Hijra attack
-
నకిలీ హిజ్రా హల్చల్
యశవంతపుర: విలావంతమైన జీవనం కోసం మారువేషం వేసి వీధుల్లో భిక్షం అడుగుతున్న వ్యక్తిని బాగలగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. బాగలగుంటకు చెందిన చేతన్ హిజ్రా వేషంలో భిక్షాటన చేయటం ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్న చేతన్‌కు పిల్లలున్నారు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన చేతన్ డబ్బుల కోసం మహిళ వేషం వేసి హిజ్రాలతో కలిసి నాగసంద్ర మెట్రోస్టేషన్ వద్ద భిక్షాటన చేస్తున్నారు. డబ్బులివ్వని వారిపై దౌర్జన్యం చేసేవాడు. నాగసంద్ర మెట్రోస్టేషన్ వద్ద ఆక్రమంగా షెడ్ వేసుకున్నాడు. ఈనెల 13న బీఎంఆర్సీఎల్ అధికారులు షెడ్‌ను తొలగించే విషయంపై పరిశీలన చేయగా అధికారులపై కూడా దౌర్జన్యం చేశాడు. స్థానికులు పట్టుకొని చేతన్‌ను చితకబాది అసలు విషయాన్ని బహిరంగం చేశారు. అనంతరం బాగలగుంట పోలీసులు చేతన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్‌లో హిజ్రాల హల్చల్.. డబ్బులు డిమాండ్.. ఆపై!
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్ ప్రాంతంలో కొందరు హిజ్రాలు హల్చల్ చేశారు. స్థానికంగా పెళ్లి జరుగుతున్నఇంట్లోకి ప్రవేశించి ఏకంగా 50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. అంత మొత్తంలో డబ్బులు పెళ్లి వారు ఇవ్వకపోవడంతో వారితో అసభ్యంగా ప్రవర్తించారు. డబ్బులు ఇవ్వాల్సిందేనని బట్టలు విప్పి హిజ్రాలు నానా హంగామా చేశారు. అంతటితో ఆగకుండా పెళ్లి వారిపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారమివ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకొని నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే హిజ్రాలు పోలీస్ స్టేషన్లో సైతం బట్టలు విప్పి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడంతో వారిపై 506, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్టేషన్లో హంగామా చేసినందుకు ఐపీసీ 188, 51 (బి) డిజాస్టర్ మేనెజ్మెంట్ కింద మరో కేసు నమోదు చేశారు. -
నకిలీ హిజ్రా జుట్టు కత్తిరించారు..
-
నకిలీ హిజ్రా జుట్టు కత్తిరించారు..
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని హుజూర్ నగర్లో హిజ్రా వేషంలో తిరుగుతున్న ఓ వ్యక్తికి స్థానిక హిజ్రాలు దేహశుద్ది చేశారు. హుజుర్ నగర్ పట్టణంలో పొట్టి శ్రీరాములు సెంటర్ సమీపంలో అతని జుట్టు కత్తిరించి ఊరేగింపు చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. బిహార్ నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు మహిళా వేషం వేసుకొని స్థానికంగా ఉన్న తమను కత్తులతో చంపుతామని బెదిరిస్తున్నారని హిజ్రాలు పోలీసులకు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, ఇక్కడ హిజ్రాల వేషం వేసుకొని తిరుగుతున్నారని, అలాంటి వారు ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడితే ఆ నింద తమ సమాజంపై పడే అవకాశం ఉందని హిజ్రాలు వాపోయారు. అందుకే ఆ వ్యక్తిని దేహశుద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
హిజ్రాల ఆగడాలు అరికట్టండి
వైఎస్ఆర్ జిల్లా, పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పట్టణంలో ఇటీవల కాలంలో హిజ్రాలు వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేయడం, అడిగినంత ఇవ్వకపోతే దాడి చేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు. హిజ్రాల ప్రవర్తనతో విసిగి, భయపడిన కిరాణా, కూరగాయల, టీ బంకుల, తోపుడుబండ్ల, వస్త్ర దుకాణాల, మటన్, చికెన్ దుకాణాల వ్యాపారులు ఆదివారం ఎస్ఐ రెడ్డి సురేష్‌కు వినతిపత్రం ఇచ్చి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఇటీవల కాలంలో వారానికి రెండు దఫాలు అంగళ్ల వద్దకు హిజ్రాలు డబ్బుల వసూళ్లకు రావడం, అడిగినంత ఇవ్వకపోతే దాడి చేస్తుండటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఫాస్టుఫుడ్ సెంటర్ యజమాని వెంకటరామిరెడ్డి రూ. 50 లు ఇస్తే తీసుకోకుండా రూ. 200 లేదా 100 ఇవ్వాలని దబాయించారు. అంతలేదని చెప్పిన వెంకట్రామిరెడ్డిపై నూనెగోళం ఎత్తివేసి, తినుబండారాలు విసిరివేయడంతో నూనె పడి శరీరం కాలిందని వ్యాపారులు వివరించారు. వారం క్రితం చికెన్షాపు దగ్గర అడిగినంత డబ్బు ఇవ్వలేదని, వేలాడదీసిన చికెన్ విసిరి వేశారని, టెంకాయల వ్యాపారి నాగేశ్వరరావు రూ. 100 ఇవ్వలేదని కాలితో తన్నారని, తోపుడు బండి దగ్గర తక్కెడ తీసుకెళ్లారని, అంబటి అశోక్ దగ్గర నూనె క్యాన్ ఎత్తుకెళ్లారని ఇవన్నీ హిజ్రాల ఆగడాలకు పరాకాష్ట అని వారు ఎస్ఐకి తెలిపారు. ఇదిలా ఉండగా పట్టణ శివారులోని మల్లకతువ స్పీడ్‌బ్రేకర్ దగ్గర, మైదుకూరు రోడ్డులో రంగసముద్రం క్రాస్‌రోడ్డు స్పీడ్ బ్రేకర్ దగ్గర, ఆసుపత్రి స్పీడ్ బ్రేకర్ దగ్గర వాహనాలను అటకాయించి డబ్బులు అడుగుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. హిజ్రాల పరిస్ధితి అదుపు తప్పిందని, తక్షణం వారిని పట్టణంలో లేకుండా తరిమి వేయాలని కోరారు. ఎస్ఐకి ఫిర్యాదు చేసిన వారిలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మస్తాన్, పట్టణ కార్యదర్శి మహమ్మద్ రఫి, తోపుడుబండ్ల యూనియన్ కార్యదర్శి సుబ్రమణ్యం, ఆర్యవైశ్య నాయకులు నటరాజ, అంబటి, బంగారు వ్యాపారులు రఫి, మాబు, నారాయణ, బాషా, పూల వ్యాపారులు సయ్యద్, మధు తదితరులు ఉన్నారు. -
ఏసీపీ మీద దాడి చేసిన హిజ్రాలు
సాక్షి, హైదరాబాద్ : నిన్న వరంగల్‌లో నకిలీ హిజ్రా మీద దాడి చేసిన హిజ్రాలు నేడు ఏసీపీపై దాడి చేశారు. వివరాలు.. నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద హిజ్రాలు హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏసీపీ గాంధీ నారాయణపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణలో ఇద్దరు హోమ్గాడ్స్కి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిని హిజ్రాలను తక్షణమే అరెస్ట్ చేయ్యాల్సిందిగా ఏసీపీ ఆదేశించారు. -
శ్రుతిమించుతున్న హిజ్రాల ఆగడాలు
రాజేంద్రనగర్: హిజ్రాల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఏదైనా శుభకార్యం, దుకాణాల ప్రారంభోత్సవం జరిగితే వచ్చి నజరానా తీసుకోని వెళ్లేవారు. కానీ ఇప్పుడు గ్యాంగులుగా ఏర్పడి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారిపై దాడులు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. రెండు రోజుల క్రితం నలుగురు హిజ్రాలు నార్సింగి సబ్‌రోడ్డులో దారిగూండా వెళ్తున్నవారిని అడ్డగించి అందిన కాడికి దోచుకున్నారు. మంచిరేవులకు చెందిన సత్యనారాయణ ఫిర్యాదు చేయడంతో నలుగురు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కొందరు హిజ్రాలు ఉన్నప్పటికీ ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. గుంపులు గుంపులుగా.. హిజ్రాలు గ్యాంగులుగా ఏర్పడి నానా హడావిడి సృష్టిస్తున్నారు. ఒకొక్క గ్యాంగులో నాలుగు నుంచి 10 మంది సభ్యులు ఉంటున్నారు. ఆటోల్లో తిరుగుతూ ఎక్కడ శుభకార్యం జరిగిన వాలిపోతున్నారు. ఒకరు మాట్లాడుతుండగా మరొకరు వెలికి చేష్టలు చేస్తూ ఇబ్బందులు సృష్టిసుంటారు. వారు అడిగిన డబ్బు ఇచ్చేంత వరకు విడవడం లేదు. దీంతో నయానో.. బయానో సముదాయించి డబ్బును అందజేస్తున్నారు. పెళ్లి చేసేవారి వారి స్థాయిని బట్టి రూ. 5 నుంచి రూ. 25 వేల వరకు, గృహప్రవేశాలకు రూ. 5 నుంచి రూ.10 వేలు, ఇతర ఏ శుభకార్యాలు చేపట్టిన రూ. 5 వేల వరకు డిమాండ్ చేసి మరి వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే.. అసభ్యకరపదజాలంతో తిడుతూ శాపనార్థాలు పెడుతూ రోడ్లపై హంగామా చేస్తారు. -
హిజ్రాలపై దాడి
డోర్నకల్ : సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు హిజ్రాలపై మరో ఇద్దరు హిజ్రాలు దాడి చేశారు. డోర్నకల్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం జీఆర్పీ సీఐ చంద్రబాను తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రిలోని బాలాజీపేటకు చెందిన హిజ్రాలు కోమలి శ్రీగంగ ఎలియాస్ రాజేష్, కసినికోట హనీ ఎలియాస్ శ్రీనివాస్ రైళ్లలో యాచన చేస్తూ జీవిస్తున్నారు. స్వంత పనిపై సికింద్రాబాద్ వెళ్లిన వీరు సోమవారం రాత్రి రాజమండ్రి వెళ్లేందుకు గౌతమి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఇదే రైలులో మరో హిజ్రా ఎక్కి ప్రయాణికుల వద్ద డబ్బులు అడుక్కుని వరంగల్‌లో దిగిపోయింది. వరంగల్‌లో మరో ఇద్దరు హిజ్రాలు రైలు ఎక్కి శ్రీగంగ, హనీ వద్దకు వచ్చి ఘర్షణ పడ్డారు. తమ ఏరియాలోకి వచ్చి ప్రయాణికుల వద్ద డబ్బులు అడుగుతున్నారంటూ ఇద్దరిపై దాడి చేయగా శ్రీగంగ ముఖంపై గాయాలయ్యాయి. రైలు మహబూబాబాద్ స్టేషన్లో కదిలిన వెంటనే చైను లాగి దాడి చేసిన హిజ్రాలు దిగిపోయారు. శ్రీగంగ, హనీ డోర్నకల్‌లో రైలు దిగి స్థానిక జీఆర్పీ స్టేషన్లో తమపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశారు. వరంగల్‌లో రైలు ఎక్కిన ఇద్దరు హిజ్రాలు తమపై దాడి చేసి సెల్‌ఫోన్‌తో పాటు రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిజ్రా శ్రీగంగ ఇచ్చిన ఫిర్యాదు పేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాను తెలిపారు. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై హిజ్రా దాడి
వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్‌లో ప్రభుత్వ బస్సు డ్రైవర్‌పై హిజ్రా దాడి చేయడంతో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే కొత్త బస్టాండ్‌కు చెన్నై నుంచి ప్రభుత్వ బస్సును డ్రైవర్ రమేష్ మధ్యాహ్నం 1.30 గంటలకు నడుపుకుంటూ వచ్చి నిలిపాడు. అనంతరం ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లేందుకు బస్సు ను నిలిపాడు. ఆ సమయంలో బస్టాండ్‌లోని ఒక హిజ్రా బస్సులోనికి ఎక్కి ప్రయాణికుల వద్ద డ బ్బులు వసూలు చేస్తున్నారు. ఆ సమయంలో బస్సు డ్రై వర్ రమేష్ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా బస్సు నుంచి కిందకు దిగాలని తెలిపాడు. దీంతో ఆగ్రహించిన హిజ్రా డ్రైవర్‌పై దాడికి దిగి అసభ్య పదజాలంలో దూషించింది. దీంతో హిజ్రా, డ్రైవర్ మద్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో బస్సు డ్రైవర్ రమేష్ షర్టును హిజ్రా చించివేసింది. అనంతరం కండక్టర్ అడ్డగించడంతో కండక్టర్ బ్యాగులో ఉన్న రూ.2500 నగదును దోచేసి పరారయ్యేందుకు ప్రయత్నించింది. వెంటనే ప్రయాణికులు హిజ్రాను అడ్డుకొని అక్కడే ఉన్న పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న సహ డ్రైవర్లు చెన్నై బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. వెంటనే హిజ్రాపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు ప్రభుత్వ బస్సు డ్రైవర్లను అడ్డుకొని చర్చలు జరిపారు. అనంతరం ప్రయాణికుల చర్చల అనంతరం బస్సు డ్రైవర్ బస్సును నడిపాడు. దీంతో అరగంట పాటు కొత్త బస్టాండ్‌లోని ప్రభుత్వ బస్సులు నిలిచి పోయింది.