కాపాడతానని.. కాటేశారు ! | Woman kills husband with paramou | Sakshi
Sakshi News home page

కాపాడతానని.. కాటేశారు !

Published Thu, Oct 23 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

Woman kills husband with paramou

దేవరకద్ర/గద్వాలటౌన్: అనుమానం వారి పాలిట శాపంగా మారింది. మూడుముళ్లు వేసి.. ఏడు అడుగులు నడిచి జీవితాంతం తోడుంటామని బాసలు చేసిన ఇద్దరువ్యక్తులు తమ భార్యలను పాశవికంగా హతమార్చారు. వివాహేతర సంబంధం కలిగిఉందని ఒకరు.. కుటుంబ కలహాలతో మరొకరు అతికిరాతకంగా ప్రాణాలు తీశారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిచన ఈ ఘటనలు బుధవారం దేవరకద్ర, గద్వాల మండలంలో చోటుచేసుకున్నాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు..ధ న్వాడ మండలం పూసల్‌పాడ్‌కు వాసి ఆంజనేయులు పదేళ్లక్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడే రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన గిరిజన యువతి శిరీష(26) పరిచయం కావడంతో ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.
 
 వారికి పూజ, వంశీ ఇద్దరు సంతానం. కొంతకాలంగా బతుకుదెరువు కోసం ఆంజనేయులు భార్యతో కలిసి కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు వెళ్లి అక్కడే ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నాడు. ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆహారభద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం దేవరకద్రలో ఉంటున్న తనతల్లి ఎల్లమ్మ వద్దకు భార్యాపిల్లలతో వచ్చాడు. ఇక్కడే ఉండి కూలీపనులు చేసుకుందామని ఆంజనేయులు చెప్పడంతో భార్య శిరీష సిరిసిల్లలో ఉన్న సామాను తీసుకొచ్చేందుకు వెళ్లింది. పదిరోజులైనా ఆమె రాకపోవడంతో అత్తామామలకు ఫోన్‌చేయడంతో వారు మహబూబ్‌నగర్‌కే వచ్చిందని చెప్పారు. చివరకు మంగళవారం దేవరకద్రకు వచ్చిన శిరీష పిల్లలను తనవెంట పంపించాలని భర్తతో వాదనకు దిగింది. ఆమెకు రాత్రి ఫోన్‌రావడంతో భర్తకు మరింత అనుమానం పెరిగింది. ఇంతలో ఆంజనేయులు గొడ్డలితో శిరీష తలపై బాదడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బుధవారం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆటోలో పూసల్‌పాడ్ గ్రామానికి తరలించేందుకు యత్నించగా స్థానికులు పోలీసులకు సమాచారమందించగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
 
 అనాథలైన పిల్లలు
 తల్లి విగతజీవిగా పడిఉండడం తండ్రి, నానమ్మలను పోలీసులు తీసుకెళ్లడంతో చిన్నారులు పూజ, వంశీ అనాథలుగా మారారు. ఏం జరిగిందో తెలియని వయసు కావడంతో దిక్కుతోచనిస్థితిలో ఏడుస్తూ కనిపించారు. స్థానికులు కొందరు దగ్గరకు తీసి లాలించారు.
 
 డీఎస్పీ విచారణ
 సంఘటన స్థలాన్ని గద్వాల డీఎస్పీ బాలకోటి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి భర్త ఆంజనేయులు, అత్త ఎల్లమ్మలను విచారించారు. తనభార్య శిరీష ఎవరితోనో వివాహేతర సంబంధం కలిగిఉండడంతో హత్యచేశానని ఆంజనేయులు నేరం అంగీకరించినట్లు తెలిపారు. గద్వాల సీఐ సురేష్, దేవరకద్ర ఎస్‌ఐ రాజు సంఘటనస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
 
 గద్వాలలో మరో వివాహిత బలి
 మరో ఘటనలో భార్యను భర్త హతమార్చాడు. గద్వాల టౌన్ ఎస్సై సైదాబాబు కథ నం.. గద్వాల మండలం చెనుగోనిపల్లిలో ఆం జనేయులు, సత్యమ్మ(35) దం పతులు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజులుగా భా ర్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. పిల్లలు ఇంట్లోనే నిద్రిస్తున్న క్రమం లో బుధవారం తెల్లవారుజామున ఆంజనేయు లు సత్యమ్మ గొంతుకు తాడు బిగించి హత్యచేశా డు. ఇంట్లోనే వేలాడదీసి ఆత్మహత్య చేసుకుం దని నమ్మించేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారికి కూడా చెప్పాడు. సత్యమ్మ మృతిపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తంచేశారు. సత్యమ్మ శరీరంపై గాయాలు, ఉరివేసిన విధానాన్ని బట్టి ఆంజనేయులే హత్య కు పాల్పడ్డాడని భావిస్తున్నారు. హత్యచేసిన ఆంజనేయులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement