Denduluru Assembly Constituency
-
టీడీపీ Vs జనసేన.. తారాస్థాయికి వర్గ విభేదాలు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ-జనసేనలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొల్లేరు గ్రామాల్లో జనసేన నాయకులపై టీడీపీ నేతల వరస దాడులకు తెగబడుతున్నారు. పెన్షన్ల పంపిణీ అంశంలో టీడీపీ నేతలే పంచి పెట్టాలని ఎమ్మెల్యే చింతమనేని హుకుం జారీ చేశారు. ప్రశ్నించిన జనసేన నేతలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తన అనుచరులతో దాడి చేయించి కేసులు పెట్టించారు.కొల్లేరులో టీడీపీ నేతల ఆగడాలు పెరిగిపోయాయంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు పట్టాలంటే ఎమ్మెల్యేకు ఎకరాకు లక్ష కట్టాలంటూ కొల్లేరు వాసులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రౌడీ మూకలతో జనసేన నాయకులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.నేడు జిల్లాలో పర్యటించనున్న పవన్‌కల్యాణ్‌ను కలిసి చింతమనేని తీరుపై నియోజకవర్గ ఇన్ చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి ఫిర్యాదు చేయనున్నారు. కొన్ని అరాచక శక్తులు జనసేనలో చేరాయంటూ చింతమనేని వ్యాఖ్యానించారు. కొత్తగా పార్టీలో చేరి పెత్తనం చలాయిస్తే ఊరుకోమని.. పెన్షన్ పంపిణీకి, అలాంటి వారికి ఏం సంబంధం అంటూ చింతమని హెచ్చరించారు. -
చింతమనేని దాష్టీకంపై భగ్గుమంటున్న దెందులూరు
ఏలూరు, సాక్షి: ఎన్నికల వేళ.. దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ సంక్షేమ ప్రభుత్వం గురించి మాట్లాడిన దళితులపై తన అనుచరులతో దాడి చేయించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. క్షతగాత్రులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చింతమనేని తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. శుక్రవారం పెదవేగి మండలం లక్ష్మీపురం కూచిపూడి రామసింగవరం గ్రామాల్లో చింతమనేని, తన అనుచరులతో ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో యర్ర చంటిబాబు అనే యువకుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కోపోద్రిక్తులైన చింతమనేని అనుచరులు అతనిపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన మరికొందరు యువకులపైనా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ ఐదుగురు యువకుల్ని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరిలు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఆస్పత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. చింతమనేనిపై దెందులూరు ప్రజానీకం, దళిత సంఘాలు ఆగ్రహం వెల్లగక్కుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చాయి. మరోవైపు ఈ ఉదయం దాడి ఘటనపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ‘‘చింతమనేని ఏమాత్రం విలువల్లేని నాయకుడు. చింతమనేని తన హయాంలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. 93 కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్. ఎన్నికల ప్రచారంలోనూ తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోలేదు. దెందులూరులో గొడవలతో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.... ప్రచారంలో భాగంగా దళితవాడలోకి వెళ్లి మరీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. సీఎం జగన్ హయాంలోనే తనకు మంచి జరిగింది అన్నందుకు ఓ దళిత యువకుడిపై బూతులు తిడుతూ దాడి చేయించాడు. అతని కన్నతల్లిని దుర్భాషలాడారు. ఆ యువకుల్ని చంపే ప్రయత్నం చేశారు. ఇలాంటి వ్యక్తికి బీఫామ్ ఇచ్చారు చంద్రబాబు. చంద్రబాబు ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?. దళిత యువకులపై దాడి హేయనీయం. చింతమనేని అరాచకాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. చింతమనేని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి. దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ‘చింతమనేని.. ఎవరి పేగులు లాగేస్తావ్?. ఇలాంటి ప్రవర్తనను కొనసాగిస్తే నువ్వు ప్రచారం చేయలేవ్. ప్రజలపై విశ్వాసం లేని మూర్ఖుడివి నువ్వు. చంద్రబాబూ.. చింతమనేనిని ఎన్నికల ప్రచారానికి పంపావా? లేదంటే దళితులపై దాడిచేయమని పంపవా?.. చింతమనేని.. ఇక నుంచి దెందులూరులోని ప్రజలు గ్రామాల్లోకి రానియకుండా నిన్ను కట్టడి చేస్తారు. జాగ్రత్త.. చంద్రబాబు, చింతమనేని ఇద్దరూ బాధితులకు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హెచ్చరించారు. -
'సిద్ధం' సభ సూపర్ హిట్..! ప్రత్యర్థులు ఫట్..!!
'మళ్లీ చారిత్రక విజయానికి మీరంతా సిద్దమా..? అవును సిద్దమే..!' ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దెందులూరు 'సిద్దం' సభలో ఈ ప్రశ్న వేయగానే, మొత్తం ఆ ప్రాంతం అంతా సిద్దమే అంటూ ప్రతిధ్వనించింది. అది ఒక రణనినాదంగా మారుమోగింది. వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం మూడు జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన సభకు తరలి వచ్చిన వారిని చూస్తే ప్రత్యర్ధి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తవలసిందే. సభ ప్రాంగణంలో ఎంత మంది ఉన్నారో, అంతకు మించి రోడ్డుమీద నిలబడిపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. జాతీయ రహదారికి సంబంధించిన విజువల్స్ చూస్తే సభకు వచ్చిన బస్‌లు, రోడ్లపై ఉన్న జనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. అక్కడకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ జంక్షన్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. ఇంకా చాలామంది జంక్షన్ నుంచి వెనుదిరగవలసి వచ్చింది. అలాగే రెండో వైపున కూడా జనం కిటకిటలాడారు. అయినా యధా ప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర తెలుగుదేశం మీడియా సంస్థలు ఏడుపుగొట్టు వార్తలు రాసి ఆత్మ సంతృప్తి చెందాయి. వారి ఆత్మవంచనను పక్కనబెడితే ఈ సభ సూపర్ హిట్ అయిందన్నది వాస్తవం. ఎక్కడైతే టీడీపీ, జనసేనలు తమకు బాగా బలం ఉందని అనుకుంటున్నాయో, అక్కడే ఈ రకంగా కార్యకర్తలు తండోపతండాలుగా తరలివస్తే, అదే ప్రజానీకంతో భారీ బహిరంగ సభ పెడితే అది ఇంకెలా ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. లక్షల మందితో సభలు పెట్టడం జగన్మోహన్రెడ్డికు కొత్తకాదు. గతంలో ప్లీనరీ సందర్భంగా కూడా కిలోమీటర్ల కొద్ది జనం నిలబడిపోయిన ఘట్టాలు కూడా చూశాం. ఈసారి ఎన్నికల ముందు జరుగుతున్న ఈ సిద్దం సభలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. భీమిలిలో విజయవంతమైన సభ తర్వాత అంతకు కొన్ని రెట్ల కార్యకర్తలతో దెందులూరు సభ జరగడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలలో ఉత్సాహం ఇనుమడించిందని చెప్పాలి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో కాపు సామాజికవర్గం అధికంగా ఉంటుంది. వారి మద్దతు తనకు లభిస్తుందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఆశిస్తున్నారు. కాని ఆయన ఎప్పుడైతే చంద్రబాబు పల్లకి మోయడానికి సిద్దమయ్యారని తెలుసుకున్నారో, కాపు వర్గం అంతా మళ్లీ ఎవరి పార్టీలోకి వారు వెళ్లిపోయారని బీజేపీ సీనియర్ నేత పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో వైఎస్ఆర్సీపీ బాగా పుంజుకుందని చెబుతున్నారు. ఒకవైపు ఎస్సీ, బీసీ వర్గాల అండదండలు, మరో వైపు కాపు వర్గం గతంలో మాదిరి వైఎస్ఆర్సీపీ పక్షానికి తిరిగి వచ్చేయడంతో ఈ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో విజయావకాశాలు బాగా పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ రెండు జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో సైతం వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని అంచనాలు వేస్తున్నారు. దెందులూరు సభ బ్రహ్మండంగా విజయవంతం అవడం దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. పార్టీ నేతలు రవాణా సదుపాయం ఏర్పాటు చేసి ఉండవచ్చు. కాని ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే సభకు హాజరైన క్యాడర్లో కనిపించిన స్పందన. జగన్మోహన్రెడ్డి మీరు సిద్దమా అని ప్రశ్నించినప్పుడల్లా అవును సిద్దమే అని పెద్ద ఎత్తున బదులు చెబుతూ వచ్చారు. మీ బిడ్డ అని ఆయన అనగానే, జగన్మోహన్రెడ్డి అని కార్యకర్తలు నినదించారు. సభ ఆరంభంలో, తిరిగి ముగింపులోను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాక్‌వే గుండా జగన్మోహన్రెడ్డి అందరికి అభివాదం చేసుకుంటూ వెళుతున్నప్పుడు కార్యకర్తలు జండాలు ఊపిన వైనం, జేజేలతో హోరెత్తించిన తీరు చూశాక టీడీపీ, జనసేన పక్షాల నేతలకు దిమ్మదిరిగినంత పని అయింది. గత నాలుగేళ్లుగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి ఎల్లో మీడియా సంస్థలతో ఎంత విష ప్రచారం చేసినా, ప్రతిపక్షంగా ఉంటూ టీడీపీ, జనసేన అధినేతలు ఎన్ని అబద్దాలు చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదనడానికి ఈ సభ ఉదాహరణ అవుతుంది. ఇక జగన్మోహన్రెడ్డి సైతం తన స్పీచ్‌లో పంచ్ డైలాగులు, పదునైన వ్యాఖ్యలతో అదరగొట్టారు. మంచి ఉచ్చస్వరంతో ఆయన స్పీచ్ ఇస్తున్నంతసేపు జనం ఉర్రూతలూగుతూ మద్దతు ఇవ్వడం స్పష్టంగా కనిపించింది. మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలను ప్రస్తావిస్తూ విపక్షంపై జగన్మోహన్రెడ్డి చెలరేగిపోయారంటే అతిశయోక్తి కాదు.. ప్రస్తుతం అమలు అవుతున్న వివిధ సంక్షేమ పధకాలు యధావిధిగా కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరిగి రావల్సిన అవశ్యకతను ప్రజలకు వివరించాలని జగన్మోహన్రెడ్డి క్యాడర్‌ను కోరారు. ఈ ఏభై ఏడు నెలల్లో మీ బిడ్డ 124 సార్లు బటన్ నొక్కారని, ప్రజలు రెండు బటన్లను ఒక్కోసారి నొక్కి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరడం విశేషం. తను అమలు చేస్తున్న సంక్షేమ స్కీములపై ఆయనకు ఉన్న విశ్వాసాన్ని ఈ మాటలు తెలియచేస్తాయి. ఈసారి జగన్మోహన్రెడ్డి సినిమా సన్నివేశాలను కూడా వాడారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును చంద్రముఖి సినిమా పాత్రతో పోల్చి అందరిని నవ్వించారు. 'అంతేకాక 2019 ఎన్నికలలో చంద్రముఖిని ఓట్ల పెట్టెలలో బంధించారని, ఈసారి దానిని రానివ్వకుండా చూస్తే రాష్ట్రానికి చంద్రముఖి బెడద శాశ్వతంగా పోతుందని, చంద్రగ్రహణాలు ఉండవని చెప్పడం ద్వారా ఈ ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే, దానికి భవిష్యత్తు ఉండదని ఆయన పరోక్షంగా జోస్యం చెప్పారు. చంద్రముఖి బెడదను వదలించుకోకపోతే మళ్లీ నిద్ర లేస్తుందని, సైకిలెక్కి టీ గ్లాస్ పట్టుకుని లకలక అంటూ ప్రజల రక్తం తాగడానికి సిద్దం అవుతుందని ఆయన హెచ్చరించారు.' టీడీపీ, జనసేన పొత్తును అంటే ప్రజల రక్తం తాగడానికే అని ఆయన ప్రజలకు చెప్పదలిచారన్నమాట. కాంగ్రెస్‌పై కూడా ఘాటైన విమర్శలు చేయడం గమనార్హం. రాష్ట్రానికి కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందని ఆయన అన్నారు. ఇది ఎవరికి తగులుతుందో అందరికి తెలుసు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చేసింది ఏమీ లేక పొత్తుల జిత్తులతో ప్రజల ముందుకు వస్తున్నారని ఆయన ఎద్దేవ చేశారు. 'రా కదలిరా.. అన్న టీడీపీ నినాదాన్ని అపహాస్యం చేస్తూ ప్యాకేజీ కోసం రా... కదలిరా' అని దత్తపుత్రుడిని పిలుస్తున్నారని జగన్మోహన్రెడ్డి అన్నప్పుడు సభికులలో విశేష స్పందన కనిపించింది. ఈ ఒక్కడిమీద దేశంలోని బలమైన పది వ్యవస్థలను ప్రయోగించినా, బెదరకుండా ప్రజలు మోసిన జెండా ఇది అని అంటూ వైఎస్ఆర్సీపీ బలాన్ని, ధైర్యాన్ని ఆయన తెలియచెప్పారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కలిసి తనపై పెట్టిన అక్రమ కేసుల గురించి జగన్మోహన్రెడ్డి పరోక్షంగా ప్రస్తావించారు. తన ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ స్కీములతో పాటు, ఈ సభలో ఆయన పోర్టులు, మెడికల్ కాలేజీలు తదితర అభివృద్ది పనుల గురించి కూడా ప్రస్తావించారు. కాగా కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వం నిర్వర్తించిన సేవల గురించి కూడా ప్రజలకు గుర్తు చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి స్పీచ్, వచ్చిన జనం.. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏమనిపిస్తుందంటే జగన్మోహన్రెడ్డి చెబుతున్నట్లు చారిత్రక విజయం మరోసారి వైఎస్ఆర్సీపీకి రాబోతుందన్న విశ్వాసం ఏర్పడుతుంది. అదే ఆత్మస్థైర్యం, మనో ధైర్యం వైఎస్ఆర్సీపీ క్యాడర్లో స్పష్టంగా కనిపించింది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుంటున్నాయి’
ఏలూరు: దెందులూరులో శనివారం జరిగిన వైఎస్సార్సీపీ ‘సిద్ధం సభ’కు గోదావరి, కృష్ణ నదులు ఉప్పొంగినట్టుగా ప్రజలు తరలివచ్చారని వైఎస్సార్సీసీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తామంతా జగనన్నను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. పాత్రికేయులకు జరిగిన చిన్న అసౌకర్యానికి మన్నించాలని కోరుతున్నామన్నారు. దెందులూరులో జరిగిన ‘సిద్ధం సభ’ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారిందని తెలిపారు. భీమిలి సభ ట్రైలర్ అయితే నిన్న(శనివారం) దెందులూరు సభతో ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి అయితే లబ్ధి చేకూరిందో వారే తమ స్టార్ క్యాంపెనర్లలని సీఎం జగన్ సూచించారని అన్నారు. వై నాట్ 175 అనేది.. నిన్నటి సభతో ప్రతిపక్షాలకు అర్థమై ఉంటుందని అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే నినాదం సభలో ప్రజల నోట వినబడిందని తెలిపారు. ఈ 60 రోజులు ప్రతి కార్యకర్త కష్టపడదామని సీఎం జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందామని అనేక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు నేతలు సూట్ కేసులు సర్దుకుని హైదరాబాద్ వెళతాయని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పటికే హైదరాబాదులో ఉంటున్నారని మండిపడ్డారు. కుప్పం టూ ఇచ్చాపురం మా అభ్యర్థులు ఎవరో చెప్పాం.. మా ఎజెండా ఏంటి.. మా జెండా ఏంటి.. అనేది స్పష్టం చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు కరువై.. ప్రతిపక్షాలు పొత్తులకు వెళుతున్నాయని ఎద్దేవా చేశారు. -
జగన్ ఏనాడూ ఒంటరి కాదు.. కౌరవ సైన్యంపై యుద్ధానికి సిద్ధమా?
