
ఎమ్మెల్యే ప్రభాకర్‌పై కిడ్నాప్ కేసు
బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. నల్గొండ జిల్లా సీతారాంపూర్ గ్రామానికి చెందిన బ్రహ్మదేవ్ అనే వ్యక్తిని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లాడని సోమవారం ఈ కేసు నమోదైంది. బాధితుని ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు 363, 324, 384 సెక్షన్ల కింద కిడ్నాప్ కేసు నమోదు చేశారు.