
సాక్షి, హైదరాబాద్ : నిన్న వరంగల్‌లో నకిలీ హిజ్రా మీద దాడి చేసిన హిజ్రాలు నేడు ఏసీపీపై దాడి చేశారు. వివరాలు.. నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద హిజ్రాలు హల్‌చల్ చేశారు. పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏసీపీ గాంధీ నారాయణపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణలో ఇద్దరు హోమ్‌గాడ్స్‌కి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిని హిజ్రాలను తక్షణమే అరెస్ట్ చేయ్యాల్సిందిగా ఏసీపీ ఆదేశించారు.