విజయనగరం జిల్లా వేపాడలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను గతరాత్రి భర్త నరికి చంపేశాడు.
విజయనగరం జిల్లా వేపాడలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త గత అర్థరాత్రి గొడ్డలితో నరికి చంపేశాడు. అనంతరం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం గ్రామస్థులు ఆ విషయాన్ని గమనించిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహలను విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.