'కడుపులో తన్నాడు.. కత్తులతో వచ్చాడు' | madhu priya fires on husband srikanth | Sakshi
Sakshi News home page

'కడుపులో తన్నాడు.. కత్తులతో వచ్చాడు'

Published Sun, Mar 13 2016 8:29 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

'కడుపులో తన్నాడు.. కత్తులతో వచ్చాడు'

'కడుపులో తన్నాడు.. కత్తులతో వచ్చాడు'

హైదరాబాద్: 'నిన్ను చేసుకున్నాకే నాకు దరిద్రం పట్టుకుంది. నాజీవితం నాశనమైంది. బతికితే ఇక్కడే బతుకు చస్తే ఇక్కడే చావు' అంటూ ప్రతి రోజు తనను కొడుతున్నాడని సింగర్ మధుప్రియ తన భర్త శ్రీకాంత్ పై ఆరోపణలు చేసింది. అమ్మనాన్నలను ఎదురించి వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలుసని.. అందరినీ కాదని తన వెంట వెళ్లినందుకు అతడు తన మనసును విరిచేశాడని చెప్పింది. శనివారం రాత్రి మధుప్రియ వాళ్ల ఇంటివద్ద ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భర్త శ్రీకాంత్ సాక్షి స్టూడియోకి వచ్చి మాట్లాడగా.. మధుప్రియ ఇంటి నుంచి సమాధానాలు చెప్పింది. మధుప్రియ మాట్లాడుతూ .. పెళ్లయిన మూడు నెలలు మాత్రమే శ్రీకాంత్ బాగున్నాడని, అలాగని మంచోడు కాదని అనబోనని, అప్పుడప్పుడు కూడా బాగానే చూసుకున్నాడని అన్నారు. ఏనాడు తన తండ్రితో ఒక్కమాట పడలేదని, కానీ శ్రీకాంత్ మాత్రం ప్రతిరోజు నన్ను కొడుతున్నాడని, నిన్న కడుపులో తన్నిండని, తిట్టడం కొట్టడం సర్వసాధరణం అయిపోయిందని చెప్పింది.

శ్రీకాంత్ కి ఎంతిష్టమో నాకు తెలియదని, శ్రీకాంత్ అంటే మాత్రం తనకు చాలా ప్రేమ అని అది గత రాత్రితో పోయిందని అన్నారు. తనకు ద్వేషించే అవకాశం ఇచ్చాడని అంది. కానీ శ్రీకాంత్ చేతిలో బాగా దెబ్బలు తిన్నానని, నా మనసు చనిపోయిందని చెప్పింది. తల్లిదండ్రుల మాట వినకుండానే పెళ్లి చేసుకున్న తాను తిరిగి వాళ్ల మాట విని ఎలా మారిపోతానని ప్రశ్నించింది. మాట్లాడటానికి వచ్చే వారు డీసెన్స్ గా ఉండాలని, మా వీధిలో లైట్లు ఎందుకు బంద్ చేశారని ప్రశ్నించింది. శ్రీకాంత్ వాళ్లు కత్తులతో దాడి చేసేందుకు వచ్చారని చెప్పింది. చెత్తగా మాట్లాడింది, చచ్చేలా కొట్టింది నిజం కాదంటే ఒప్పుకోనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement