
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకోచ్చిన బైక్ మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతున్ని మన్సూరాబాద్‌కు చెందిన సంజయ్(20)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జగదీశ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం జగదీశ్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment