
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్‌పై టీడీపీలోని ఓ వర్గం రగిలిపోతుండగా, మరోవైపు చింతమనేని వద్దే వద్దని జనసేన నేతలు అంటున్నారు. కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండగా, తనకు టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఓడిస్తానంటూ చింతమనేని బెదిరింపులకు దిగుతున్నారు.
చింతమనేని నోటి దురుసుతో పార్టీ పరువు పోతుందని.. దెందులూరు టికెట్ చింతమనేనికి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానానికి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన నేత కొఠారు ఆదిశేషుకు దెందులూరు టికెట్ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు.
మరోవైపు చింతమనేనికి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరిపై ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు ఇలా వ్యతిరేక పవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment