బంజారాహిల్స్: హైదరాబాద్లో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ దుర్మార్గుడు ఓ సినీనటుడి ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడని తెలుస్తోంది.
బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్ ప్రాంతంలో నివసించే ఓ కారు డ్రైవర్ కుమార్తె స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న ఆ చిన్నారిని సెక్యూరిటీ గార్డు నాగేందర్(23) చాక్లెట్ ఇస్తానంటూ నమ్మించి పక్కనే ఉన్న గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఏడుస్తున్న చిన్నారిని నోరు నొక్కి విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం నాగేందర్ అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారి జరిగిన విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గురువారం రాత్రి నుంచే గాలింపు మొదలు పెట్టారు. ఇదే క్రమంలో కమలాపురి కాలనీలో తిరుగుతున్న నాగేందర్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నాగేందర్‌పై ఐపీసీ సెక్షన్ 506, 376, ఫోక్సో 5, 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్లో చిన్నారిపై అఘాయిత్యం
Published Fri, Nov 13 2015 6:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement