ఉప్పల్(హైదరాబాద్): ఓ యువకుడు వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వారి కలయికను ఇద్దరి కుటుంబాల వారు వ్యతిరేకించటంతో ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. అంబర్‌పేట మల్లికార్జున నగర్‌కు చెందిన రాజుగౌడ్‌కు 14 ఏళ్ల క్రితం స్వప్న(33)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా, గత కొంతకాలంగా రామంతాపూర్ గోఖలేనగర్‌లో నివాసముండే ఆటో డ్రైవర్ రాజుకుమార్(24)తో స్వప్నకు పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం స్వప్న భర్తకు తెలిసింది.
పలు మార్లు మందలించినా ఫలితం లేక పోయింది. కాగా గురువారం రాత్రి బజారుకు వెళ్తున్నానని భర్తకు చెప్పి బయటకు వచ్చిన స్వప్న రాజుకుమార్‌తో కలసి పాత రామంతాపూర్‌లోని శివాలయానికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న విషాన్ని ఇద్దరూ తాగారు. శుక్రవారం గమనించిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న వీరిద్దరినీ స్థానిక ప్రైవేటు అస్పత్రికి తరలించగా స్వప్న మృతి చెందింది. కాగా, రాజు చికిత్స పొందుతున్నాడు. స్వప్న భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
Published Sat, Jun 6 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM
Advertisement
Advertisement