అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై అత్యాచారం కేసు | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై అత్యాచారం కేసు

Published Tue, Sep 26 2017 11:54 AM

uppal police station - Sakshi

ఉప్పల్‌ (హైదరాబాద్‌): అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై స్నేహితుడైన మరో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ నరసింగరావు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువతి(26), ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన ఆర్‌.రంగారెడ్డి(27) విజయవాడలోనే ఎంటెక్‌ చదువుకున్నారు.

వీరిద్దరు ప్రస్తుతం హైదరాబాదులోని వేర్వేరు కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. ఆ యువతి రామంతపూర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. సీబీఐటీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రంగారెడ్డితో ప్రేమలో పడి సన్నిహితంగా ఉండేది. పెళ్లి చేసుకుందామని ఆ యువతి కోరగా వాయిదా వేస్తూ వచ్చాడు.తనపై రంగారెడ్డి అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement