
మాట్లాడుకుందామని పిలిచి కొట్టారు: శ్రీకాంత్
హైదరాబాద్: గాయని మధుప్రియ, ఆమె భర్త శ్రీకాంత్ ల మధ్య నెలకొన్న వివాదం మలుపులు తిరుగుతోంది. ఒకవైపు పోలీస్ స్టేషన్ లో నమోదయిన వేధింపుల కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే శనివారం అర్ధరాత్రి ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి.
ఉప్పల్ లోని తమ ఇంటిపై శ్రీకాంత్ అనుచరులు దాడిచేశారని మధుప్రియ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే శ్రీకాంత్ వాదన మాత్రం మరోలా ఉంది. మాట్లాడుకుందాం రమ్మని మధుప్రియ బంధువులు పిలిస్తేనే వెళ్లానని, అక్కడ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని శ్రీకాంత్ మీడియాకు సమాచారం ఇచ్చాడు.