LIVE : దద్దరిల్లిన దెందులూరు.. YSRCP సిద్ధం సభ లైవ్‌ | YSRCP Siddham: AP CM YS Jagan Cadre Meeting At Denduluru Live | Sakshi
Sakshi News home page

Denduluru YSRCP Siddham Public Meeting Live: వైఎస్సార్‌సీపీ దెందులూరు సిద్ధం సభ

Published Sat, Feb 3 2024 3:17 PM | Last Updated on Sat, Feb 3 2024 5:20 PM

YSRCP Siddham: AP CM YS Jagan Cadre Meeting At Denduluru Live - Sakshi

ఏలూరు జిల్లా దెందులూరు లో వైఎసార్సీపీ ' సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగం

  • సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్
  • మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా
  • ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా
  • పేదల భవిష్యత్తును మరింతగా మార్చేందుకు మీరు సిద్ధమా
  • దుష్టచతుష్టం మీద యుద్దానికి మీరు సిద్ధమా
  • రామాయణం, మహా భారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు
  • ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు
  • కానీ నిజం ఏంటంటే .. కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడు
  • జగన్ ఏనాడు ఒంటరి కాదు .. వారికున్న సైన్యం, పొత్తులు, ఎల్లో మీడియా అయితే .. నాకున్న సైన్యం, బలం, దేవుడు ప్రజలే
  • నాకున్న నమ్మకం మీరే
  • ఇక్కడ కనిపిస్తున్న జనమే నాకున్న బలం
  • వచ్చే రణక్షేత్రంలో మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే .. అర్జునుడిని నేను
  • చంద్రబాబు, ఎల్లో మీడియా ఏకమై కుట్ర చేస్తున్నారు
  • మనం చేస్తున్న సంక్షేమం, మంచిపై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి
  • మనం 99 శాతం హామీలు నెరవేర్చాం
  • పేదవాడి భవిష్యత్తు సంక్షేమం మీద వారంతా దాడి చేస్తున్నారు
  • రాబోయే తరం విద్యావిధానాల మీద దుష్ట చతుష్టయం దాడి చేస్తోంది
  • రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది
  • దుష్టచతుష్టయం దాడి అంతా అభివృద్ధి, సంక్షేమం మీదనే
  • గ్రామగ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది  
  • అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం
  • అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం
  • 175 కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం
  • నా మాటలన్నీ ప్రతి ఇంటికి వెళ్లి పంచుకోవాలని కోరుతున్నా
  • 14 ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు మీకు ఏం చేశారో అడగండి
  • చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాను గమనించండి
  • పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేశారో అడగండి
  • చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీమ్ లు ఏమున్నాయో అడగండి
  • చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు
  • అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడమే చంద్రబాబు పని
  • బాబు పాలనలో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా పడిందా ?
  • చంద్రబాబు మేనిఫెస్టో లో 10 శాతం హామీలైనా నెరవేర్చాడా ?
  • మీ బిడ్డ జగన్ పాలనను గమనించండి
  • చంద్రబాబు పాలనకు, జగన్ 57 నెలల పాలనకు తేడాను గమనించండి
  • కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామానైనా తీసుకోండి
  • గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి
  • సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లో వచ్చిన మార్పులు గమనించండి
  • ఈ వ్యవస్థను ఎవరు తీసుకోచ్చారంటే జగన్ అని చెప్పండి
  • ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతలకు పింఛన్ అందిస్తున్నాం
  • లంచాలు, వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు పోయాయి
  • ఇవాళ ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా వ్యవస్థలను తీసుకొచ్చాం
  • గ్రామ సచివాలయాల్లో 500 లకు పైగా సేవలందిస్తున్నాం
  • నాడు నేడు ద్వారా ఆస్పత్రులు, స్కూళ్ల రూపురేఖలు మార్చాం
  • ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ విధానాన్ని తీసుకొచ్చాం
  • ఆర్బీకే ల ద్వారా రైతులకు అండగా నిలబడ్డాం
  • రైతులకు శాశ్వత భూహక్కులు కల్పించాం
  • రూ. 2లక్షల 55 వేల కోట్లలో 75 శాతం వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం
  • కేబినెట్ లో 68 శాతం మంత్రి పదవులు వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం
  • 4 డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్ తో సహా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం అమలు చేశాం
  • 2 లక్షల 13 వేల ఉద్యోగాలిచ్చాం .. ఇందులో 80 శాతం వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం
  • 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం
  • మీ బిడ్డ జగన్ పాలనలోనే ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పేందుకు గర్వపడుతున్నా
  • దిశ యాప్ తో అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం
  • అక్కచెల్లెమ్మలకు ఆర్ధిక స్వావలంబన అందించాం
  • ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్
  • 15 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్ లు నిర్మాణంలో ఉన్నాయి
  • 2019 కి ముందు ఏ సంక్షేమం జరిగిందో చంద్రబాబును అడగండి
  • కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నాం
  • మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ పాలన అందిస్తున్నాం
  • ఎన్నికల మేనిఫెస్టో కు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ జగనే
  • మేనిఫెస్టో లో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చాం
  • అబద్దాల పునాదులపై ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాయి
  • వచ్చే ఎన్నికలు .. పేదల భవిష్యత్ ను నిర్ణయించేవి
  • రూ. 3 వేల పెన్షన్ అందాలన్నా .. భవిష్యత్ లో పెరగాలన్నా .. మీ జగనే రావాలి
  • ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు
  • జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి
  • ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి చెప్పాలి
  • పేద పిల్లల భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు ఇవి
  • ప్రతి అవ్వాతాత, ప్రతి పేదవాడి భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు ఇవి
  • పేదల సొంతింటి కల నెరవేరాలంటే జగనన్నే కావాలని చెప్పండి
  • 57 నెలల్లో మీ బిడ్డ 124 సార్లు బటన్ నొక్కాడు
  • మంచి చేసిన ప్రభుత్వానికి అండగా నిలవాలని చెప్పండి
  • జగనన్న కోసం మనం బటన్ నొక్కాలని ఇంటింటికి వెళ్లి చెప్పండి
  • మీరు నా కోసం ఒక్కసారి బటన్ నొక్కండి
  • ఒకటి అసెంబ్లీ, ఒకటి పార్లమెంట్ కు ఫ్యాన్ మీద నొక్కితే చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా ఉండదు
  • పేదల రక్తం తాగేందుకు వస్తున్న చంద్రగ్రహణాలను సాగనంపండి
  • ప్రతి పక్షాలకు ఓటు వేయడం అంటే మళ్లీ లంచాలకు అవకాశం ఇవ్వడమేనేని చెప్పండి
  • జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదని ప్రతి ఇంటిలోనూ చెప్పండి
  • జగనన్నకు కుట్రలు చేసే అలవాటు లేదని ప్రతి ఇంట్లోనూ చెప్పండి
  • ప్యాకేజీ కోసం రా .. కదలి రా అంటూ బాబు .. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు
  • చంద్రబాబు అండ్ కో .. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్
  • 175 స్థానాల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులే లేరు
  • చంద్రబాబు అండ్ కో పై యుద్దానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా
  • చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ కు ఏపీతో ఏం సంబంధం ?
  • దిగజారుడు పార్టీలన్నీ పేదవాడి భవిష్యత్తునే టార్గెట్ చేసుకుంటున్నాయి
  • వీరితో యుద్దానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా ?
  • ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ వైఎసార్సీపీ
  • ప్రజలకు మంచి చేయగలిగాం కాబట్టే ఓటు వేయమని అడుగుతున్నా
  • అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎసార్సీపీ
  • పార్టీలోని ప్రతీ కార్యకర్తకూ అండగా ఉంటామని చెబుతున్నా
  • మీకు మరింత మంచి చేసే బాధ్యత నాది
  • వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175 కి 175 అసెంబ్లీ స్థానాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement