెలియదన్నట్లుగా శవాలను గుజ్రా-జంగ్ బ్రాంచ్ కాలువలో పడేసి వెళ్లిపోయారు. గురువారం రాత్రి పోలీసులు శవాలను గుర్తించారు. షకీల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్సా సోదరుడు, తల్లిపై కేసు నమోదు చేశారు. విచారణ జరపగా పుట్టింటివారే నిండు గర్భిణి అయిన అక్సాతో పాటు ఆమె భర్తను కాల్చి చంపినట్లు వెల్లడైంది. ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు. మరో వారం రోజుల్లో అక్సా డెలివరికి ఉందని రిపోర్టుల ద్వారా తెలిసింది. -
తాగిన మత్తులో భర్తను చంపేసింది
హైదరాబాద్: తాగిన మైకంలో భర్తను చంపేసిందో భార్య. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతలబస్తీలో జరిగింది. వివరాలివీ.. నల్లగొండ జిల్లా గౌరారం గ్రామానికి చెందిన వెంకటేష్, సుగుణ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి చింతలబస్తీలోని ఉంటున్నారు. కూలి పనులు చేసుకునే వెంకటేష్‌కు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో కుటుంబభారం సుగుణపై పడింది. ఈ క్రమంలో వారిమధ్య తరచూ తగాదాలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి దంపతులు మద్యం తాగి ఆ మత్తులో వాదులాడుకున్నారు. కోపంతో రెచ్చిపోయిన సుగుణ రాడ్‌తో భర్త తలపై బాదింది. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం ఉదయం వరకు ఈ విషయం బయటకు రాలేదు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. -
భార్య గొంతు నులిమి చంపిన భర్త
-
భర్తను చంపిన భార్య అరెస్ట్
తణుకు : పెళ్లయిన నాటినుంచీ వేధింపులు.. అనుమానంతో సాధిం పులు.. వెరసి ఆ దంపతుల మధ్య నిత్యం ఘర్షణలు. ఈ పరిస్థితులు భర్త చంపే స్థాయికి తీసుకెళ్లాయి. తణుకు పట్టణంలో ఈనెల 4న అర్ధరాత్రి జరిగిన ఇప్పిలి రమేష్ (31) హత్య కేసులో నిందితురాలిలా ఉన్న అతడి భార్య వెంకటలక్ష్మిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ఆర్.అంకబాబు వెల్లడించారు. స్థానిక పాతూరు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని చాకలి వీధిలో నివాసం ఉంటున్న ఇప్పిలి రమేష్, వెంకటల క్ష్మిలకు పన్నెండేళ్ల క్రితం వివాహ మైంది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన నాటినుంచి రమేష్ తనను అనుమానిస్తూ వేధింపులకు గురి చేసేవాడని, రోజూ తాగి వచ్చి గొడవ పడేవాడని నిందితురాలు వెంకటలక్ష్మి వాంగ్మూలం ఇచ్చిందని సీఐ తెలిపారు. ఈనెల 4 అర్ధరాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ఆవేశం తట్టుకోలేని రమేష్ తాను చనిపోతానంటూ నైలాన్ తాడు తీసుకుని బెదిరించాడని చెప్పారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న వెంకటలక్ష్మి ‘నువ్వు చనిపోయేదేంటి. నేనే చంపేస్తా’నంటూ తాడు లాగి మెడకు ఉరి బిగుసుకునేలా చేసిందన్నారు. అనంతరం రమేష్ మృతదేహాన్ని గుమ్మం బయటకు ఈడ్చుకొచ్చి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు వెంకటలక్ష్మి నమ్మించే ప్రయత్నం చేసిందన్నారు. వెంకటలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా, తన భర్తను తానే చంపినట్టు ఆమె అంగీకరించిందని తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు పంపినట్టు చెప్పారు. -
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..
జీవితాంతం తోడూనీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళికట్టించుకుంది.. పద్నాలుగేళ్లు అతడితో జీవితాన్ని పంచుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.. వివాహేతర బంధం మోజులో పడి చివరకు కట్టుకున్న భర్త ఊపిరినే తీసేసింది.. ఆ ఇల్లాలు. ఈ దారుణ ఘటన బీబీనగర్ మండల కేం ద్రంలో ఆదివారం వెలుగుచూసింది. పోలీ సులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -బీబీనగర్ బీబీనగర్ మండలం పడమటిసోమారం గ్రామానికి చెందిన మెడబోయిన ప్రభాకర్‌కు(32) మండల కేంద్రానికి చెందిన గుండెగళ్ల సత్తయ్య కూతురు రేణుకతో 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం ప్రభాకర్ తన కుటుంబంతో పదేళ్ల క్రితం బీబీనగర్‌కు వలసవచ్చాడు. రైల్వేస్టేషన్ సమీపంలో తన అత్తమామ ఇంటి పక్కనే అద్దె ఇంట్లో నివాసాముంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ప్రభాకర్ భార్య రేణుక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని నచ్చజెప్పాడు. మారకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. దీంతో రేణుక తన కార్యకలాపాలకు అడ్డొస్తున్న భర్తనే ఎలాగైనా కడతేర్చాలని నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ప్రభాకర్ నిద్రిస్తున్న సమయంలో రేణుక గొంతు నులిపి చంపివేసింది. ఈ విషయం ఆదివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. కాగా రేణుక ఒక్కతే ప్రభాకర్‌ను హతమార్చిందా లేక వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలసి ఈఘాతుకానికి ఒడిగట్టిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ ప్రణీత్‌కుమార్ తెలిపారు. రేణుక పథకం ప్రకారం ప్రభాకర్‌ను హతమార్చిందని మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ హత్య విషయం తెలుసుకున్న సీఐ తిరుపతిరెడ్డి,ఎస్ఐ ప్రణీత్‌కుమార్, దేవేందర్‌రెడ్డి ఆదివారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం రేణుకను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెలుగులోకి వచ్చాయి. తానే ప్రభాకర్‌ను నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిపి హత్య చేసినట్టు రేణుక విచారణలో ఒప్పుకున్నట్టు ఎస్ఐ ప్రణీత్‌కుమార్ తెలిపారు. -
భర్తను హత్య చేసిన భార్య
కె.గంగవరం; మద్యం సేవించి అరాచకం చేస్తున్న భర్త వేధింపులను తట్టుకోలేక భార్య కిరాతకంగా చంపిన సంఘటన సంచలనం రేకెత్తించింది. మద్యం తాగి వేధింపులకు గురిచేస్తున్న భర్తను గెడ్డపారతో తలపై గట్టిగా కొట్టడంతో మృతి చెందిన సంఘటన కె. గంగవరంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం, వైఎస్సార్ కాలనీకి చెందిన అనుసూరి శ్రీను(35)కి అదే గ్రామానికి చెందిన దుర్గతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 ఏళ్ల లలితాదేవి, 8 ఏళ్ల కల్యాణి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ వ్యవసాయ కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మొదట్లో కాపురం సజావుగా సాగినా భర్త శ్రీను మద్యం, పేకాటకు బానిసగా మారి దుర్గను తరచూ వేధించేవాడు. రెండేళ్ల క్రితం భర్తపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు శ్రీనుపై కేసు కూడా నమోదు చేశారు. ఇరు కుటుంబాల పెద్దలు సజావుగా కాపురం చేసుకోవాలని హితవు చెప్పడంతో దుర్గ తిరిగి భర్తతో కలసి కాపురం చేసుకుంటోంది. ఇటీవల భర్త శ్రీను తరచూ మద్యం సేవించి కొట్టేవాడు. శుక్రవారం ఉదయం మద్యం సేవించి దుర్గను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. భర్త చేష్టలకు విసిగిపోయిన భార్య గడ్డపారతో భర్త ముఖంపై పలుసార్లు మోదింది. గమనించిన స్థానికులు ఆమె చేతిలో గడ్డపారను లాక్కున్నారు. సహనం కోల్పోయిన దుర్గ ఇంట్లో ఉన్న మరో గడ్డపారతో భర్త శ్రీను తల వెనుక బలంగా కొట్టింది. తీవ్ర గాయాలైన శ్రీనును స్థానికులు ఆటోలో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీను పరిస్థితి విషమించటంతో ఏరియా ఆసుపత్రి అంబులెన్స్‌లో కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శ్రీనివాస్ తల్లి భద్రం ఫిర్యాదు మేరకు రామచంద్రపుం సీఐ కాశీవిశ్వనాధ్, ఎస్సై వి.పెద్దిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రపురం డీఎస్పీ రవీంద్రనాధ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. -
భార్యను నరికి చంపిన భర్త
-
భార్యను నరికి చంపిన భర్త
విజయనగరం జిల్లా వేపాడలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త గత అర్థరాత్రి గొడ్డలితో నరికి చంపేశాడు. అనంతరం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం గ్రామస్థులు ఆ విషయాన్ని గమనించిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహలను విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.