
ఘటనా స్థలంలో స్థానికులు
సాక్షి, ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం పరిధిలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. తనను వేధిస్తున్న దగ్గరి బంధువును.. కత్తితో పొడిచి చంపింది ఓ యువతి. హత్య అనంతరం సరాసరి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తాను ఎందుకు చంపింది వివరించి మరీ పోలీసులకు లొంగిపోయిందామె.
ఏర్రలవాడలో నివసించే రామటెంకి శ్రీనివాస్ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న జాడి సంగీతను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. వీళ్లిద్దరూ దగ్గరి బంధువులు. ఇరు కుటుంబాలు కూలీ పనితో జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే.. సంగీతపై శీను వేధింపులు శ్రుతి మించిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో విసిగిపోయిన ఆమె.. శీనుపై కేసు పెట్టింది. దీంతో శీనును అరెస్ట్ చేశారు పోలీసులు. జైలుకు వెళ్లొచ్చాక కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. వెంటపడి పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం పెంచాడు.
ఈసారి మద్యం మత్తులో వేధించడం మొదలుపెట్టాడు. భరించలేకపోయిన సంగీత.. శీనును చేతులు కట్టేసి మరీ కత్తితో పొడిచి చంపేసింది. ఆపై నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment