'మధుప్రియ మాటలు నిజమైతే పీక కోసుకుంట' | i will kill my self: srikanth | Sakshi
Sakshi News home page

'మధుప్రియ మాటలు నిజమైతే పీక కోసుకుంట'

Published Sun, Mar 13 2016 8:42 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

'మధుప్రియ మాటలు నిజమైతే పీక కోసుకుంట'

'మధుప్రియ మాటలు నిజమైతే పీక కోసుకుంట'

హైదరాబాద్: మధుప్రియ చేసిన ఆరోపణలు నిజమైతే తాను పీకను కోసుకుంటానని గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్ అన్నాడు. శ్రీకాంత్ తనపై కత్తులతో దాడి చేసేందుకు వచ్చాడని మధుప్రియ చెప్పింది. ఈ నేపథ్యంలో అతడు స్పందిస్తూ ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే నిలువునా ప్రాణం తీసుకుంటానని, ఉరిశిక్షకు సిద్ధమని, జైలుకు కూడా వెళ్తానని చెప్పాడు. ఘర్షణ నేపథ్యంలో మధుప్రియ భర్త శ్రీకాంత్ సాక్షి స్టూడియోకి వచ్చి మాట్లాడగా.. మధుప్రియ ఇంటి నుంచి సమాధానాలు చెప్పింది.

ఈ సందర్బంగా శ్రీకాంత్ స్టూడియో నుంచి మాట్లాడుతూ మధుప్రియ చెప్పే మాటలు నిరూపిస్తే జిందగీలో ఆమెకు నాముఖం చూపించబోనని అన్నాడు. తాను ఆమెతో మాట్లాడేందుకు ఎంతో ప్రయత్నించానని అన్నాడు. వాళ్ల బావ మహేష్కు ఫోన్ చేస్తే .. మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద అన్నారని.. తర్వాత ఉస్మానియా, ఆ తర్వాత ఫీవర్ ఆస్పత్రి అన్నారని చివరికి ఇంటికి రా అని పిలిచి అక్కడకు వెళ్లగానే శ్రీనివాస్ రెడ్డి అన్న వ్యక్తికి వాళ్ల అమ్మ కర్ర ఇచ్చి కొట్టించిందని అన్నాడు. తాను ఏనాడైనా ఆస్తి కోసమో, కట్నం కోసమో ఇబ్బంది పెట్టలేదని అన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement