
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని హుజూర్ నగర్‌లో హిజ్రా వేషంలో తిరుగుతున్న ఓ వ్యక్తికి స్థానిక హిజ్రాలు దేహశుద్ది చేశారు. హుజుర్ నగర్ పట్టణంలో పొట్టి శ్రీరాములు సెంటర్ సమీపంలో అతని జుట్టు కత్తిరించి ఊరేగింపు చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. బిహార్ నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు మహిళా వేషం వేసుకొని స్థానికంగా ఉన్న తమను కత్తులతో చంపుతామని బెదిరిస్తున్నారని హిజ్రాలు పోలీసులకు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, ఇక్కడ హిజ్రాల వేషం వేసుకొని తిరుగుతున్నారని, అలాంటి వారు ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడితే ఆ నింద తమ సమాజంపై పడే అవకాశం ఉందని హిజ్రాలు వాపోయారు. అందుకే ఆ వ్యక్తిని దేహశుద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment