రంగారెడ్డి జిల్లా కుంట్లూరు గ్రామంలో ఇద్దరు ఆగంతకులు ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కుంట్లూరు గ్రామంలో ఇద్దరు ఆగంతకులు ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు. బిహార్కు చెందిన దంపతులు కుంట్లూరులో నివాసం ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యాచారం జరిపి పరారయ్యారు. దీనిపై బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి పేర్లు కైలాష్, రాజు అని వారి మాటలను బట్టి తెలిసినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.