వివాహేతర సంబంధంతోనే రైతు హత్య | murdar comenced for illegal contact | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధంతోనే రైతు హత్య

Published Sat, Sep 10 2016 11:44 PM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ నంజుండప్ప - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ నంజుండప్ప

రేణిగుంట : తమ కుటుంబానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కక్షతోనే రైతును ఇద్దరు వ్యక్తులు హత్య చేశారని రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని దిగువ మల్లవరంలో గత నెల 15వ తేదీ రాత్రి వేరుశనగ కాయల వద్ద కాపలా వెళ్లిన రైతు పద్మముని (60) హత్యకు గురయ్యాడని తెలిపారు. ఈ కేసును అర్బన్‌ సీఐ బాలయ్య, ఎస్‌ఐ మధుసూదన్‌రావు దర్యాప్తు చేశారని పేర్కొన్నారు. విచారణలో దిగువ మల్లవరానికి చెందిన నాగరాజు సోదరుని భార్యతో పద్మముని వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడన్న అనుమానంతో హత్యకు పథకం రచించారని పేర్కొన్నారు.

పొలంలో పద్మముని ఒక్కడే కాపలా ఉన్నట్లు నిర్ధారించుకున్న నాగరాజు(35) తన బంధువు రమణయ్య(55)తో కలిసి రాయితో మోది, కత్తితో గొంతుకోసి హత్య చేశారని తెలిపారు. అనంతరం వారు పరారయ్యారని పేర్కొన్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెల్లడి కావడంతో నిందితులు శనివారం ఉదయం వీఆర్‌వో విజయభాస్కర్‌రెడ్డి వద్ద లొంగిపోయి తామే హత్య చేసినట్లు అంగీకరించారని వివరించారు. నిందితులను వీఆర్‌వో పోలీసులకు అప్పగించారని తెలిపారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంతో కృషి చేసిన సీఐ, ఎస్‌ఐలతోపాటు పోలీసు సిబ్బంది రమణ, వరప్రసాద్, శేఖర్, మధులకు రివార్డులు ఇవ్వాలని తిరుపతి అర్బన్‌ ఎస్పీ జయలక్ష్మికి విన్నవించినట్లు తెలిపారు. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement