ఫిర్యాదు చేసేందుకు వచ్చిన హిజ్రాలు
డోర్నకల్ : సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు హిజ్రాలపై మరో ఇద్దరు హిజ్రాలు దాడి చేశారు. డోర్నకల్ జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం జీఆర్‌పీ సీఐ చంద్రబాను తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రిలోని బాలాజీపేటకు చెందిన హిజ్రాలు కోమలి శ్రీగంగ ఎలియాస్ రాజేష్, కసినికోట హనీ ఎలియాస్ శ్రీనివాస్ రైళ్లలో యాచన చేస్తూ జీవిస్తున్నారు.
స్వంత పనిపై సికింద్రాబాద్ వెళ్లిన వీరు సోమవారం రాత్రి రాజమండ్రి వెళ్లేందుకు గౌతమి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఇదే రైలులో మరో హిజ్రా ఎక్కి ప్రయాణికుల వద్ద డబ్బులు అడుక్కుని వరంగల్‌లో దిగిపోయింది. వరంగల్‌లో మరో ఇద్దరు హిజ్రాలు రైలు ఎక్కి శ్రీగంగ, హనీ వద్దకు వచ్చి ఘర్షణ పడ్డారు. తమ ఏరియాలోకి వచ్చి ప్రయాణికుల వద్ద డబ్బులు అడుగుతున్నారంటూ ఇద్దరిపై దాడి చేయగా శ్రీగంగ ముఖంపై గాయాలయ్యాయి.
రైలు మహబూబాబాద్ స్టేషన్‌లో కదిలిన వెంటనే చైను లాగి దాడి చేసిన హిజ్రాలు దిగిపోయారు. శ్రీగంగ, హనీ డోర్నకల్‌లో రైలు దిగి స్థానిక జీఆర్‌పీ స్టేషన్‌లో తమపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశారు. వరంగల్‌లో రైలు ఎక్కిన ఇద్దరు హిజ్రాలు తమపై దాడి చేసి సెల్‌ఫోన్‌తో పాటు రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిజ్రా శ్రీగంగ ఇచ్చిన ఫిర్యాదు పేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాను తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment