బెంగుళూరు: అనైతిక వ్యవహారానికి స్వస్తి పలకాలని చెప్పిన భర్తను, భార్య తన ప్రియుడితో కలిసి అంతమొందించింది. ఈఘటన జేసీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. జేసీ.నగరలో మాన్‌సింగ్, చంద్రబాయి దంపతులు నివాసముంటున్నారు. చంద్రబాయి, అశోక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. అనుమానం వచ్చిన మాన్‌సింగ్ తన భార్యను మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయితే భర్తను అడ్డు తొలగించుకునేందుకు చంద్రబాయి తన ప్రియుడు అశోక్‌తో కలిసి పథకం వేసింది.
ఈ మేరకు ఈ నెల 4 అర్ధరాత్రి మాన్‌సింగ్‌ను ఇద్దరూ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి శ్మాశానానికి తీసుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి పరిశీలించగా ఈ ఉదంతం వెలుగు చూసింది. అక్కడే ఉన్న చంద్రబాయి, అశోక్‌ను అరెస్ట్ చేశారు. మాన్‌సింగ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. మాన్ సింగ్ ది హత్యేనని వైద్యులు తేల్చడంతో పాటు తమ విచారణలో చంద్రబాయి, అశోక్ తాము నేరం చేసినట్లు అంగీకరించారని పోలీసులు శనివారం వెల్లడించారు.
ప్రియుడితో కలిసి.. భర్త గొంతు నులిమేసింది!
Published Sun, May 7 2017 11:03 AM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM
Advertisement
Advertisement