ఏలూరు, సాక్షి: ఎన్నికల రణ క్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర అయితే.. నాది అర్జునుడి పాత్ర అని ముఖ్యమంత్రి దెందులూరు సిద్ధం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే.. ఆ ప్రేమ ఎలా ఉంటుందో అనేందుకు ఇదే నిదర్శనం అని పేర్కొన్నారాయన. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పార్టీ కేడర్‌ను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా?. ఇంటింటి చరితను.. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనా? అని సీఎం జగన్ కేడర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పేదల భవిష్యత్తులను, పేదల్ని కాటేసే యెల్లో వైరస్ మీద.. కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయంపై సంగ్రామానికి ప్రతీ ఒక్కరూ సిద్ధమేనా? అని సీఎం జగన్ ప్రసంగించారు. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్ కో రూపంలో ఉన్నారు. ఓ చంద్రబాబు రూపేణా, ఓ ఈనాడు రూపేణా, ఓ ఆంధ్రజ్యోతి రూపేణా, ఓ టీవీ5 రూపేణా, ఓ దత్తపుత్రుడి రూపేణా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టులు.. ఇంత మంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. వాళ్లు.. ఆ తోడేళ్ల మంద వైపు నుంచి చూస్తే ఈ సీన్ చూస్తుంటే జగన్ ఒంటరి వాళ్లలా కనిపిస్తాడు. కానీ, నిజం ఏంటంటే.. ఇక్కడ జగన్ ఏనాడూ ఒంటరి కాదు. నిజం ఏమిటి అంటే ఇక్కడ కనిపిస్తున్నది నిజం. ఇదీ అసలు సీను. ఇన్ని లక్షల హృదయాల్లో కోట్ల మంది హృదయాల్లో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండటం.. ఇదీ నిజం. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులు అయితే.. వారి యెల్లో పత్రికలైతే.. వారి యెల్లో టీవీలు అయితే.. నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న దేవుడు.. ఈ ప్రజలు అని సీఎం జగన్ భావోద్వేగంగా పేర్కొన్నారు. ఇది నాయకుడి మీద నమ్మకం నుంచి పుట్టిన సైన్యం. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే.. ప్రజల ప్రేమ ఎలా ఉంటుందో అనేందుకు ఇదే నిదర్శనం. నా కుటుంబ సైన్యమంతా ఇక్కడ కనిపిస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. జరగబోయే ఎన్నికల రణ క్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరూ(ప్రజలు).. అర్జునుడిని నేను, చేసిన మంచినంతా అస్త్రాలుగా మల్చుకుని కౌరవ సైన్యం మీద యుద్ధం చేద్దామంటూ పిలుపు ఇచ్చారు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే.. మన సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి మీద, అభివృద్ధి మీద. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మీకోసం ఏం చేశాడు? ఏనాడైనా ఒక్క రూపాయి అయినా వేశాడా? అని దెందులూరు సిద్ధం వేదిక నుంచి ప్రతిపక్ష నేతను సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. ‘‘నా మాటలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరితో పంచుకోవాలి. మీ గ్రామాల్లో ఇళ్లకు వెళ్లినప్పుడు ఆ ఇంట్లో అడగండి.. 1995లో సీఎం అయిన చంద్రబాబు.. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు.. 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు.. మీ ఇంటికి గానీ, మీ ఊరికి గానీ, మీ సామాజికవర్గానికి గానీ, మీ కుటుంబ భవిష్యత్ కు గానీ ఏం చేశాడు అని అడగండి. అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా వారి బ్యాంకు అకౌంటు వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. చంద్రబాబు 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో 5 సంవత్సరాలు.. బ్యాంకు అకౌంటు వివరాల్లో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడిందో అడగండి. చంద్రబాబు పాలనలో పేద కుటుంబానికి బ్యాంకు అకౌంటుకు ఇచ్చింది ఎంత అని అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు హయాంలో ఏమున్నాయి అని అడగండి. బాబు పాలనలో ఏనాడైనా ఒక్క రూపాయి అయినా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడగండి. 1994లో గానీ, 1999లో గానీ, 2014లో గానీ చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏనాడైనా 10 శాతం అయినా అమలు చేశాడా అని ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలను అడగండి. మరోవంక.. మీ జగన్ పాలన, మీ బిడ్డ పాలన చూడండి అని మళ్లీ అడగండి. ఈ 57 నెలల మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ ఏం చేశాడో కొన్ని అంశాలను వివరిస్తా. ఈ తేడాను ప్రతి ఇంట్లో వివరించండి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామమైనా తీసుకోండి. ఏ పట్టణాన్ని తీసుకున్నా ఆ గ్రామానికి వెళ్లి నాలుగు అడుగులు వేస్తే గతంలో లేనిది, మన గ్రామంలోనే ఈరోజు కనిపించేది విలేజ్ సెక్రటేరియట్. ఒక వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది. ఎవరు పెట్టారంటే.. మీ జగన్. మన వైఎస్సార్ సీపీ పార్టీ. ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి వార్డు సచివాలయంలో కనీసం అంటే 540 రకాల సేవలు అందిస్తూ, అందులో దాదాపు 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారంటే.. మీ జగన్. మన వైయస్సార్ సీపీ. జరిగిన అభివృద్ధిని కళ్లారా చూస్తూ.. ‘‘మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమలో నిలబడి ఉన్నా. ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామ గ్రామంలో తెచ్చిన మార్పు. లంచాలు, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం. వీటన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేరాఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పడానికి అన్ని అంశాలనూ పంచుకొనేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు.. 25కు 25 ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు మీ వాడిగా మీ ముందుకు వచ్చి నా మనసు పంచుకుంటున్నా. ►ప్రతీ నెలా 1వ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపుతట్టి ప్రతి అవ్వాతాతకు మంచి మనవడిలా, మనవరాలిలా, ప్రతి వితంతు, వికలాంగుడికీ ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి చేతిలో పెడుతున్న 3 వేల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. చేసినది మన వైఎస్సార్ సీపీ. . లంచాలు, వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు.. ఆరోజుల నుంచి ఈరోజు ఏ గ్రామంలో కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారంటే.. మీ జగన్. తెచ్చింది మన వైయస్సార్ సీపీ. డీబీటీ ద్వారా బటన్ నొక్కి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతున్నది ఎవరు అంటే.. మీ జగన్. చేస్తున్నది మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం. ►ఈరోజు ప్రతి గ్రామంలో గవర్నమెంట్ బడి, ప్రభుత్వ ఆస్పత్రి మారటానికి నాడు-నేడు చేస్తున్నది ఎవరు అంటే.. మీ జగన్. వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, గవర్నమెంట్ బడుల్లో పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు కనిపిస్తున్నాయంటే, ఈరోజు డిజిటల్ బోధనతో, క్లాస్ రూముల్లో ఐఎఫ్‌పీలు కనిపిస్తున్నాయంటే, బడులకు వెళ్లినప్పుడు, పిల్లల్ని చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. చేసినది మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే. ►రాష్ట్రంలో రైతన్నను చేయిపట్టుకొని నడిపించే ఆర్బీకేను తీసుకొచ్చింది ఎవరు అంటే మీ జగన్. రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తున్నది ఎవరంటే మీ జగన్. చేస్తున్నది, ఎప్పటి నుంచి మొదలైంది అంటే మన వైయస్సార్ సీపీ వచ్చిన తర్వాతే. పేదలు, రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద 22ఏ భూముల మీద 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్. జరిగింది ఎప్పుడంటే వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఈ 57 నెలల్లోనే అందించిన రూ.2.55 లక్షల కోట్లలో 75 శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం చూపనంతగా ఈ పేద వర్గాల సంక్షేమం, అభివృద్ధి పట్ల, మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ప్రేమ, అభిమానం, కమిట్ మెంట్ చూపింది ఎవరంటే మీ జగన్. జరిగింది మంచి ఎప్పుడంటే.. మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ►నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు చట్టం చేసి మరీ ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్. జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. కేబినెట్లో 68 శాతం మంత్రి పదవులు నానానానా అంటూ నేను పిలుచుకొనే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ పిలుచుకొనే నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు దక్కింది మీ బిడ్డ పాలనలో. నలుగురు డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్ పర్సన్ మొదలు.. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి నానానా అని పిలుచుకుంటూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నది ఎప్పుడంటే మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే. ►ఈ ప్రేమ ఉంది కాబట్టే.. రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడనంత వరకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. ఇందులో 80 శాతం నానానానా అని పిలుచుకొనే నా చెల్లెమ్మలు, తమ్ముళ్లు కనిపిస్తున్నారంటే ఇది జరిగింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే, వైయస్సార్ సీపీ పాలన వచ్చిన తర్వాతే. అక్కచెల్లెమ్మలకు లక్షాధికారిని చేయాలి, గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చింది ఎవరంటే మీ జగన్. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నది ఎవరంటే మీ జగన్. మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ►నా అక్కచెల్లెమ్మలను ప్రతి రంగంలో ముందడుగు వేయాలని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి ఇస్తున్నది ఎవరంటే మీ జగన్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే. అక్కచెల్లెమ్మలు పిల్లల్ని బడులకు పంపిస్తే చాలు అమ్మ ఒడి, పిల్లలకు తోడుగా ఉంటూ విద్యా దీవెన, వసతి దీవెన, ఓ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ.. ఓ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, మహిళా సాధికారత, దిశ యాప్ అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ►ఆ గ్రామానికి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడంటే కారణం, ప్రతి ఇంట్లోనూ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తూ,వైద్యం ఇంటికొచ్చి మందులిచ్చే పరిస్థితి ఉందంటే కారణం.. మీ బిడ్డ. జరుగుతున్నది మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. 108, 104, ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్ష్ మెంట్ తీసుకొచ్చింది మహానేత దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేయిస్తున్నది, కదులుతున్నది, అమలు జరుగుతున్నది మీ బిడ్డ హయాంలో, వైయస్సార్ సీపీ పాలనలో. ►కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, కొత్త ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఉన్నవి విస్తరణ జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లు ఉరుకులు పరుగులు చేస్తున్నాయి. పారిశ్రామిక వ్యక్తులు, సంస్థలు లైను కడుతున్నాయి. జరుగుతున్నది మీ బిడ్డ పాలనలో, మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. నేను చెప్పిన ప్రతి విషయం వాస్తవం అవునా కాదా అని ఆలోచన చేయాలి. ప్రతి ఇంటికీ వాస్తవాలను తీసుకొని పోవాలి. 2019లో మనం అధికారంలోకి రాక ముందు ఏ ప్రభుత్వం అయినా ఇది సాధ్యపడుతుందా? అసాధ్యం అనుకున్న పనులన్నీ సాధ్యం చేయగలిగాం. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయినీ కూడా ఎలాంటి లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా నేరుగా పేదలకు వారి చేతికి అందించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే.. కాదు.. అది సాధ్యమే ఒక్క జగనన్న పాలనలో అది సాధ్యమే అని దేశానికే చూపించగలిగాం. ►ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తున్న ఇంటింటి మంచి మీద, అభివృద్ధి మీద, పేద వాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు దాడి చేస్తున్నారు. ఈరోజు మన పెత్తందార్లంతా కూడా ఎవరి మీద దాడి చేస్తున్నారో ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడునేడుతో మారుస్తున్న స్కూళ్లు, హాస్పిటళ్లు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ దండ యాత్ర చేస్తోంది. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి, చెండాటానికి మళ్లీ మన వైయస్సార్ సీపీ ప్రజా సైన్యం, మన కేడర్, మన లీడర్లు, మన అభిమానులు, నా కుటుంబ సభ్యులైన మీరంతా మరొక్కసారి అడుగుతున్న సిద్ధమేనా?.. అని పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగం కొనసాగించారు. -
LIVE : దద్దరిల్లిన దెందులూరు.. YSRCP సిద్ధం సభ లైవ్
ఏలూరు జిల్లా దెందులూరు లో వైఎసార్సీపీ ' సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగం సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్ మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా పేదల భవిష్యత్తును మరింతగా మార్చేందుకు మీరు సిద్ధమా దుష్టచతుష్టం మీద యుద్దానికి మీరు సిద్ధమా రామాయణం, మహా భారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు కానీ నిజం ఏంటంటే .. కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడు జగన్ ఏనాడు ఒంటరి కాదు .. వారికున్న సైన్యం, పొత్తులు, ఎల్లో మీడియా అయితే .. నాకున్న సైన్యం, బలం, దేవుడు ప్రజలే నాకున్న నమ్మకం మీరే ఇక్కడ కనిపిస్తున్న జనమే నాకున్న బలం వచ్చే రణక్షేత్రంలో మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే .. అర్జునుడిని నేను చంద్రబాబు, ఎల్లో మీడియా ఏకమై కుట్ర చేస్తున్నారు మనం చేస్తున్న సంక్షేమం, మంచిపై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి మనం 99 శాతం హామీలు నెరవేర్చాం పేదవాడి భవిష్యత్తు సంక్షేమం మీద వారంతా దాడి చేస్తున్నారు రాబోయే తరం విద్యావిధానాల మీద దుష్ట చతుష్టయం దాడి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది దుష్టచతుష్టయం దాడి అంతా అభివృద్ధి, సంక్షేమం మీదనే గ్రామగ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం 175 కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం నా మాటలన్నీ ప్రతి ఇంటికి వెళ్లి పంచుకోవాలని కోరుతున్నా 14 ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు మీకు ఏం చేశారో అడగండి చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాను గమనించండి పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేశారో అడగండి చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీమ్ లు ఏమున్నాయో అడగండి చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడమే చంద్రబాబు పని బాబు పాలనలో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా పడిందా ? చంద్రబాబు మేనిఫెస్టో లో 10 శాతం హామీలైనా నెరవేర్చాడా ? మీ బిడ్డ జగన్ పాలనను గమనించండి చంద్రబాబు పాలనకు, జగన్ 57 నెలల పాలనకు తేడాను గమనించండి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామానైనా తీసుకోండి గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లో వచ్చిన మార్పులు గమనించండి ఈ వ్యవస్థను ఎవరు తీసుకోచ్చారంటే జగన్ అని చెప్పండి ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతలకు పింఛన్ అందిస్తున్నాం లంచాలు, వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు పోయాయి ఇవాళ ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా వ్యవస్థలను తీసుకొచ్చాం గ్రామ సచివాలయాల్లో 500 లకు పైగా సేవలందిస్తున్నాం నాడు నేడు ద్వారా ఆస్పత్రులు, స్కూళ్ల రూపురేఖలు మార్చాం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ విధానాన్ని తీసుకొచ్చాం ఆర్బీకే ల ద్వారా రైతులకు అండగా నిలబడ్డాం రైతులకు శాశ్వత భూహక్కులు కల్పించాం రూ. 2లక్షల 55 వేల కోట్లలో 75 శాతం వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం కేబినెట్ లో 68 శాతం మంత్రి పదవులు వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం 4 డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్ తో సహా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం అమలు చేశాం 2 లక్షల 13 వేల ఉద్యోగాలిచ్చాం .. ఇందులో 80 శాతం వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం మీ బిడ్డ జగన్ పాలనలోనే ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పేందుకు గర్వపడుతున్నా దిశ యాప్ తో అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం అక్కచెల్లెమ్మలకు ఆర్ధిక స్వావలంబన అందించాం ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ 15 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్ లు నిర్మాణంలో ఉన్నాయి 2019 కి ముందు ఏ సంక్షేమం జరిగిందో చంద్రబాబును అడగండి కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నాం మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ పాలన అందిస్తున్నాం ఎన్నికల మేనిఫెస్టో కు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ జగనే మేనిఫెస్టో లో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చాం అబద్దాల పునాదులపై ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాయి వచ్చే ఎన్నికలు .. పేదల భవిష్యత్ ను నిర్ణయించేవి రూ. 3 వేల పెన్షన్ అందాలన్నా .. భవిష్యత్ లో పెరగాలన్నా .. మీ జగనే రావాలి ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి చెప్పాలి పేద పిల్లల భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు ఇవి ప్రతి అవ్వాతాత, ప్రతి పేదవాడి భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు ఇవి పేదల సొంతింటి కల నెరవేరాలంటే జగనన్నే కావాలని చెప్పండి 57 నెలల్లో మీ బిడ్డ 124 సార్లు బటన్ నొక్కాడు మంచి చేసిన ప్రభుత్వానికి అండగా నిలవాలని చెప్పండి జగనన్న కోసం మనం బటన్ నొక్కాలని ఇంటింటికి వెళ్లి చెప్పండి మీరు నా కోసం ఒక్కసారి బటన్ నొక్కండి ఒకటి అసెంబ్లీ, ఒకటి పార్లమెంట్ కు ఫ్యాన్ మీద నొక్కితే చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా ఉండదు పేదల రక్తం తాగేందుకు వస్తున్న చంద్రగ్రహణాలను సాగనంపండి ప్రతి పక్షాలకు ఓటు వేయడం అంటే మళ్లీ లంచాలకు అవకాశం ఇవ్వడమేనేని చెప్పండి జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదని ప్రతి ఇంటిలోనూ చెప్పండి జగనన్నకు కుట్రలు చేసే అలవాటు లేదని ప్రతి ఇంట్లోనూ చెప్పండి ప్యాకేజీ కోసం రా .. కదలి రా అంటూ బాబు .. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు చంద్రబాబు అండ్ కో .. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ 175 స్థానాల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులే లేరు చంద్రబాబు అండ్ కో పై యుద్దానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ కు ఏపీతో ఏం సంబంధం ? దిగజారుడు పార్టీలన్నీ పేదవాడి భవిష్యత్తునే టార్గెట్ చేసుకుంటున్నాయి వీరితో యుద్దానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా ? ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ వైఎసార్సీపీ ప్రజలకు మంచి చేయగలిగాం కాబట్టే ఓటు వేయమని అడుగుతున్నా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎసార్సీపీ పార్టీలోని ప్రతీ కార్యకర్తకూ అండగా ఉంటామని చెబుతున్నా మీకు మరింత మంచి చేసే బాధ్యత నాది వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175 కి 175 అసెంబ్లీ స్థానాలు -
వైఎస్సార్సీపీలో ఫుల్ జోష్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లాలో ఫుల్‌జోష్‌తో కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా స్థానిక పరిస్థితులు, సమీకరణలకు అనుగుణంగా జిల్లాలో అభ్యర్థుల మార్పులు, చేర్పుల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన పార్టీ ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం, నూతన అభ్యర్థుల పరిచయ సభ గ్రాండ్ సక్సెస్ కావడం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపింది. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు, పోలవరం అసెంబ్లీ అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మిలను జిల్లా నాయకులు కార్యకర్తలకు పరిచయం చేశారు. ఎన్నికల శంఖారావం పూరించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నవోత్సాహం కదంతొక్కుతోంది. ఇప్పటికే ప్రజల్లోకి.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జులను మార్చింది. మిగిలిన చోట్ల ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్నారు. పాదయాత్రలు చేస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఐదేళ్లలో తాము చేసిన పనులను వివరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గడపగడపకూ చేకూరిన లబ్ధిని చెబుతున్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఈనెల 30వ తేదీకల్లా నియోజకవర్గ స్థాయి సమావేశాలు ముగిసేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న చింతలపూడి ఇన్చార్జి కంభం విజయరాజు, పోలవరం ఇన్చార్జి తెల్లం రాజ్యలక్ష్మి ఇప్పటికే వారం రోజులుగా నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తున్నారు. ఇక ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఆదివారం నుంచి పార్లమెంట్ పరిధిలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. టీడీపీలో అనిశ్చితి ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో రాజకీయ అనిశ్చితి తారాస్థాయికి చేరింది. పొత్తుల గందరగోళం ఒక వైపు, టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయ లోపం మరోవైపు ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏలూరు ఎంపీ టికెట్‌ను ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఆశిస్తున్నా స్పష్టత లేకపోవడం పొత్తుల్లో జనసేనకు ఇచ్చే స్థానాలు తేల్చకపోవడంతో రెండు పార్టీల నేతల్లో రాజకీయ నైరాశ్యం నెలకొంది. ఇక దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ సమన్వయకర్త చింతమనేని ప్రభాకర్ యథావిధిగా హల్చల్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు చింతమనేని వద్దు–ఎవరైనా ముద్దు అనే పేరుతో నిరసన సమావేశం నిర్వహించినప్పటి నుంచి ఆయన తీవ్ర ఆందోళనకు గురై టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలపై నోరుపారేసుకుంటున్నట్లు సమాచారం. కైకలూరు, నూజివీడు, పోలవరంలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్లమెంట్ స్థానానికో సభ నిర్వహిస్తున్నా అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా ముఖ్యనేతలు ఖర్చుకు ముందుకురాని పరిస్థితి. అయితే జనసేన, టీడీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియా వార్ కొనసాగిస్తున్నాయి. ఏ పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తాయో పోస్టులు షేర్ చేస్తూ గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి. -
పరువు పోతుంది.. చింతమనేనికి టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్‌పై టీడీపీలోని ఓ వర్గం రగిలిపోతుండగా, మరోవైపు చింతమనేని వద్దే వద్దని జనసేన నేతలు అంటున్నారు. కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండగా, తనకు టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఓడిస్తానంటూ చింతమనేని బెదిరింపులకు దిగుతున్నారు. చింతమనేని నోటి దురుసుతో పార్టీ పరువు పోతుందని.. దెందులూరు టికెట్ చింతమనేనికి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానానికి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన నేత కొఠారు ఆదిశేషుకు దెందులూరు టికెట్ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. మరోవైపు చింతమనేనికి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరిపై ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు ఇలా వ్యతిరేక పవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. -
చింతమనేని సీట్ సిరిగిపోయిందా ?
రౌడీ ఎమ్మెల్యే అనే ట్యాగ్ లైను వేసుకోవడానికి తెగ ఇష్టపడే దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది.. 'ఆయనొద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ తెలుగు తమ్ముళ్లు అక్కడక్కడా ఫ్లెక్సీలు కట్టడం తెలుగుదేశాన్ని.. చంద్రబాబును కలవరపరుస్తోంది. నోటి దురుసుకు చేయి జోరుకు మారు పేరుగా నిలిచిన చింతమనేని గతంలో టీడీపీ హయాంలో ఉన్నపుడు మహా ఉజ్వలంగా వెలిగిపోయారు. తన దెందులూరు నియోజకవర్గానికి ఆయనే ముఖ్యమంత్రి, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గనులు.. ఇలా అన్ని శాఖలకూ ఆయనే అధిపతి. అడ్డొస్తే అడ్డంగా నరికేసినంత పని చేసేవారు. ఆ దూకుడులో భాగంగానే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని ఈడ్చి కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తరువాత అనుమతులు లేకుండా అడవీ భూముల్లో రోడ్లు వేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. అంతేకాకుండా అధికారంలో ఉన్నపుడు నోటి దురుసును అడ్డూ అదుపూ లేకుండా పోయేది. 'ఏంటీ పవన్ కళ్యాణ్ మద్దతుతో కదా మీరు గెలిచారు' అని అడిగితే.. 'హహ.. పవన్.. ఒక సన్నాసి.. సొంత అన్నను పాలకొల్లులో గెలిపించలేనివాడు మా చంద్రబాబును గెలిపిస్తాడా..? ఊరుకోండయ్యా..' అని సెటైర్లు వేశారు. 'ఒరేయ్ మీరు ఎస్సీలు..! మీకెందుకురా రాజకీయాలు..? మేము రాజకీయాలు చేస్తాం' అని ఓపెన్ సభలో చెప్పడం కూడా ఆయనకే చెల్లింది. ఆ తరువాత ప్రభుత్వంతో పాటు అతనూ ఓడిపోయినా కూడా.. అయన జోరు తగ్గకపోయేసరికి పోలీస్ కేసుల్లో పడ్డారు. మళ్ళీ బయటకు వచ్చాక అదే దూకుడు చూపడం మొదలైంది. మొన్నటికి మొన్న తన వ్యవసాయ భూముల్లో మేకలు మేస్తున్నాయని కొందరు మేకలకాపరులమీద దాడి చేయడమే కాకుండా రెండు మేకలు సైతం తన కార్లో ఎత్తుకెళ్ళి తనకు ఎదురే లేదని మరోమారు చాటిచెప్పారు. అది కాస్తా వివాదంగా.. యాదవులు సంఘటితమై గళం ఎత్తేసరికి ఆయన కాస్త వెనక్కితగ్గారు. ఇదిలా ఉండగా ఆయనకు మళ్ళీ దెందులూరు టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇది కాస్తా చింతమనేని ప్రభాకర్‌కు ఇబ్బందికరంగా మారింది. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి మీద ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికలకోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు ఇలా వ్యతిరేకపవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. మరి చంద్రబాబు ఆయనను మారుస్తారో.. కొత్తవాళ్లను తీసుకొస్తారో.. లేదా 'రౌడీలకు టిక్కెట్లు ఇవ్వకపోతే ఎలా ? వాళ్ళే కదా అసలైన నాయకులూ' అని భావించి మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారో చూడాలి. -- సిమ్మాదిరప్పన్న ఇవి చదవండి: చంద్రబాబు.. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన ఫైర్