
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. అధికార మదంతో అక్రమ కేసులు, అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి లోబడే పోలీసులు సైతం పనిచేస్తున్నారు. తాజాగా దెందులూరులో సైతం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నారు. చింతమనేని ఆదేశాలంతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారు.
దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని కనుసన్నల్లో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రెండు రోజుల క్రితమే వట్లూరులో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, అతని అనుచరులపై చింతమనేని, ఆయన అనుచరులు దాడి చేసి అసభ్య పదజాలంతో తిట్టిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా వారే దాడి చేసి రివర్స్‌లో బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయించారు చింతమనేని. తాజాగా ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో చింతమనేని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
చింతమనేని గన్ మ్యాన్ వద్ద గన్ లాక్కుని దాడి చేసేందుకు ప్రయత్నించారని కట్టుకథలతో చింతమనేని ఫిర్యాదు చేయించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో పాటుగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో చింతమనేని దౌర్జన్యంపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు దాడులు చేసి తమపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇదే జరిగింది. కేసు ఏంటో చెప్పకుండా హైదరాబాద్ వరకు వెళ్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సర్కార్ తమకు చట్టం, న్యాయం, రాజ్యాంగాలతో పనిలేదని రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తోంది. ఇప్పటికే కేసుల విషయంలో పలుమార్లు హైకోర్టు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు సామాన్యుల గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment