ప్రియుడితో కలిసి భర్తను చంపి.. చెట్టుకు వేలాడదీసింది! | woman kills husband with paramour, hangs body to tree | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్తను చంపి.. చెట్టుకు వేలాడదీసింది!

Published Sat, Apr 1 2017 2:13 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

ప్రియుడితో కలిసి భర్తను చంపి.. చెట్టుకు వేలాడదీసింది!

ప్రియుడితో కలిసి భర్తను చంపి.. చెట్టుకు వేలాడదీసింది!

తన వివాహేతర సంబంధానికి భర్త అభ్యంతరం చెప్పాడని.. ప్రియుడితో కలిసి అతడిని చంపేసిన మహిళ, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ శవాన్ని చెట్టుకు వేలాడదీసింది. ఈ ఘటన పంజాబ్‌లోని లూధియానాకు 50 కిలోమీటర్ల దూరంలోని భైని డరేరా గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు జగ్‌పాల్ సింగ్ వ్యవసాయం, మద్యం వ్యాపారం చేస్తుంటాడు. అతడి భార్య హర్జీత్ కౌర్ రాజ్‌కోట్‌లోని మద్యం వ్యాపారి దేవీందర్ సింగ్ బిందాతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. దీనికి జగ్‌పాల్ అభ్యంతరం తెలిపాడు. దాంతో అతడిని దేవీందర్, అతడి స్నేహితులు సుర్జీత్ సింగ్, మరో ఇద్దరితో కలిసి హతమార్చింది.

జగపాల్, హర్జీత్‌ కౌర్‌లకు పెళ్లయ్యి 14 ఏళ్లు గడిచింది. వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు. దేవీందర్ వీళ్ల జీవితంలోకి ప్రవేశించేవరకు అంతా బాగానే ఉండేది. నాలుగు నెలల క్రితం వ్యాపారం పేరుతో దేవీందర్ వీళ్ల ఇంటికి రావడం మొదలుపెట్టి, క్రమంగా అతడి భార్య మీద కన్నేశాడు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కొన్నాళ్లకు జగ్‌పాల్‌కు తెలిసింది. దీనిపై భార్యాభర్తలు ఇద్దరి మధ్య తరచు గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రితం రాత్రి పూట దేవీందర్ మరో ముగ్గురితో కలిసి జగ్‌పాల్ ఇంటికి వచ్చాడు. పిల్లలిద్దరూ పక్క గదిలో పడుకుని ఉన్నారు. హర్జీత్ కౌర్, దేవీందర్ సింగ్ కలిసి జగ్‌పాల్‌ పీక పిసికి చంపేశారు. తర్వాత ఇంటి దగ్గర్లో ఉన్న చెట్టుకు ఆ మృతదేహాన్ని వేలాడదీసి, అది ఆత్మహత్య అనుకునేలా చేశారు. తన అన్న శవం చెట్టుకు వేలాడుతుండటం చూసిన జగ్‌పాల్ సోదరుడు గుర్‌ప్రీత్ సింగ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా మొత్తం విషయం బయటపడింది. హర్జీత్ కౌర్, దేవీందర్ ఇద్దరి మీద హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement