సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. చింతమనేని అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.
పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ రోజు(శనివారం) ఇంటి ముందు వంటా వార్పు పేరుతో చింతమనేని అనురులు డ్రామాకు దిగారు. దీంతో చింతమనేని అనుచరులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చింతమనేని అనుచరులకు వత్తాసు పలుకుతూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment