uppal police station
-
Uppal: కారుతో ఢీకొట్టి మహిళ దారుణహత్య
ఉప్పల్: కారుతో ఢీకొట్టి మహిళను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి అర్వపల్లి ప్రాంతానికి చెందిన పెండేరి చంద్రమౌళి (47) ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఏజెంట్‌గా పనిచేస్తూ రామంతాపూర్ వివేక్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే ప్రాంతంలో నివాసముండే కొమ్మవారి మంజుల (37) చంద్రమౌళి పనిచేసే రియల్ ఎస్టేట్ సంస్థలోనే ఏజెంటుగా పనిచేస్తున్నారు. మంజుల భర్త నాలుగు నెలల క్రితం మృతిచెందారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా మంజుల–చంద్రమౌళి మధ్య వివాహేతర సంబంధం ఉంది. గత కొంతకాలంగా మంజుల మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే చంద్రమౌళి మాట్లాడుకుందామంటూ మంజులను ఆదివారం రాత్రి ఉప్పల్ బగాయత్ లేఔట్లోకి తీసుకొచ్చాడు. ఇద్దరి మధ్య వాగి్వవాదం పెరిగింది. ఇంతలోనే మంజుల కారు దిగి వెళ్తుండగా చంద్రమౌళి వెనుక నుంచి అతి వేగంగా కారుతో ఆమెను ఢీకొట్డాడు. అంతటితో ఆగక పలుమార్లు ఆమెపై నుంచి కారును తీసుకెళ్లడంతో మంజుల అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం చంద్రమౌళి నేరుగా ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు యువ క్రికెటర్స్ పై కేసు నమోదు
-
బకెట్ చైర్స్ టెండర్లలో అవకతవకలు జరిగినట్లు గుర్తింపు
-
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన కుమార్తె
సాక్షి, హైదరాబాద్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదైంది. ఆయన కూతురు తుల్జాభవని రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. 159 గజాల నాచారం ల్యాండ్ కమర్షియల్ బిల్డింగ్ విషయంలో ఆమె ఫిర్యాదు చేశారు. కినారా గ్రాండ్‌కు తన తండ్రి అక్రమ అగ్రిమెంట్ చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ముత్తిరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయనపై సెక్షన్ 406, 420, 463,464,468, 471, R/w 34ipc,156 (3)crpc ప్రకారం కేసులు నమోదయ్యాయి. చదవండి: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువతి మృతి -
భార్యాబాధితుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: భార్య, అత్తమామల వేధింపులతో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..ఉప్పల్ ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన ఎల్దండ ఆనంద్, లత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు (2) ఉంది. నెలక్రితం లత తన భర్త కుటుంబసభ్యులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. (ఫ్లై ఓవర్‌పై ఆత్మహత్య.. భార్యే కారణం) ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో ఆనంద్ ఇంట్లోంచి బయటకు వెళ్లగానే కూతురును తీసుకొని లత ఇంటికి తాళం పెట్టి వెళ్లిపోయింది. ఆనంద్ మద్యం తాగి వచ్చి చూసేసరికి ఇంటికి తాళం ఉంది. చుట్టుపక్కల వెతికి పక్కనే ఉన్న అత్తగారింట్లోకి వెళ్లి ఆరాతీయగా వారు దుర్భాషలాడారు. దీంతో మనస్థాపం చెందిన ఆనంద్ బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లి భార్య, అత్తమామలు చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటిచుకున్నాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం గాంధీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: కన్నతండ్రే 'కర్కోటకుడు') ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య చిలకలగూడ : ఆరేళ్ల క్రితం ఎంటెక్ పాసయ్యాడు. అప్పటి నుంచి చెప్పులు అరిగేలా తిరిగినా సరైన ఉద్యోగం రాలేదు. ఇంత చదువు చదివి ఇంట్లోవాళ్లకు భారం కావడం ఇష్టం లేదనుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారకమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బౌద్ధనగర్ వారాసిగూడకు చెందిన పల్లే సుధీర్‌రెడ్డి (29) ఎంటెక్ చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఎన్ని ఇంటర్వూలకు వెళ్లినా సరైన ఉద్యోగం లభించలేదు. గత నెల 29న ఉదయం 11.30 గంటలకు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. సోదరుడు రణధీర్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, అదృశ్యమైన సుధీర్ ఫోటోను అన్ని పోలీస్, రైల్వేస్టేషన్లకు పంపించారు. ఈ నేపధ్యంలో ఈనెల 1వ తేదిన జామై ఉస్మానియా, ఆర్ట్స్ కాలేజీ రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కాచిగూడ రైల్వేపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీసులు పంపిన ఫొటోతో సరిపోల్చుకుని, కుటుంబసభ్యులకు సమాచారం అందించగా మృతుడు సుధీర్‌రెడ్డిగా గుర్తించారు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
ఉప్పల్‌లో మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన బైక్
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకోచ్చిన బైక్ మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతున్ని మన్సూరాబాద్‌కు చెందిన సంజయ్(20)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జగదీశ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం జగదీశ్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీపీ మీద దాడి చేసిన హిజ్రాలు
సాక్షి, హైదరాబాద్ : నిన్న వరంగల్‌లో నకిలీ హిజ్రా మీద దాడి చేసిన హిజ్రాలు నేడు ఏసీపీపై దాడి చేశారు. వివరాలు.. నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద హిజ్రాలు హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏసీపీ గాంధీ నారాయణపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణలో ఇద్దరు హోమ్గాడ్స్కి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిని హిజ్రాలను తక్షణమే అరెస్ట్ చేయ్యాల్సిందిగా ఏసీపీ ఆదేశించారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై అత్యాచారం కేసు
ఉప్పల్ (హైదరాబాద్): అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై స్నేహితుడైన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరసింగరావు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువతి(26), ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన ఆర్.రంగారెడ్డి(27) విజయవాడలోనే ఎంటెక్ చదువుకున్నారు. వీరిద్దరు ప్రస్తుతం హైదరాబాదులోని వేర్వేరు కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. ఆ యువతి రామంతపూర్‌లోని ఓ హాస్టల్లో ఉంటోంది. సీబీఐటీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రంగారెడ్డితో ప్రేమలో పడి సన్నిహితంగా ఉండేది. పెళ్లి చేసుకుందామని ఆ యువతి కోరగా వాయిదా వేస్తూ వచ్చాడు.తనపై రంగారెడ్డి అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. -
చేతులు విరిచి తాళ్లతో బంధించి..
ఉప్పల్ (హైదరాబాద్): ఉప్పల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఓ యువకుడు చేతులు వెనుకకు విరిచి తాళ్లతో బంధించి ఉండగా... ఆ దృశ్యాన్ని చూసి స్టేషన్‌కు వచ్చిన వారు ఆవేదనకు గురయ్యారు. శనివారం గుర్తు తెలియని వ్యక్తి మెట్రో స్టేషన్ మెట్లు ఎక్కడానికి గమనించిన అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకొని తాళ్లతో బందించి తీసుకొచ్చి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు అప్పగించి వెళ్లారు. ఆ యువకుడు ఒంటి నిండా గాయాలతో ఆదివారం ఉదయం నుంచి మండుటెండలో దాహం దాహం అంటూ అరుస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. యువకుడు హిందీలో ఆకలి, దాహం వేస్తుందన్న మాట తప్ప మరేది మాట్లాడలేదు. పోలీసులను దీనిపై అడగ్గా... మతిస్థిమితం లేని ఇతర రాష్ట్రానికి చెందిన యువకుడు. శనివారం సాయంత్రం మెట్రో రైలు పట్టాల వద్దకు వెళ్లాడని... అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకొని వచ్చి ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారన్నారు. అప్పటికే ఆ యువకుని ఒంటి నిండా గాయాలున్నాయని విచారించిన అనంతరం వదిలేశామని చెప్పారు. -
మాట్లాడుకుందామని పిలిచి కొట్టారు: శ్రీకాంత్
హైదరాబాద్: గాయని మధుప్రియ, ఆమె భర్త శ్రీకాంత్ ల మధ్య నెలకొన్న వివాదం మలుపులు తిరుగుతోంది. ఒకవైపు పోలీస్ స్టేషన్ లో నమోదయిన వేధింపుల కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే శనివారం అర్ధరాత్రి ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఉప్పల్ లోని తమ ఇంటిపై శ్రీకాంత్ అనుచరులు దాడిచేశారని మధుప్రియ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే శ్రీకాంత్ వాదన మాత్రం మరోలా ఉంది. మాట్లాడుకుందాం రమ్మని మధుప్రియ బంధువులు పిలిస్తేనే వెళ్లానని, అక్కడ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని శ్రీకాంత్ మీడియాకు సమాచారం ఇచ్చాడు. -
ఎమ్మెల్యే ప్రభాకర్‌పై కిడ్నాప్ కేసు
బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. నల్గొండ జిల్లా సీతారాంపూర్ గ్రామానికి చెందిన బ్రహ్మదేవ్ అనే వ్యక్తిని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లాడని సోమవారం ఈ కేసు నమోదైంది. బాధితుని ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు 363, 324, 384 సెక్షన్ల కింద కిడ్నాప్ కేసు నమోదు చేశారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
ఉప్పల్(హైదరాబాద్): ఓ యువకుడు వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వారి కలయికను ఇద్దరి కుటుంబాల వారు వ్యతిరేకించటంతో ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. అంబర్‌పేట మల్లికార్జున నగర్‌కు చెందిన రాజుగౌడ్‌కు 14 ఏళ్ల క్రితం స్వప్న(33)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా, గత కొంతకాలంగా రామంతాపూర్ గోఖలేనగర్‌లో నివాసముండే ఆటో డ్రైవర్ రాజుకుమార్(24)తో స్వప్నకు పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం స్వప్న భర్తకు తెలిసింది. పలు మార్లు మందలించినా ఫలితం లేక పోయింది. కాగా గురువారం రాత్రి బజారుకు వెళ్తున్నానని భర్తకు చెప్పి బయటకు వచ్చిన స్వప్న రాజుకుమార్‌తో కలసి పాత రామంతాపూర్‌లోని శివాలయానికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న విషాన్ని ఇద్దరూ తాగారు. శుక్రవారం గమనించిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న వీరిద్దరినీ స్థానిక ప్రైవేటు అస్పత్రికి తరలించగా స్వప్న మృతి చెందింది. కాగా, రాజు చికిత్స పొందుతున్నాడు. స్వప్న భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.