భర్తను చంపి...ఆత్మహత్యగా చిత్రీకరించింది.. | wife kills husband due to illegal contact | Sakshi
Sakshi News home page

భర్తను చంపి...ఆత్మహత్యగా చిత్రీకరించింది..

Published Sun, Mar 8 2015 12:07 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

wife kills husband due to illegal contact

చేవెళ్ల (రంగారెడ్డి): వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య తన భర్తను చంపేసింది. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించి, చివరికి పోలీసులకు దొరికిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో గత నెల 24వ తేదీన అనుమానాస్పద స్థితిలో తాళ్లపల్లి వెంకటయ్య(30) చనిపోయాడు. ఈ ఘటనపై మృతుని తల్లి అంతమ్మ.. కోడలు యాదమ్మపై అనుమానం వ్యక్తం చేస్త్తూ ఫిర్యాదు చేసింది. ఈ కేసును తమదైన శైలిలో విచారణ చేయగా యాదమ్మే నిందితురాలుగా నిర్ధారణ అయింది. నిందితురాలు గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తితో సంబంధం నెరపుతోంది.

 

ఈ విషయంలో భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, అతడు నిద్రిస్తుండగా కిరోసిన్ పోసి నిప్పంటించిన సంగతి పోలీసుల ఎదుట అంగీకరించింది. దీంతో ఈ దారుణానికి ఒడిగట్టిన యాదమ్మను, ఆమెను ప్రోత్సహించిన అంజయ్యను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement