షార్ట్ ఫిలింలలో అవకాశం ఇచ్చి.. | srikanth, a short film director fell in love with madhu priya | Sakshi
Sakshi News home page

షార్ట్ ఫిలింలలో అవకాశం ఇచ్చి..

Published Fri, Oct 30 2015 9:17 AM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

షార్ట్ ఫిలింలలో అవకాశం ఇచ్చి..

షార్ట్ ఫిలింలలో అవకాశం ఇచ్చి..

గాయని మధుప్రియ ప్రేమించిన శ్రీకాంత్ గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతడు రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని కొందరు, రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని మరికొందరు చెబుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం షార్ట్ ఫిలింలు డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. ఇలా షార్ట్ ఫిలింలు తీసే క్రమంలోనే అతడు రెండు మూడు షార్ట్ ఫిలింలలో మధుప్రియకు అవకాశం ఇచ్చాడని, వాటి షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతున్నారు.

హైదరాబాద్ నల్లకుంట ప్రాంతంలో మధుప్రియ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ సమీపంలోనే శ్రీకాంత్ కూడా ఉండేవాడని, అప్పుడే ఇద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది. రెండేళ్లుగా వీళ్ల మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నా.. నెల రోజుల క్రితమే ఆమె మేజర్ కావడంతో, ఆ తర్వాతి నుంచి ఇరువైపుల పెద్దలను తమ పెళ్లి గురించి వీళ్లు అడుగుతున్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించినా.. మధుప్రియ తరఫు వాళ్లు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇప్పటికీ ఎలాగోలా పెళ్లిని ఆపేందుకు వాళ్లవైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement