
వివరాలు వెల్లడించిన ఏసీపీ శ్రీనివాస్
మియాపూర్: రోడ్డుపై నిలబడి ఉన్న మతిస్థిమితం లేని మహిళను బలవంతంగా స్కూటీపై ఎక్కించుకొని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్‌రావు ఆ కేసు వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా ఆమీన్‌పూర్ బద్దంకొమ్ములోని మారుతీ హిల్స్ కాలనీకి చెందిన బాలకుమార్ అలియాస్ శివకుమార్(25) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
అతని స్నేహితుడైన మెదక్ జిల్లా దుర్గాగుడి పెద్దపూర్‌కు చెందిన గౌరగల్ల మహేష్ (24)తో కలిసి 21వ తేదీన బ్లూ కలర్ స్కూటీపై ఇద్దరూ మియాపూర్ బొల్లారం క్రాస్ రోడ్డు నుంచి బొల్లారం వైపు వెళుతున్నారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో మియాపూర్ క్రాస్ రోడ్డు బస్టాప్ వద్ద ఓ మహిళ(36) ఒంటరిగా కనిపించడంతో బలవంతంగా స్కూటీపై ఎక్కించుకొని వెళ్లారు. ఐలాపూర్ తండా సమీపంలో ఎవరూ లేని ప్రాంతం చూసి ఆ ఇద్దరు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై ఆమెను వదిలేసి పరారయ్యారు. మహిళపై అత్యాచారం చేసినట్టు పరీక్షల్లో నిర్థారణ అయ్యింది.
ఓ కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు విచారణ భాగంగా మియాపూర్‌లో తనిఖీలు చేస్తుండగా బాలకుమార్, మహే‹Ùలను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్టు అంగీకరించారు. నిందితుల్లో బాలకుమార్‌పై చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్నాచింగ్, రాబరీ, ఇళ్లల్లో దొంగతనాలు, భూ తగాదాలు వంటివి 8 కేసులు ఉన్నాయి. మహే‹Ùపై ఓ మర్డర్, దొంగతనం కేసులు అల్లాదుర్గం పీఎస్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో సీఐ క్రాంతి కుమార్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రోహింగ్యాల వ్యవస్థీకృత వ్యభిచార దందా
Comments
Please login to add a commentAdd a comment