Eluru Assembly Constituencies
-
వైఎస్సార్సీపీలో ఫుల్ జోష్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లాలో ఫుల్‌జోష్‌తో కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా స్థానిక పరిస్థితులు, సమీకరణలకు అనుగుణంగా జిల్లాలో అభ్యర్థుల మార్పులు, చేర్పుల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన పార్టీ ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం, నూతన అభ్యర్థుల పరిచయ సభ గ్రాండ్ సక్సెస్ కావడం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపింది. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు, పోలవరం అసెంబ్లీ అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మిలను జిల్లా నాయకులు కార్యకర్తలకు పరిచయం చేశారు. ఎన్నికల శంఖారావం పూరించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నవోత్సాహం కదంతొక్కుతోంది. ఇప్పటికే ప్రజల్లోకి.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జులను మార్చింది. మిగిలిన చోట్ల ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్నారు. పాదయాత్రలు చేస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఐదేళ్లలో తాము చేసిన పనులను వివరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గడపగడపకూ చేకూరిన లబ్ధిని చెబుతున్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఈనెల 30వ తేదీకల్లా నియోజకవర్గ స్థాయి సమావేశాలు ముగిసేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న చింతలపూడి ఇన్చార్జి కంభం విజయరాజు, పోలవరం ఇన్చార్జి తెల్లం రాజ్యలక్ష్మి ఇప్పటికే వారం రోజులుగా నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తున్నారు. ఇక ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఆదివారం నుంచి పార్లమెంట్ పరిధిలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. టీడీపీలో అనిశ్చితి ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో రాజకీయ అనిశ్చితి తారాస్థాయికి చేరింది. పొత్తుల గందరగోళం ఒక వైపు, టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయ లోపం మరోవైపు ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏలూరు ఎంపీ టికెట్‌ను ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఆశిస్తున్నా స్పష్టత లేకపోవడం పొత్తుల్లో జనసేనకు ఇచ్చే స్థానాలు తేల్చకపోవడంతో రెండు పార్టీల నేతల్లో రాజకీయ నైరాశ్యం నెలకొంది. ఇక దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ సమన్వయకర్త చింతమనేని ప్రభాకర్ యథావిధిగా హల్చల్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు చింతమనేని వద్దు–ఎవరైనా ముద్దు అనే పేరుతో నిరసన సమావేశం నిర్వహించినప్పటి నుంచి ఆయన తీవ్ర ఆందోళనకు గురై టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలపై నోరుపారేసుకుంటున్నట్లు సమాచారం. కైకలూరు, నూజివీడు, పోలవరంలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్లమెంట్ స్థానానికో సభ నిర్వహిస్తున్నా అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా ముఖ్యనేతలు ఖర్చుకు ముందుకురాని పరిస్థితి. అయితే జనసేన, టీడీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియా వార్ కొనసాగిస్తున్నాయి. ఏ పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తాయో పోస్టులు షేర్ చేస్తూ గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి. -
టీడీపీ, జనసేన మధ్య బిగుస్తున్న ‘సీటు’ముడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య పడిన ‘సీటు’ముడి రోజురోజుకూ బిగుసుకుపోతోంది. రెండు పార్టీల మధ్య రాజకీయ కాక తారస్థాయికి చేరగా.. ఇరుపార్టీల నేతల మధ్య సిగపట్లు పెరిగాయి. ఉభయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా పరస్పర మాటల యుద్ధంతో రచ్చకెక్కుతున్నారు. నరసాపురం టికెట్ తమదంటే.. తమదంటూ అనుకూల సమీకరణాలు చెప్పుకుంటూ హడావుడి చేస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ టీడీపీతో దోస్తీ ప్రకటించిన నాటినుంచి నియోజకవర్గంలో రెండు పార్టీలూ కలిసికట్టుగా నిర్వహించిన కార్యక్రమాలు లేకపోగా.. తాజా పరిణామాలు ఆ పార్టీల మధ్య మరింత దూరం పెంచుతోంది. జనసేన నుంచి ఒకరు, టీడీపీ నుంచి నలుగురు టికెట్లు ఆశిస్తూ వర్గాలుగా విడిపోయి హంగామా సృష్టిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాలుగు వర్గాలుగా చీలిపోయింది. తాజా పరిణామాలతో టీడీపీ కార్యక్రమాలకు జన సైనికులు దూరం జరగ్గా.. జన సైనికులతో అంతకంటే ఎక్కువగా టీడీపీ దూరం పాటిస్తోంది. మింగుడు పడని రాజకీయం రాష్ట్రంలోనే అతి చిన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నరసాపురం ఒకటి. రాజకీయ పరంగా ప్రతిపక్షాలకు ఆదినుంచీ కొరుకుడుపడని విధంగానే ఉంటోంది. ఇప్పుడు కూడా సీటు విషయంలో గందరగోళం నెలకొని టీడీపీ, జనసేన పార్టీలకు మింగుడుపడటం లేదు. రెండు పార్టీలకు కనీస స్థాయిలో కూడా బలమైన ఇన్చార్జిలు లేకపోవడం, ఆశావహులు ఎక్కువగా ఉండటం, కుల సమీకరణాలు కీలక ప్రాధాన్యంగా మారడంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 1983 నుంచి 2004 వరకు నరసాపురంలో టీడీపీ గెలుపొందుతూ వచ్చింది. 2009లో ముదునూరి ప్రసాదరాజు గెలుపొందారు. మళ్లీ 2019లో వైఎస్ జగన్ ప్రభంజనంలో ఘన విజయం సాధించి ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొనసాగుతున్నారు. పూర్తిగా పాజిటివ్ పాలిటిక్స్‌తో అర్థరహిత విమర్శలకు పోకుండా నియోజకవర్గంలో గడచిన నాలుగేళ్ల 9 నెలల కాలంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు నిర్వహించారు. మొదటినుంచీ ఆయన జనంలో బలంగా తిరుగుతున్నారు. ప్రసాదరాజు అన్నివర్గాలనూ కలుపుకుపోతూ నానాటికీ బలపడుతుండటంతో టీడీపీ, జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత ఎన్నికల్లో రెండో స్థానం వచ్చినా.. 2019 ఎన్నికల్లో జనసేన ఈ నియోజకవర్గంలో టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీని మూడో స్థానంలోకి నెట్టి దాదాపు 35 ఏళ్ల టీడీపీ రాజకీయ ప్రస్థానానికి జనసేన గండి కొట్టింది. నాటినుంచి నేటివరకు నియోజకవర్గంలో టీడీపీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ 49,120 ఓట్లు సాధించగా.. టీడీపీ దారుణంగా పతనమై 27,059 ఓట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో పొత్తు లేకుండానే అత్యధిక ఓట్లు సాధించాం కాబట్టి పొత్తుల్లో పవన్ కల్యాణ్ కంటే ముందు నరసాపురం సీటును జనసేన పార్టీకే ప్రకటిస్తారని జనసేన కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాతోపాటు బహిరంగంగానూ బలంగా వాణి వినిపిస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ పనైపోయిందంటూ జనసేన కార్యకర్తలు టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు, సమన్వయ కమిటీ కార్యక్రమాలకు, చంద్రబాబు పర్యటనలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. టీడీపీ సైతం జనసేనతో ఇదే దూరం పాటిస్తోంది. టీడీపీలో టికెట్ లొల్లి టీడీపీలో టికెట్ లొల్లి తారాస్థాయికి చేరడంతో గందరగోళం నెలకొంది. నలుగురు అభ్యర్థులు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్న కొద్దిపాటి కేడర్‌ను చెల్లాచెదురు చేస్తున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది.. 2019లో ఓడిపోయిన బండారు మాధవనాయుడును టీడీపీ ఇన్చార్జిగా తొలగించి అత్యంత మొక్కుబడి నాయకుడైన పొత్తూరు రామరాజును ఇన్చార్జిగా నియమించింది. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి వేర్వేరుగా అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా.. టీడీపీ సీటు ఆశిస్తూ ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజ రామ్మోహన్నాయుడు కొద్ది నెలలుగా నియోజకవర్గంలో హంగామా చేస్తున్నారు. నరసాపురం సీటు జనసేనకు కేటాయించడం లేదని.. టీడీపీకి చెందిన ముగ్గురికీ కాకుండా తనకే వస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో సొంత అజెండాతో ప్రతిచోటా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇక అపార అనుభవం ఉండి.. అన్ని రాజకీయ పార్టీలూ తిరిగి వచ్చిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ టికెట్ కోసం విపరీతంగా లాబీయింగ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కూడా చంద్రబాబు తనకే సీటిస్తానని చెప్పారంటూ హడావుడి చేస్తూ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనసేనలోనూ గందరగోళమే మరోవైపు అభ్యర్థి ఎవరనే విషయంలో జనసేన పార్టీలోనూ గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బొమ్మిడి నాయకర్‌కు ఈసారి ఆ పార్టీ నుంచి సీటొస్తుందో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. టీడీపీ సీటు కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీ టికెట్ కోసం కూడా కరీ్చప్ వేశారు. మెగాస్టార్ చిరంజీవి ద్వారా నరసాపురం జనసేన సీటు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఆక్వా వ్యాపారి చాగంటి మురళీకృష్ణ కూడా జనసేన టికెట్‌పై కన్నేశారు. -
పరువు పోతుంది.. చింతమనేనికి టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్‌పై టీడీపీలోని ఓ వర్గం రగిలిపోతుండగా, మరోవైపు చింతమనేని వద్దే వద్దని జనసేన నేతలు అంటున్నారు. కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండగా, తనకు టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఓడిస్తానంటూ చింతమనేని బెదిరింపులకు దిగుతున్నారు. చింతమనేని నోటి దురుసుతో పార్టీ పరువు పోతుందని.. దెందులూరు టికెట్ చింతమనేనికి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానానికి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన నేత కొఠారు ఆదిశేషుకు దెందులూరు టికెట్ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. మరోవైపు చింతమనేనికి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరిపై ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు ఇలా వ్యతిరేక పవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. -
చింతమనేని సీట్ సిరిగిపోయిందా ?
రౌడీ ఎమ్మెల్యే అనే ట్యాగ్ లైను వేసుకోవడానికి తెగ ఇష్టపడే దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది.. 'ఆయనొద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ తెలుగు తమ్ముళ్లు అక్కడక్కడా ఫ్లెక్సీలు కట్టడం తెలుగుదేశాన్ని.. చంద్రబాబును కలవరపరుస్తోంది. నోటి దురుసుకు చేయి జోరుకు మారు పేరుగా నిలిచిన చింతమనేని గతంలో టీడీపీ హయాంలో ఉన్నపుడు మహా ఉజ్వలంగా వెలిగిపోయారు. తన దెందులూరు నియోజకవర్గానికి ఆయనే ముఖ్యమంత్రి, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గనులు.. ఇలా అన్ని శాఖలకూ ఆయనే అధిపతి. అడ్డొస్తే అడ్డంగా నరికేసినంత పని చేసేవారు. ఆ దూకుడులో భాగంగానే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని ఈడ్చి కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తరువాత అనుమతులు లేకుండా అడవీ భూముల్లో రోడ్లు వేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. అంతేకాకుండా అధికారంలో ఉన్నపుడు నోటి దురుసును అడ్డూ అదుపూ లేకుండా పోయేది. 'ఏంటీ పవన్ కళ్యాణ్ మద్దతుతో కదా మీరు గెలిచారు' అని అడిగితే.. 'హహ.. పవన్.. ఒక సన్నాసి.. సొంత అన్నను పాలకొల్లులో గెలిపించలేనివాడు మా చంద్రబాబును గెలిపిస్తాడా..? ఊరుకోండయ్యా..' అని సెటైర్లు వేశారు. 'ఒరేయ్ మీరు ఎస్సీలు..! మీకెందుకురా రాజకీయాలు..? మేము రాజకీయాలు చేస్తాం' అని ఓపెన్ సభలో చెప్పడం కూడా ఆయనకే చెల్లింది. ఆ తరువాత ప్రభుత్వంతో పాటు అతనూ ఓడిపోయినా కూడా.. అయన జోరు తగ్గకపోయేసరికి పోలీస్ కేసుల్లో పడ్డారు. మళ్ళీ బయటకు వచ్చాక అదే దూకుడు చూపడం మొదలైంది. మొన్నటికి మొన్న తన వ్యవసాయ భూముల్లో మేకలు మేస్తున్నాయని కొందరు మేకలకాపరులమీద దాడి చేయడమే కాకుండా రెండు మేకలు సైతం తన కార్లో ఎత్తుకెళ్ళి తనకు ఎదురే లేదని మరోమారు చాటిచెప్పారు. అది కాస్తా వివాదంగా.. యాదవులు సంఘటితమై గళం ఎత్తేసరికి ఆయన కాస్త వెనక్కితగ్గారు. ఇదిలా ఉండగా ఆయనకు మళ్ళీ దెందులూరు టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇది కాస్తా చింతమనేని ప్రభాకర్‌కు ఇబ్బందికరంగా మారింది. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి మీద ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికలకోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు ఇలా వ్యతిరేకపవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. మరి చంద్రబాబు ఆయనను మారుస్తారో.. కొత్తవాళ్లను తీసుకొస్తారో.. లేదా 'రౌడీలకు టిక్కెట్లు ఇవ్వకపోతే ఎలా ? వాళ్ళే కదా అసలైన నాయకులూ' అని భావించి మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారో చూడాలి. -- సిమ్మాదిరప్పన్న ఇవి చదవండి: చంద్రబాబు.. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన ఫైర్