woman kills
-
ఐదేళ్ల చిన్నారి హత్య.. తల్లి మీద పగతో పొరుగింటి మహిళ ఘాతుకం
ముజఫర్‌నగర్: పొరుగింటి మహిళపై పగతో ఆమె ఐదేళ్ల కొడుకుని హతమార్చిన మహిళను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాల్లోకి వెళ్తే... ముజఫర్‌నగర్ జిల్లాలో తేవ్రా గ్రామానికి చెందిన ఆసిఫా అనే మహిళ.. పొరిగింట్లో ఉంటున్న దినిస్టా బేగంపై పగతో ఆమె ఐదేళ్ల కుడుకు అర్సలాన్‌ని కిడ్నాప్ చేసి హత్య చేసింది. నవంబర్ 11న బాలుడు అదృశ్యం కాగా మూడు రోజుల తరువాత కక్రౌలీ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామ శివార్లలో అడవిలో గోనె సంచిలో అర్సలాన్ మృతదేహం లభ్యమైంది. అర్సలాన్ను హత్య చేసినట్లు విచారణలో అసిఫా అంగీకరించిందని కేసు దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బయట ఆడుకుంటున్న అర్సలాన్ను ఆసిఫా కిడ్నాప్ చేసి తన ఇంట్లో బంధించింది. గ్రామమంతా వెతికిన బాలుడి తండ్రి షాజాద్ ఖాన్ ఆచూకీ దొరక్కపోవడంతో కక్రౌలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు గ్రామశివార్లలో బాలుడి మృతదేహాన్ని గుర్తించి గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లుగా కేసు నమోదు చేశారు. తర్వాత ఆసిఫా ఇంట్లో బాలుడి టోపీ, చెప్పులు, గొంతుకు బిగించేందుకు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాను తమదైన శైలిలో పోలీసులు విచారించగా బాలుడిని చంపింది తానే అని ఒప్పుకుంది. అర్సలాన్ తల్లి దనిస్టా బేగం తనను అగౌరవంగా చూసేదని, తరచూ అవమానించేదని, అందుకు ఆమె కొడుకుని హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది. -
‘వెంటపడి వేధించిండు.. అందుకే చంపేసిన’
సాక్షి, ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం పరిధిలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. తనను వేధిస్తున్న దగ్గరి బంధువును.. కత్తితో పొడిచి చంపింది ఓ యువతి. హత్య అనంతరం సరాసరి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తాను ఎందుకు చంపింది వివరించి మరీ పోలీసులకు లొంగిపోయిందామె. ఏర్రలవాడలో నివసించే రామటెంకి శ్రీనివాస్ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న జాడి సంగీతను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. వీళ్లిద్దరూ దగ్గరి బంధువులు. ఇరు కుటుంబాలు కూలీ పనితో జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే.. సంగీతపై శీను వేధింపులు శ్రుతి మించిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో విసిగిపోయిన ఆమె.. శీనుపై కేసు పెట్టింది. దీంతో శీనును అరెస్ట్ చేశారు పోలీసులు. జైలుకు వెళ్లొచ్చాక కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. వెంటపడి పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం పెంచాడు. ఈసారి మద్యం మత్తులో వేధించడం మొదలుపెట్టాడు. భరించలేకపోయిన సంగీత.. శీనును చేతులు కట్టేసి మరీ కత్తితో పొడిచి చంపేసింది. ఆపై నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. -
వివాహేతర సంబంధం.... ప్రియుడితో కలిసి సొంత మామను..
సాక్షి, శాలిగౌరారం(నల్లగొండ): వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలిచాడని ప్రియుడితో కలిసి సొంత మామను కడతేర్చింది ఓ కోడలు. అందుకు సంబంధించిన ఆదివారం బాధిత కుటుంబ బంధువులతోపాటూ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన శ్యామల ముత్తయ్య(60)కు భార్య, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముత్తయ్య వృత్తిరీత్యా బాతుల పెంపకం నిర్వహిస్తుంటాడు. అందులో భాగంగా బాతులను మేపేందుకని శాలిగౌరారం మండలంలోని మాధారంకలాన్ గ్రామానికి వారం కిందట కుమారుడు నర్సింహ, కోడలు శైలజతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో మాధారంకలాన్ గ్రామ సమీపంలోని చెరువుకట్ట కిందిభాగంలో తాత్కాలిక గుడిసె వేసుకున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ పట్టణంలో నివాసం ఉంటున్న ముత్తయ్య పెద్దకుమార్తె ఇంటివద్ద ఆదివారం మనుమరాలుకు నూతన పట్టువస్త్రాలంకరణ ఉండడంతో ముత్త య్య కొడుకు నర్సింహ శనివారం కరీంనగర్ వెళ్లిపోయాడు. వేరొకరితో సఖ్యతగా ఉంటూ.. కోడలు శైలజ తన అన్నకు వరుసకు బావమరిది అయిన నేరేడుచర్లకు చెందిన బాతుల పెంపకందారుడైన మహేశ్‌తో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోంది. ప్రస్తుతం కేతేపల్లి మండలం కాసనగోడులో బాతులను మేపుతున్న మహేశ్ శైలజ భర్త కరీంనగర్‌కు వెళ్లిన విషయం తెలుసుకొని శనివారం రాత్రి మాధారంకలాన్‌లోని శైలజ ఉంటున్న గుడిసె వద్దకు వచ్చాడు. అదేసమయంలో బీడీల కోసమని మాధారంకలాన్‌కు వెళ్లి వచ్చేసరికి శైలజ, మహేశ్‌లు ఒంటరిగా గుడిసెలో ఉన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన ముత్తయ్య కోడలు శైలజ, ఆమె ప్రియుడు మహేశ్‌లను తిడుతూ ఈ విషయాన్ని ఆదివారం ఉదయం ప్రజలకు చెబుతానని హెచ్చరించాడు. తలదిండు పెట్టి ఊపిరాడకుండా చేసి.. దీంతో విషయం ఎలాగైనా బయటపడుతుందని గమనించిన కోడలు శైలజ, ప్రియుడు మహేశ్‌తో కలిసి ముత్తయ్యపై దాడికి దిగారు. ఈ క్రమంలో కిందపడిపోయిన ముత్తయ్య ముఖంపై తలదిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ముత్తయ్య మృతిచెందాడని నిర్ధారించుకున్న తర్వాతా అక్కడి నుంచి మహేశ్ పరారీ అయ్యాడు. కోడలు శైలజ తన పిల్లలతో కలిసి మామ మృతదేహాన్ని గుడిసెలోనే ఉంచి నిద్రించింది. ఆదివారం తెల్లవారుఝామున కరీంనగర్లో ఉన్న తన భర్త నర్సింహకు ఫోన్‌చేసి మామ ముత్తయ్య గుండెపోటుతో మృతిచెందాడని తెలిపింది. దీంతో ఆదివారం సాయంత్రానికి మాధారంకలాన్‌కు చేరుకున్న నర్సింహ తండ్రి శరీరం, ముఖంపై ఉన్న గాయాలతో భార్యపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా.. హత్యకు పాల్పడిన కోడలు శైలజ పోలీసుల అదుపులో ఉంది. పరారీలో ఉన్న మహేశ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: Missing Cases: ఒంటరిగా అదృశ్యం.. జంటగా ప్రత్యక్షం -
ప్రియుడితో కలిసి భర్తను చంపి.. చెట్టుకు వేలాడదీసింది!
తన వివాహేతర సంబంధానికి భర్త అభ్యంతరం చెప్పాడని.. ప్రియుడితో కలిసి అతడిని చంపేసిన మహిళ, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ శవాన్ని చెట్టుకు వేలాడదీసింది. ఈ ఘటన పంజాబ్‌లోని లూధియానాకు 50 కిలోమీటర్ల దూరంలోని భైని డరేరా గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు జగ్పాల్ సింగ్ వ్యవసాయం, మద్యం వ్యాపారం చేస్తుంటాడు. అతడి భార్య హర్జీత్ కౌర్ రాజ్‌కోట్‌లోని మద్యం వ్యాపారి దేవీందర్ సింగ్ బిందాతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. దీనికి జగ్పాల్ అభ్యంతరం తెలిపాడు. దాంతో అతడిని దేవీందర్, అతడి స్నేహితులు సుర్జీత్ సింగ్, మరో ఇద్దరితో కలిసి హతమార్చింది. జగపాల్, హర్జీత్ కౌర్‌లకు పెళ్లయ్యి 14 ఏళ్లు గడిచింది. వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు. దేవీందర్ వీళ్ల జీవితంలోకి ప్రవేశించేవరకు అంతా బాగానే ఉండేది. నాలుగు నెలల క్రితం వ్యాపారం పేరుతో దేవీందర్ వీళ్ల ఇంటికి రావడం మొదలుపెట్టి, క్రమంగా అతడి భార్య మీద కన్నేశాడు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కొన్నాళ్లకు జగ్పాల్కు తెలిసింది. దీనిపై భార్యాభర్తలు ఇద్దరి మధ్య తరచు గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రితం రాత్రి పూట దేవీందర్ మరో ముగ్గురితో కలిసి జగ్పాల్ ఇంటికి వచ్చాడు. పిల్లలిద్దరూ పక్క గదిలో పడుకుని ఉన్నారు. హర్జీత్ కౌర్, దేవీందర్ సింగ్ కలిసి జగ్పాల్ పీక పిసికి చంపేశారు. తర్వాత ఇంటి దగ్గర్లో ఉన్న చెట్టుకు ఆ మృతదేహాన్ని వేలాడదీసి, అది ఆత్మహత్య అనుకునేలా చేశారు. తన అన్న శవం చెట్టుకు వేలాడుతుండటం చూసిన జగ్పాల్ సోదరుడు గుర్ప్రీత్ సింగ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా మొత్తం విషయం బయటపడింది. హర్జీత్ కౌర్, దేవీందర్ ఇద్దరి మీద హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాపాడతానని.. కాటేశారు !
దేవరకద్ర/గద్వాలటౌన్: అనుమానం వారి పాలిట శాపంగా మారింది. మూడుముళ్లు వేసి.. ఏడు అడుగులు నడిచి జీవితాంతం తోడుంటామని బాసలు చేసిన ఇద్దరువ్యక్తులు తమ భార్యలను పాశవికంగా హతమార్చారు. వివాహేతర సంబంధం కలిగిఉందని ఒకరు.. కుటుంబ కలహాలతో మరొకరు అతికిరాతకంగా ప్రాణాలు తీశారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిచన ఈ ఘటనలు బుధవారం దేవరకద్ర, గద్వాల మండలంలో చోటుచేసుకున్నాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు..ధ న్వాడ మండలం పూసల్‌పాడ్‌కు వాసి ఆంజనేయులు పదేళ్లక్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడే రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన గిరిజన యువతి శిరీష(26) పరిచయం కావడంతో ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారికి పూజ, వంశీ ఇద్దరు సంతానం. కొంతకాలంగా బతుకుదెరువు కోసం ఆంజనేయులు భార్యతో కలిసి కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు వెళ్లి అక్కడే ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నాడు. ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆహారభద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం దేవరకద్రలో ఉంటున్న తనతల్లి ఎల్లమ్మ వద్దకు భార్యాపిల్లలతో వచ్చాడు. ఇక్కడే ఉండి కూలీపనులు చేసుకుందామని ఆంజనేయులు చెప్పడంతో భార్య శిరీష సిరిసిల్లలో ఉన్న సామాను తీసుకొచ్చేందుకు వెళ్లింది. పదిరోజులైనా ఆమె రాకపోవడంతో అత్తామామలకు ఫోన్‌చేయడంతో వారు మహబూబ్‌నగర్‌కే వచ్చిందని చెప్పారు. చివరకు మంగళవారం దేవరకద్రకు వచ్చిన శిరీష పిల్లలను తనవెంట పంపించాలని భర్తతో వాదనకు దిగింది. ఆమెకు రాత్రి ఫోన్‌రావడంతో భర్తకు మరింత అనుమానం పెరిగింది. ఇంతలో ఆంజనేయులు గొడ్డలితో శిరీష తలపై బాదడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బుధవారం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆటోలో పూసల్‌పాడ్ గ్రామానికి తరలించేందుకు యత్నించగా స్థానికులు పోలీసులకు సమాచారమందించగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనాథలైన పిల్లలు తల్లి విగతజీవిగా పడిఉండడం తండ్రి, నానమ్మలను పోలీసులు తీసుకెళ్లడంతో చిన్నారులు పూజ, వంశీ అనాథలుగా మారారు. ఏం జరిగిందో తెలియని వయసు కావడంతో దిక్కుతోచనిస్థితిలో ఏడుస్తూ కనిపించారు. స్థానికులు కొందరు దగ్గరకు తీసి లాలించారు. డీఎస్పీ విచారణ సంఘటన స్థలాన్ని గద్వాల డీఎస్పీ బాలకోటి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి భర్త ఆంజనేయులు, అత్త ఎల్లమ్మలను విచారించారు. తనభార్య శిరీష ఎవరితోనో వివాహేతర సంబంధం కలిగిఉండడంతో హత్యచేశానని ఆంజనేయులు నేరం అంగీకరించినట్లు తెలిపారు. గద్వాల సీఐ సురేష్, దేవరకద్ర ఎస్ఐ రాజు సంఘటనస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. గద్వాలలో మరో వివాహిత బలి మరో ఘటనలో భార్యను భర్త హతమార్చాడు. గద్వాల టౌన్ ఎస్సై సైదాబాబు కథ నం.. గద్వాల మండలం చెనుగోనిపల్లిలో ఆం జనేయులు, సత్యమ్మ(35) దం పతులు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజులుగా భా ర్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. పిల్లలు ఇంట్లోనే నిద్రిస్తున్న క్రమం లో బుధవారం తెల్లవారుజామున ఆంజనేయు లు సత్యమ్మ గొంతుకు తాడు బిగించి హత్యచేశా డు. ఇంట్లోనే వేలాడదీసి ఆత్మహత్య చేసుకుం దని నమ్మించేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారికి కూడా చెప్పాడు. సత్యమ్మ మృతిపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తంచేశారు. సత్యమ్మ శరీరంపై గాయాలు, ఉరివేసిన విధానాన్ని బట్టి ఆంజనేయులే హత్య కు పాల్పడ్డాడని భావిస్తున్నారు. హత్యచేసిన ఆంజనేయులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.